ఆ ఇంటి ఖరీదు రూ.508 కోట్లు

Pop star Taylor Swift and American football star Travis Kelce’s new lakefront mansion in Bratenahl, Ohio, is making headlines for its luxury and advanced security features.

Sep 17, 2026 - 04:24
 0  25
ఆ ఇంటి ఖరీదు రూ.508 కోట్లు
taylor-swift-travis-kelce-508-crore-mansion
  • ఎవరైనా దగ్గరకు వెళ్తే వాయిస్ వార్నింగ్
  • అదరహో అనిపిస్తున్న టేలర్ స్విఫ్ట్–ట్రావిస్ కెల్సీ కొత్త ఇల్లు

ప్రముఖ పాప్‌స్టార్ టేలర్ స్విఫ్ట్, అమెరికన్ ఫుట్‌బాల్‌ స్టార్ ట్రావిస్ కెల్సీ దంపతుల కొత్త నివాసం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. అందుకు కారణం.. ఆ ఇంటి విలాసం మాత్రమే కాదు, అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక భద్రతా వ్యవస్థ కూడా! తమ ప్రైవసీకి భంగం కలగకుండా ఇంటి దగ్గరకు ఎవరైనా అతిగా చేరితే ఆటోమేటిక్‌గా వాయిస్‌ వార్నింగ్‌ ఇచ్చేలా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సమాచారం.

ఈ దంపతులు అమెరికాలోని ఒహాయో రాష్ట్రం బ్రాటెనాల్‌లో 21,000 చదరపు అడుగుల లేక్‌ఫ్రంట్‌ మాన్షన్‌ను 5.35 మిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.508 కోట్లు) మార్చిలో కొనుగోలు చేశారు. లేక్‌ ఎరీ తీరంలో ఉన్న ఈ భారీ భవనంలో 8 బెడ్‌రూమ్‌లు, 11 బాత్‌రూమ్‌లు ఉన్నాయి. అంతేకాదు.. ప్రత్యేక గేమ్‌ రూమ్‌, ప్రైవేట్‌ థియేటర్‌ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. ప్రశాంతమైన, కొంత ఏకాంతంగా ఉండే లేక్‌ఫ్రంట్‌ కమ్యూనిటీలో ఈ ఇల్లు ఉంది. ట్రావిస్‌ కెల్సీ చిన్ననాటి నివాసమైన క్లీవ్‌ల్యాండ్‌ హైట్స్‌కు ఇది కొన్ని మైళ్ల దూరంలోనే ఉంటుంది.

దగ్గరకు వెళ్తే.. హెచ్చరిక!

టేలర్‌, కెల్సీ సెలబ్రిటీ హోదా దృష్ట్యా వారి కొత్త ఇంటి చుట్టూ భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. తాజాగా ఓ పొరుగువ్యక్తి ఇంటికి దగ్గరగా వెళ్లగా.. లోపలికి ప్రవేశించవద్దంటూ ఆటోమేటిక్‌ వాయిస్‌ వార్నింగ్‌ వచ్చినట్లు స్థానికులు వెల్లడించారు. అయితే ఈ వాయిస్‌ అలర్ట్‌ వ్యవస్థ మొత్తం ప్రాపర్టీకి ఏర్పాటు చేశారా? లేక మాన్షన్‌ చుట్టూ మాత్రమే ఉందా? అన్నది స్పష్టంగా తెలియలేదు.

బ్రాటెనాల్‌ ప్రాంతంలో ఇప్పటికే భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. గ్రామంలో చిన్న పోలీసు బలగం నిరంతరం పెట్రోలింగ్‌ చేస్తుంది. సమీపంలోని కాండోమినియంలలో 24 గంటల భద్రతా సిబ్బంది కూడా ఉంటారు. కాగా, ఈ మాన్షన్‌ను టేలర్‌ స్విఫ్ట్‌, ట్రావిస్‌ కెల్సీ 2026 మార్చిలో కొనుగోలు చేశారు. ఆ తర్వాత జూలైలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.

అయితే ఒహాయో ఇల్లు వారి ప్రధాన నివాసంగా ఉండకపోవచ్చని సమాచారం. ట్రావిస్‌ కెల్సీకి కాన్సాస్‌లోని లీవుడ్‌లో ఉన్న ఇల్లు ప్రస్తుతం ప్రధాన నివాసంగా కొనసాగుతోంది. టేలర్‌ స్విఫ్ట్‌కు నాష్‌విల్లే, రోడ్‌ ఐలాండ్‌, బెవర్లీ హిల్స్‌తో పాటు న్యూయార్క్‌లోని ట్రిబెకాలోనూ ప్రాపర్టీలు ఉన్నాయి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0