జన్వాడ ఫార్మ్ హౌస్ భూమి నాదే: ప్రదీప్ రెడ్డి
Janwada farmhouse owner Pradeep Reddy says the land belongs to him and KTR has no ownership connection. He says KTR had leased the farmhouse and he is ready to cooperate with authorities.
* కేటీఆర్‌కు ఈ భూమితో ఎలాంటి సంబంధం లేదు
* తమ కుటుంబం 40 ఏళ్ల నుంచి వ్యాపారంలో ఉంది
* తాను ఎవరికీ బినామీగా ఉండాల్సిన అవసరం లేదు
ఆర్ఈజీ న్యూస్: జన్వాడ ఫార్మ్ హౌస్ భూములపై జరుగుతున్న ప్రచారం, రాజకీయ పార్టీల నేతలు పరిశీలనకు వస్తారన్న వార్తల నేపథ్యంలో ఫార్మ్ హౌస్ యజమాని ప్రదీప్ రెడ్డి శుక్రవారం సాయంత్రం స్పష్టతనిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జన్వాడ ఫార్మ్ హౌస్ ఉన్న భూమి తన సొంతమని.. దీనికి కేటీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. కేటీఆర్, తాను చిన్నప్పటి నుంచి స్నేహితులమని.. అందుకే, తన జన్వాడ ఫార్మ్ హౌస్‌ను కేటీఆర్‌కు లీజుకిచ్చానని తెలిపారు. ప్రభుత్వానికి లేదా సంబంధిత అధికారులకు ఏమైనా అనుమానాలు ఉంటే, తనకు నోటీసులను జారీ చేయాలన్నారు. ఈ ఫార్మ్ హౌస్ భూములకు సంబంధించి ఎలాంటి వివాదాలు లేవని.. లీగల్‌గా టైటిల్ క్లియర్‌గా ఉందని తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఏవైనా వివరాలు లేదా పత్రాలు కోరితే, చట్టపరమైన విధానంలో వాటిని సమర్పించడానికి తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. అయితే రాజకీయ పార్టీల నేతలు వచ్చి వ్యక్తిగత ఆస్తిని పరిశీలిస్తామంటూ రాజకీయ వివాదం చేయడం సరికాదని హితువు పలికారు. చట్టపరమైన ప్రక్రియకు తాను పూర్తిగా సహకరిస్తాను అని ప్రదీప్ రెడ్డి స్పష్టం చేశారు. నలభై ఏళ్ల నుంచి తమ కుటుంబం హైదరాబాద్ లోని నిర్మాణ రంగంలో ఉన్నదని ప్రదీప్ రెడ్డి గుర్తు చేశారు. తాను ఎవరికీ బినామీగా ఉండాల్సిన అవసరం లేదని తెలిపారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0