ఎనిమిదేళ్లలో ఇంటి విలువ రెట్టింపు

Hollywood actor and director Justin Baldoni has sold his California home for $2.1 million (approximately ₹19.9 crore), nearly doubling its value in eight years.

Nov 5, 2026 - 05:37
Nov 5, 2026 - 07:59
 0  116
ఎనిమిదేళ్లలో ఇంటి విలువ రెట్టింపు
  • రూ.10 కోట్లకు కొని రూ.20 కోట్లకు అమ్మేసిన హాలీవుడ్‌ నటుడు

స్థిరాస్తి పెట్టుబడులు దీర్ఘకాలంలో ఎంతటి రాబడిని అందిస్తాయో చెప్పడానికి హాలీవుడ్‌ నటుడు, దర్శకుడు జస్టిన్‌ బాల్డోనీ ఉదంతం ఓ ఉదాహరణ. 2017లో 1.04 మిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.9.86 కోట్లు) కొనుగోలు చేసిన ఇంటిని తాజాగా 2.1 మిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.19.9 కోట్లు) విక్రయించారు. ఎనిమిదేళ్లలో ఆ ఇంటి విలువ దాదాపు రెట్టింపైంది.

జస్టిన్‌ బాల్డోనీ విక్రయించిన ఇల్లు కాలిఫోర్నియాలోని కల్వర్‌ సిటీలో ఉంది. 1952లో నిర్మించిన ఈ నివాసంలో మూడు బెడ్‌రూమ్‌లు, మూడు బాత్‌రూమ్‌లు ఉన్నాయి. 5,736 చదరపు అడుగుల స్థలంలో నిర్మించిన ఈ ఇంటిలో స్విమ్మింగ్‌ పూల్‌, చెక్కతో రూపొందించిన ఎత్తైన పైకప్పులు, ఆధునిక ఇంటీరియర్‌ అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

2017లో ఈ ఇంటిని కొనుగోలు చేసిన బాల్డోనీ, ఆయన భార్య ఎమిలీ భారీగా పునరుద్ధరణ పనులు చేపట్టారు. 2020లో ఇంటి పునరుద్ధరణ పూర్తయిన సందర్భంగా బాల్డోనీ సోషల్‌ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇంటిని తీర్చిదిద్దేందుకు మూడేళ్లు పట్టిందని, ప్రతి గోడలోనూ తమ ప్రేమ, శ్రమ ఉన్నాయని పేర్కొన్నారు.

తాజాగా ఈ ఇంటిని 2.1 మిలియన్‌ డాలర్లకు విక్రయించారు. కొనుగోలు ధరతో పోలిస్తే 1.06 మిలియన్‌ డాలర్లు అధికంగా లభించాయి. అంటే దాదాపు 102 శాతం ధర పెరిగినట్లుగా చెప్పవచ్చు.

జస్టిన్‌ బాల్డోనీ, ఆయన భార్య ఎమిలీ, ఇద్దరు పిల్లలు ఇటీవల కాలిఫోర్నియా నుంచి టెన్నెస్సీ రాష్ట్రంలోని నాష్‌విల్లేకు మారారు. అక్కడ సుమారు 3.4 మిలియన్‌ డాలర్ల విలువైన ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. కుటుంబం గతంలో కాలిఫోర్నియాలోని ఓజై ప్రాంతానికి కూడా మారింది.

అక్కడ వారికి ఐదు బెడ్‌రూమ్‌లతో కూడిన స్పానిష్‌ శైలి భవనం ఉంది. 2026 ఏప్రిల్‌లో ఈ ఇంటిని 8.88 మిలియన్‌ డాలర్లకు విక్రయించేందుకు మార్కెట్‌లో పెట్టారు. అయితే అక్టోబర్‌లో ఆ ప్రకటనను తొలగించినట్లు నివేదికలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆ ఆస్తి బాల్డోనీ యాజమాన్యంలోనే ఉంది.

ఇదీ చదవండి: కమర్షియల్ స్పేస్ కొన్న సలీమ్ మర్చంట్

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0