ఆఫీస్ లీజుకు ఇచ్చిన రాకేశ్ రోషన్
Rakesh Roshan has leased two commercial office units in Andheri West, Mumbai, to BeingU Studios Pvt Ltd. The 5,574 sq ft office space, located near New Link Road in Oshiwara, carries an initial monthly rent of ₹7.30 lakh, with a 5% annual escalation.
- నెలకు రూ.7.30 లక్షల అద్దె.. మూడేళ్లలో రూ.2.76 కోట్లు
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తండ్రి, ప్రముఖ దర్శకుడు రాకేశ్ రోషన్ తన కమర్షియల్ ప్రాపర్టీ లీజుకు ఇచ్చారు. ముంబైలోని అంధేరీ వెస్ట్‌లో ఉన్న రెండు ఆఫీస్ యూనిట్లను బీయింగ్‌యూ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు లీజుకు తీసుకుంది. మొత్తం 5,574 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ ఆఫీస్‌కు ప్రారంభ నెలవారీ అద్దె రూ.7.30 లక్షలుగా నిర్ణయించారు. ఈ రెండు కమర్షియల్ యూనిట్లు అంధేరీ వెస్ట్‌లోని ఓషివారాలో, న్యూ లింక్ రోడ్ సమీపంలోని కామర్స్ సెంటర్‌లో నాలుగో అంతస్తులో ఉన్నాయి. లీజులో రెండు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి.
సెప్టెంబర్ 9, 2026న లీవ్ అండ్ లైసెన్స్ ఒప్పందాన్ని రిజిస్టర్ చేశారు. ఈ ఒప్పందం 36 నెలల పాటు 2026 ఆగస్టు 1 నుంచి 2029 జూలై 31 వరకు లీజ్ అమల్లో ఉంటుంది. అలాగే రూ.10.95 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని ఒప్పందంల పేర్కొన్నారు. అద్దె ప్రతి సంవత్సరం 5 శాతం పెరుగుతుంది. మొదటి ఏడాది నెలకు రూ.7.30 లక్షలు చెల్లించాలి. రెండో ఏడాది ఇది సుమారు రూ.7.66 లక్షలకు, మూడో ఏడాది రూ.8.04 లక్షలకు చేరుతుంది. ఈ లెక్కన మూడేళ్లలో రాకేశ్ రోషన్‌కు వచ్చే మొత్తం షెడ్యూల్డ్ రెంటల్ ఆదాయం సుమారు రూ.2.76 కోట్లు.
రోషన్ కుటుంబానికి ముంబై కమర్షియల్ రియల్ ఎస్టేట్‌తో అనుబంధం కొనసాగుతోంది. ఇటీవలే రాకేశ్ రోషన్, ఆయన భార్య ప్రమీలా రోషన్ జూహూలోని జేవీపీడీ స్కీమ్‌లో ఉన్న తమ అపార్ట్‌మెంట్‌ను మూడేళ్లకు లీజుకు ఇచ్చారు. ఆ ఒప్పందం ద్వారా సుమారు రూ.1.89 కోట్ల రెంటల్ ఆదాయం వచ్చేలా ఒప్పందం కుదిరింది. అదే సమయంలో 2025 నవంబర్‌లో హృతిక్ రోషన్, రాకేశ్ రోషన్‌కు చెందిన హెచ్‌ఆర్‌ఎక్స్ డిజిటెక్ ఎల్‌ఎల్‌పీ, ప్రమీలా రోషన్‌కు చెందిన ఫిల్మ్‌కుంజ్ సంస్థలు కలిసి అంధేరీ వెస్ట్‌లో 10 ఆఫీస్ యూనిట్లను రూ.28 కోట్లకు కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ పత్రాల ఆధారంగా నివేదికలు వచ్చాయి. రాకేశ్ రోషన్, ప్రమీలా రోషన్ కూడా అంధేరీలో ఐదు కమర్షియల్ ఆఫీస్ యూనిట్లను సుమారు రూ.19.68 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. మరోవైపు హృతిక్ రోషన్ కూడా ముంబైలోని గోరేగావ్ ఈస్ట్‌లో 2,727 చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను ఐదేళ్లకు లీజుకు ఇచ్చారు. ఆ ఒప్పందం మొత్తం విలువ సుమారు రూ.4.84 కోట్లుగా ఉంది. ఇందులోనూ ఏటా 5 శాతం అద్దె పెంపు నిబంధన ఉంది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0