బాంద్రాలో ఖుషీ కపూర్‌ చిన్న ఫ్లాట్‌.. రూ.63 లక్షలకు కొనుగోలు

Bollywood actress Khushi Kapoor, daughter of filmmaker Boney Kapoor, has purchased a small apartment in Bandra West, Mumbai, for ₹63 lakh.

Sep 11, 2026 - 03:25
 0  13
బాంద్రాలో ఖుషీ కపూర్‌ చిన్న ఫ్లాట్‌.. రూ.63 లక్షలకు కొనుగోలు
khushi-kapoor-bandra-west-flat-rs-63-lakh

బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ కుమార్తె, నటి ఖుషీ కపూర్ ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో ఓ చిన్న అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్‌ పత్రాల ప్రకారం.. 180 చదరపు అడుగుల కార్పెట్‌ ఏరియా ఉన్న ఈ ఫ్లాట్‌కు ఆమె రూ.63 లక్షలు చెల్లించారు. సెప్టెంబర్‌ 1, 2026న ఈ లావాదేవీ రిజిస్టర్‌ అయింది. ఈ ఫ్లాట్‌ బాంద్రా వెస్ట్‌లోని 25వ రోడ్డులో ఉన్న సమ్‌తాదీప్‌ బిల్డింగ్‌లో ఉంది. దీని బిల్ట్‌అప్‌ ఏరియా 216 చదరపు అడుగులు. రిజిస్ట్రేషన్‌ పత్రాల ప్రకారం ఖుషీ కపూర్‌ ఈ ఆస్తిని ఫరూక్‌ చాగ్లా అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశారు.

ఈ కొనుగోలుపై ఆమె రూ.3.15 లక్షల స్టాంప్‌ డ్యూటీ చెల్లించారు. ఈ లెక్కన కార్పెట్‌ ఏరియా ఆధారంగా చదరపు అడుగుకు సుమారు రూ.35 వేల చొప్పున, బిల్ట్‌అప్‌ ఏరియా ప్రకారం సుమారు రూ.29,167 చెల్లించినట్టవుతుంది. అయితే ఇవి రిజిస్ట్రేషన్‌లో నమోదైన లావాదేవీ విలువ ఆధారంగా చేసిన లెక్కలు మాత్రమేనని అంటుననారు. సినీ ప్రముఖులు ఎక్కువగా విలాసవంతమైన, భారీ విస్తీర్ణం ఉన్న ఇళ్లను కొనుగోలు చేసే ముంబైలో ఖుషీ కపూర్‌ కేవలం 180 చదరపు అడుగుల ఫ్లాట్‌కు రూ.63 లక్షలు వెచ్చించడం ఆసక్తికరంగా మారింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0