ఏక్తా క‌పూర్ రియ‌ల్ పాఠాలు

Television producer and Balaji Telefilms promoter Ekta Kapoor has shared valuable insights into how her father, Bollywood actor Jeetendra, built long-term family wealth through savings, real estate investments, and diversification into emerging businesses.

Oct 26, 2026 - 07:50
Oct 28, 2026 - 07:51
 0  59
ఏక్తా క‌పూర్ రియ‌ల్ పాఠాలు
ఏక్తా క‌పూర్ రియ‌ల్ పాఠాలు

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు జితేంద్ర కుటుంబం సంపదను ఎలా సృష్టించింది? వినోద రంగంలో విజయాలు సాధించినప్పటికీ ఆ కుటుంబం రియల్ ఎస్టేట్‌ వైపు ఎందుకు అడుగులు వేసింది? దీనిపై ప్రముఖ టెలివిజన్‌ నిర్మాత, బాలాజీ టెలిఫిల్మ్స్‌ ప్రమోటర్‌ ఏక్తా కపూర్‌ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, దాన్ని పొదుపు చేసి సరైన రంగాల్లో పెట్టుబడి పెట్టడం కూడా అంతే ముఖ్యమని తన తండ్రి జితేంద్ర నమ్మేవారని చెప్పారు. భూమి, ఇళ్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలిక సంపదను నిర్మించుకోవచ్చని అభిప్రాయపడ్డారు.

రియల్ ఎస్టేట్‌ను అన్ని వ్యాపారాలకు అండగా నిలిచే పెద్దన్నతో పోల్చారు. అక్టోబర్‌ 10న విడుదలైన ది రణ్‌వీర్ షో పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఆమె.. తమ కుటుంబం అనుసరించిన పెట్టుబడి సూత్రాలను వివరించారు.

జితేంద్ర అనుసరించిన విధానం

జితేంద్ర ఒకప్పుడు ముంబైలోని చాల్‌లో చిన్న గదిలో కుటుంబంతో కలిసి జీవించేవారు. పరిమిత ఆర్థిక వనరులతో ప్రారంభమైన ఆయన ప్రయాణం.. సినీ రంగంలో విజయాలు, ఆ తర్వాత వ్యాపారాల్లో పెట్టుబడుల వరకు సాగింది.

కష్టపడి సంపాదించిన డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా పొదుపు చేయాలనేది ఆయన ప్రధాన సూత్రమని ఏక్తా వివరించారు. డబ్బు చేతికి వచ్చినప్పుడు దాన్ని ఖర్చు చేయడం కంటే భవిష్యత్తు అవసరాల కోసం దాచుకోవాలని తన తండ్రి భావించేవారని చెప్పారు.

మొదట కొంత మొత్తాన్ని సురక్షితమైన పెట్టుబడుల్లో ఉంచి, ఆ తర్వాత భూములపై పెట్టుబడులు పెట్టడం, ఇతర వ్యాపారాల గురించి తెలుసుకోవడం ద్వారా సంపదను పెంచుకోవచ్చని ఆయన అనుసరించిన విధానాన్ని వివరించారు. ఈ క్రమంలో కుటుంబ భద్రతకు ప్రాధాన్యం ఇస్తూనే, సంపదను మరింత పెంచే అవకాశాలను అన్వేషించారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: అభినందన్ లోధా బ్రాండ్ అంబాసిడర్ గా రణ్ బీర్ కపూర్

తండ్రి అడుగుజాడల్లోనే ఏక్తా

జితేంద్ర రియల్ ఎస్టేట్‌ రంగంలోకి అడుగుపెట్టిన తీరు కూడా ఆసక్తికరమేనని ఏక్తా తెలిపారు. సుమారు 65 ఏళ్ల వయసులో ఆయన ఈ వ్యాపారంపై దృష్టి సారించారని, వయసు కొత్త అవకాశాలకు అడ్డంకి కాదని చెప్పారు. ప్రస్తుతం 84 ఏళ్ల వయసులోనూ ఆయన వ్యాపార కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్నారని వివరించారు.

నిర్మాణ రంగంలో మంచి ఫలితాలు సాధించిన జితేంద్ర.. డేటా సెంటర్ల వ్యాపారంలోనూ ముందుగానే పెట్టుబడులు పెట్టారని ఏక్తా వెల్లడించారు. డిజిటల్ సేవలు, క్లౌడ్ కంప్యూటింగ్‌ విస్తరణతో డేటా సెంటర్లకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో, ఈ రంగంలో ఆయన ముందుచూపుతో వ్యవహరించారని పేర్కొన్నారు. తన తండ్రి, సోదరుడు తుషార్ కపూర్‌ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తనకంటే మెరుగైన ఫలితాలు సాధించారని ఏక్తా అంగీకరించారు.

జితేంద్ర కుటుంబం రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడమే కాకుండా, భారీ స్థాయి ఆస్తుల లావాదేవీల్లోనూ పాల్గొంది. గతంలో తక్కువ ధరకు కొనుగోలు చేసిన ఆస్తులు కాలక్రమంలో గణనీయమైన విలువను సంతరించుకోవడం ఈ రంగంపై వారి ఆసక్తికి ఉదాహరణగా నిలుస్తోంది. ముంబైలోని పాలి హిల్‌లో జితేంద్ర 1980లలో రూ.4.25 లక్షలకు బంగ్లాను కొనుగోలు చేశారు.

ఆ ఇంటితో పాటు 3,450 చదరపు అడుగుల స్థలం కూడా వచ్చిందని ఆయన గతంలో వెల్లడించారు. మీడియా కథనాల ప్రకారం, ఆ స్థలం ప్రస్తుత విలువ సుమారు రూ.450 కోట్లుగా అంచనా వేస్తున్నారు. 2025 మేలో జితేంద్ర కుటుంబానికి చెందిన రెండు సంస్థలు ముంబైలోని అంధేరిలో 2.39 ఎకరాల భూమిని ఎన్‌టీటీ గ్లోబల్ డేటా సెంటర్స్‌కు రూ.855 కోట్లకు విక్రయించాయి.

ఇదీ చదవండి: రాకేశ్‌ రోషన్‌ ఫ్లాట్‌కు భారీ అద్దె!

సొంత ఇల్లు ఉంటే...

2025 జూన్‌లో జితేంద్ర, ఏక్తా కపూర్‌ కలిసి ముంబైలోని వర్లీలో ఓంకార్ 1973 ప్రాజెక్టులో ఉన్న 2,149 చదరపు అడుగుల ఫ్లాట్‌ను రూ.12.25 కోట్లకు విక్రయించారు. అలాగే 2026 జనవరిలో జితేంద్ర, తుషార్ కపూర్‌కు చెందిన వాణిజ్య ఆస్తిని ఎన్‌టీటీ గ్రూప్‌కు చెందిన సంస్థ రూ.559 కోట్లకు కొనుగోలు చేశారు.

రియల్ ఎస్టేట్‌పై తన అభిప్రాయాన్ని వివరిస్తూ ఏక్తా మరో కీలక అంశాన్ని ప్రస్తావించారు. సొంత ఇల్లు కొనుగోలు చేయడం వల్ల నివసించేందుకు ఒక స్థిరమైన చిరునామా లభించడమే కాకుండా, దీర్ఘకాలంలో ఆస్తి విలువ పెరిగే అవకాశం ఉంటుందని చెప్పారు.

అద్దె ఇంట్లో ఉంటే చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా సొంత ఇంటి కొనుగోలు నిర్ణయాన్ని అంచనా వేసేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. బంగారు ఆభరణాలతో ఇంటిని పోలుస్తూ.. బంగారాన్ని ధరించవచ్చు, అదే సమయంలో దానిని ఆస్తిగా కలిగి ఉండవచ్చని; ఇంట్లో నివసిస్తూనే దానిని ఆస్తిగా కొనసాగించవచ్చని వివరించారు.

వినియోగానికి పనికొచ్చే ఆస్తిగా ఉండటం రియల్ ఎస్టేట్‌కు ఉన్న ప్రత్యేకతగా అభివర్ణించారు. భారత్‌లో తాను పరిచయం ఉన్న సంపన్నుల్లో చాలామంది ఏదో ఒక దశలో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టారని ఏక్తా చెప్పారు. వ్యాపారంలో ఒడుదొడుకులు ఎదురైనా ఆస్తులు దీర్ఘకాలిక ఆర్థిక అండగా నిలిచే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అందుకే రియల్ ఎస్టేట్‌ను ఇతర వ్యాపారాలకు తోడ్పడే పెద్దన్నతో పోల్చానని తెలిపారు.

ఇదీ చదవండి: టైగర్‌ ష్రాఫ్‌ : రూ.7.61 కోట్లకు కొన్న ఫ్లాట్‌ రూ.9 కోట్లకు విక్రయం

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0