ఎస్వీఎం ఆదిత్య హోమ్స్‌కు షాక్.. రూ.27.16 లక్షలు రీఫండ్
TG-RERA has directed SVM Aditya Homes to refund ₹27.16 lakh, along with applicable interest, to a homebuyer.
ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు తీసుకోకుండా, నిర్మాణం ప్రారంభించకుండా కొనుగోలుదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తే ఊరుకునేది లేదని టీజీ రెరా హెచ్చరించింది. ఎస్వీఎం ఆదిత్య హోమ్స్ సంస్థ రూ.27.16 లక్షలు వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది.
ఎస్వీఎం ఆదిత్య హోమ్స్ సంస్థ ప్రాజెక్టుకు అవసరమైన హెచ్ఎండీఏ అనుమతులు పొందడంలో విఫలమైంది. నిర్మాణ పనులు ప్రారంభించకపోవడంతో పాటు, ప్రాజెక్టును పూర్తి చేసి ఫ్లాట్‌ను అప్పగించాల్సిన ఒప్పంద బాధ్యతలను కూడా నెరవేర్చలేదు.
అయినప్పటికీ కొనుగోలుదారుడి నుంచి డబ్బులు వసూలు చేసింది. ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందుకున్న టీజీ రెరా, బాధితుడికి రూ.27.16 లక్షలను వర్తించే వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది. టీజీ రెరా జారీ చేసిన ఈ ఆదేశాలను పాటించకపోతే రెరా చట్టంలోని సెక్షన్ 63 ప్రకారం జరిమానాలు విధిస్తామని సంస్థలను హెచ్చరించింది.
రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో కొనుగోలుదారుల హక్కులను కాపాడేందుకు నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేసింది.
- ఎస్వీఎం ఆదిత్య హోమ్స్‌పై టీజీ రెరా చర్యలు
- కొనుగోలుదారుడికి రూ.27.16 లక్షలు రీఫండ్
- హెచ్ఎండీఏ అనుమతులు లేకుండా ప్రాజెక్టు
ఇదీ చదవండి: బాచుపల్లిలో వేలం.. 2 నెలల క్రితం అమ్మిన రేటూ రాలేదు!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0