నాలుగు ఫ్లాట్లు.. రూ.22.5 కోట్లు

Bollywood singer and music composer Vishal Mishra has purchased four apartments in Oberoi Sky Heights Cooperative Housing Society, Oshiwara, Lokhandwala, Andheri West, Mumbai, for approximately ₹22.25 crore.

Nov 5, 2026 - 05:25
Nov 5, 2026 - 07:56
 0  104
నాలుగు ఫ్లాట్లు.. రూ.22.5 కోట్లు
బాలీవుడ్‌ గాయకుడు, సంగీత దర్శకుడు విశాల్‌ మిశ్రా.
  • ముంబైలో కొనుగోలు చేసిన సింగర్ విశాల్ మిశ్రా

ప్రముఖ బాలీవుడ్‌ గాయకుడు, సంగీత దర్శకుడు విశాల్‌ మిశ్రా ముంబైలో భారీ స్థిరాస్తి కొనుగోలు చేశారు. అంధేరీ వెస్ట్‌లోని లోఖండ్‌వాలా ప్రాంతంలో నాలుగు అపార్ట్‌మెంట్లను ఏకంగా రూ.22.25 కోట్లకు సొంతం చేసుకున్నారు.

ఈ లావాదేవీలు అక్టోబర్‌ 26, 2026న నమోదయ్యాయి. విశాల్‌ మిశ్రా కొనుగోలు చేసిన నాలుగు అపార్ట్‌మెంట్లు ముంబయిలోని అంధేరీ వెస్ట్‌.. ఓషివారా ప్రాంతంలో ఉన్న ఒబెరాయ్‌ స్కై హైట్స్‌ కో-ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీలో ఉన్నాయి.

లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లోని ఈ ప్రాజెక్టులో నాలుగు అపార్ట్‌మెంట్లను మూడు వేర్వేరు వ్యక్తుల నుంచి కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్‌ పత్రాలు వెల్లడిస్తున్నాయి. ఈ నాలుగు అపార్ట్‌మెంట్ల మొత్తం బిల్ట్‌-అప్‌ ఏరియా 4,058.21 చదరపు అడుగులు.

సూపర్‌ బిల్ట్‌-అప్‌ ఏరియా 5,071 చదరపు అడుగులుగా ఉంది. అంటే సాధారణంగా అపార్ట్‌మెంట్‌ నిర్మాణ విస్తీర్ణంతో పాటు ఉమ్మడి ప్రాంతాలకు సంబంధించిన వాటాను కలిపి లెక్కించిన విస్తీర్ణం సుమారు 5,071 చదరపు అడుగులు. 

ఈ కొనుగోలులో అత్యంత ఖరీదైనది రెండు అపార్ట్‌మెంట్లను కలిపి రెండు అంతస్తుల్లో రూపొందించిన డ్యూప్లెక్స్‌ యూనిట్‌. దీనిని విశాల్‌ మిశ్రా సుమారు రూ.9.30 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ డ్యూప్లెక్స్‌ యూనిట్‌ బిల్ట్‌-అప్‌ ఏరియా 1,640.63 చదరపు అడుగులు కాగా.. సూపర్‌ బిల్ట్‌-అప్‌ ఏరియా 2,050 చదరపు అడుగులుగా ఉంది. దీనికి అనుబంధంగా 565 చదరపు అడుగుల టెర్రస్‌ కూడా ఉంది.

ఇదీ చదవండి: కమర్షియల్ స్పేస్ కొన్న సలీమ్ మర్చంట్

పార్కింగ్‌, టెర్రస్‌లతో సహా కొనుగోలు

ఈ నాలుగు అపార్ట్‌మెంట్ల కొనుగోలులో భాగంగా మూడు స్టిల్ట్‌ కార్‌ పార్కింగ్‌ స్థలాలు కూడా విశాల్‌ మిశ్రాకు లభించాయి. అంతేకాకుండా, రిజిస్ట్రేషన్‌ పత్రాల్లో రెండు టెర్రస్‌ల వివరాలు కూడా ఉన్నాయి. డ్యూప్లెక్స్‌ యూనిట్‌కు 565 చదరపు అడుగుల టెర్రస్‌ ఉండగా.. మరో అపార్ట్‌మెంట్‌కు 380 చదరపు అడుగుల టెర్రస్‌ అనుబంధంగా ఉంది. కాగా, విశాల్‌ మిశ్రా బాలీవుడ్‌లో ప్రముఖ గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, పాటల రచయితగా గుర్తింపు పొందారు.

భావోద్వేగాలతో కూడిన పాటలకు ఆయన ప్రత్యేకమైన శైలి ఉంది. ‘కబీర్‌ సింగ్‌’ సినిమాలోని ‘కైసే హువా’ పాటతో ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ‘యానిమల్‌’ సినిమాలోని ‘పెహ్లే భీ మై’ పాటతో మరింత ప్రజాదరణ పొందారు. ‘జానియే’, ‘మంజా’, ‘ఖూబ్‌సూరత్‌’ (స్త్రీ 2), ‘నాచో నాచో’ (ఆర్‌ఆర్‌ఆర్‌) వంటి పాటలు ఆయన కెరీర్‌లో కీలకంగా నిలిచాయి.

ఇదీ చదవండి: రెండెకరాలు.. రూ.22.4 కోట్లు

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0