రాంరెడ్డి సమాజానికెంతో ఉపయోగకరమని చినజీయర్‌స్వామి ప్రశంసలు
Chinna Jeeyar Swamy praised Ark Group Chairman Gummi Ram Reddy for his contribution to society at the launch of Ark Artha and Ark Aryama luxury villa projects in Kongara Kalan.
* ఆర్క్ అర్థ, అర్యమా ప్రాజెక్టుల ఆవిష్కరణ
* ముఖ్య అతిథిగా విచ్చేసిన చినజీయర్‌స్వామి
రాంరెడ్డి గారు గొప్ప ప్రాజెక్టును చేస్తున్నారని.. ఇందుకోసం మద్ధతు పలకడానికి అనేకమంది విచ్చేసినందుకు సంతోషంగా ఉందని చిన్నజీయర్ స్వామి తెలిపారు. ఆదివారం కొంగరకలాన్లో ఆర్క్ అర్థా, ఆర్క్ అర్యమా లగ్జరీ విల్లా ప్రాజెక్టులను ఆరంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లలో తెలుగువారికి భారతదేశంలో పెద్దగా గుర్తింపు ఉండేది కాదని.. ఉత్తర భారతదేశంలోకి వెళితే తెలుగువారిని మదరాసీలుగా పిలిచేవారని గుర్తు చేశారు. తమ గురువు పెద్ద జీయర్‌స్వామి గురించి పలు ఆసక్తికరమైన విశేషాల్ని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఈ ప్రాజెక్టులకు అర్థా, అర్యమా అని పేరు పెట్టినందుకు సంతోషంగా ఉందన్నారు. అర్థ.. అర్థం అంటే కొందరికీ వ్యర్థంగా కనిపిస్తుందని.. అలాంటివారంతా బాటిళ్ల మీద పబ్బుల మీద ఖర్చు పెడుతుంటారని అన్నారు. కానీ, రాంరెడ్డి లాంటి వారు సమాజానికి ఎంతో ఉపయోగకరంగా నిలుస్తున్నారని కొనియాడారు. తన వ్యాపారాన్ని, కుటుంబాన్ని చూసుకోవడంతో పాటు సమాజానికి అవసరమయ్యే దాతృత్వ పనుల్ని చేపడుతున్నారని ప్రశంసించారు. అందుకే ఇలాంటి వ్యక్తుల్ని మనమంతా దీవించాల్సిన అవసరముందని తెలిపారు.
ఈ సందర్భంగా ఆర్క్ గ్రూప్ ఛైర్మన్ గుమ్మి రాంరెడ్డి మాట్లాడుతూ.. చిన్నజీయర్ స్వామీజీ చేతుల మీదుగా తమ ప్రాజెక్టులను ఆరంభించడం అద్భుతమైన అవకాశంగా కొనియాడారు. ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చెందుతున్న దక్షిణ హైదరాబాద్లో తాము రెండు ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ్నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో 330 అడుగుల రతన్ టాటా రోడ్డును ఆమన్‌గల్ వరకూ ప్రభుత్వం ఆరంభించిందని తెలిపారు. సౌత్ హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ డెస్టినేషన్గా డెవలప్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎడతెగక కృషి చేస్తున్నారని అన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెడితే అత్యధిక రాబడిని అందుకోవచ్చని గుర్తు చేశారు.
* నవంబరు 1న సెకండ్ ఎడిషన్ ఈక్వాలిటీ రన్‌ను నిర్వహిస్తున్నామని ఆర్క్ ప్రతినిధి తెలిపారు. చిన్నారుల నుంచి పెద్దల వరకూ వారి సామర్థ్యాన్ని బట్టి ఈ రన్‌లో పాల్గొనాలని కోరారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0