హృతిక్ రోషన్ ఆఫీస్ స్పేస్.. ఐదేళ్లకు రూ.4.84 కోట్ల డీల్!
Bollywood actor Hrithik Roshan has leased his 2,727 sq ft commercial office space in Goregaon East, Mumbai, for five years, generating an estimated ₹4.84 crore in total rental income.
- గోరేగావ్‌లో 2,727 చదరపు అడుగుల కార్యాలయాన్ని లీజుకు ఇచ్చిన బాలీవుడ్ స్టార్..
- నెలకు రూ.7.30 లక్షల అద్దె
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ మరో భారీ రియల్ ఎస్టేట్ డీల్‌తో వార్తల్లో నిలిచారు. ముంబైలోని గోరేగావ్ ఈస్ట్‌లో తనకు చెందిన 2,727 చదరపు అడుగుల కమర్షియల్ ఆఫీస్ స్పేస్‌ను ఐదేళ్ల కాలానికి లీజుకు ఇచ్చారు. ఈ డీల్ ద్వారా ఐదేళ్లలో మొత్తం సుమారు రూ.4.84 కోట్ల అద్దె ఆదాయం హృతిక్‌కు లభించనుంది. హృతిక్ రోషన్‌కు చెందిన ఈ కార్యాలయం ముంబైలోని గోరేగావ్ ఈస్ట్‌లోని లోటస్ కార్పొరేట్ పార్క్‌లో ఉంది. గ్రాహమ్ ఫిర్త్ స్టీల్ కాంపౌండ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టులోని ఈ-వింగ్ 14వ అంతస్తులో 2,727 చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను లీజుకు ఇచ్చారు.
ఈ ప్రాపర్టీని క్వాంటమ్ ఎక్స్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ లీజుకు తీసుకుంది. ఐదేళ్ల లీజ్ ఒప్పందం 2026 ఆగస్టు 31న రిజిస్టర్ కాగా.. లీజ్, అద్దె కాలం సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభమవుతుంది. ఒప్పందం ప్రకారం ప్రారంభ నెలవారీ అద్దె రూ.7.30 లక్షలు. అయితే ప్రతి ఏడాది 5 శాతం అద్దె పెరుగుతంది. అంటే మొదటి ఏడాది నెలకు రూ.7.30 లక్షలు చెల్లించే సంస్థ.. రెండో ఏడాది సుమారు రూ.7.67 లక్షలు, మూడో ఏడాది రూ.8.05 లక్షలు, నాలుగో ఏడాది రూ.8.45 లక్షలు, ఐదో ఏడాది దాదాపు రూ.8.87 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ వార్షిక పెంపులను కలిపితే ఐదేళ్లలో మొత్తం అద్దె విలువ సుమారు రూ.4.84 కోట్లు అవుతుంది.
చదరపు అడుగుకు చూస్తే..
ప్రారంభ నెలవారీ అద్దె రూ.7.30 లక్షలను 2,727 చదరపు అడుగులతో పోలిస్తే.. చదరపు అడుగుకు నెలకు సుమారు రూ.268 అద్దె వస్తుంది. అంటే ప్రారంభ దశలో ఏడాదికి చదరపు అడుగుకు సుమారు రూ.3,212 అద్దె అవుతుంది. అయితే ఇది కేవలం అద్దె లెక్క మాత్రమే. భవనం నిర్వహణ, పన్నులు, ఇతర కమర్షియల్ ప్రాపర్టీ ఛార్జీలు ఒప్పందంలోని నిబంధనల ప్రకారం వేర్వేరుగా ఉండే అవకాశం ఉంది. ఈ డీల్ హృతిక్ రోషన్ రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోలో మరో ముఖ్యమైన లావాదేవీగా నిలిచింది.
ముఖ్యంగా కమర్షియల్ ప్రాపర్టీలను లీజుకు ఇచ్చి క్రమం తప్పకుండా అద్దె ఆదాయం పొందే విధానంపై ఆయన దృష్టి పెట్టినట్లు తాజా లావాదేవీలు సూచిస్తున్నాయి. ఇటీవలే ముంబైలోని అంధేరీ వెస్ట్‌లో దాదాపు 6,000 చదరపు అడుగుల మరో ఆఫీస్ స్పేస్‌ను ఐదేళ్ల కాలానికి లీజుకు ఇచ్చారు. ఆ ప్రాపర్టీకి ప్రారంభ నెలవారీ అద్దె రూ.17 లక్షలుగా ఉంది. కాగా, ముంబై వంటి నగరాల్లో కమర్షియల్ ప్రాపర్టీకి భారీ డిమాండ్ ఉండటంతో ప్రముఖులు, వ్యాపారవేత్తలు తమ ఆస్తులను విక్రయించకుండా లీజుకు ఇచ్చి స్థిరమైన ఆదాయాన్ని పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0