హైదరాబాద్‌లో పెప్సీకో భారీ ఆఫీస్‌ లీజ్‌

PepsiCo India has leased 91,314 sq ft of office space in Kokapet, Hyderabad, for its Global Capability Centre (GCC) operations. The five-year lease is estimated to involve a total rental outlay of around ₹35 crore.

Aug 31, 2026 - 03:08
 0  4
హైదరాబాద్‌లో పెప్సీకో భారీ ఆఫీస్‌ లీజ్‌
pepsico-hyderabad-kokapet-office-lease-35-crore
  • ఐదేళ్లకు రూ.35 కోట్ల అద్దె

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో మరో భారీ కమర్షియల్‌ డీల్‌ నమోదైంది. ప్రముఖ ఫుడ్‌ అండ్‌ బెవరేజెస్‌ సంస్థ పెప్పీకో నగరంలోని కోకాపేట్‌లో 91,314 చదరపు అడుగుల ఆఫీస్‌ స్థలాన్ని లీజుకు తీసుకుంది. పెప్సీకో ఇండియా కేపబిలిటీ సెంటర్‌ ఎల్‌ఎల్‌పీ ఈ స్థలాన్ని తన గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్‌ కార్యకలాపాల కోసం వినియోగించనుంది. ఐదేళ్ల లీజ్‌ కాలానికి మొత్తం అద్దె వ్యయం సుమారు రూ.35 కోట్లు ఉండనున్నట్లు ప్రాపర్టీ డేటా సంస్థ ప్రాప్‌స్టాక్‌ వెల్లడించింది. ఈ లీజ్‌ కోకాపేట్‌లోని లక్ష్మి ఇన్‌ఫోబాన్‌ టవర్‌-4లో ఆరో, ఏడో అంతస్తులను కలిగి ఉంది. మార్చి 13, 2026 నుంచి లీజ్‌ ఒప్పందం అమల్లోకి వచ్చింది.

భవనం యజమాని జీఏఆర్ అండ్ సన్ బిల్డర్స్ ఎల్ఎల్ పీతో పెప్సీకో ఈ ఒప్పందం చేసుకుంది. చదరపు అడుగుకు నెలకు రూ.58 చొప్పున ప్రారంభ అద్దెగా నిర్ణయించగా.. నెలకు సుమారు రూ.52.96 లక్షలు చెల్లించనుంది. ఒప్పందంలో భాగంగా ప్రతి ఏడాది అద్దెను 5 శాతం పెంచే నిబంధన ఉంది. అలాగే పెప్పీకో సుమారు రూ.4.76 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించినట్లు పత్రాల్లో వెల్లడైంది.  ఐదేళ్ల కాలంలో అద్దె వ్యయం మొత్తం దాదాపు రూ.35 కోట్లకు చేరనుంది. పెప్పీకో తాజా లీజ్‌ హైదరాబాద్‌లో గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్‌కు మరో ఉదాహరణగా నిలుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బహుళజాతి సంస్థలు తమ టెక్నాలజీ, ఫైనాన్స్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌, డేటా అనలిటిక్స్‌, డిజిటల్‌ ఆపరేషన్స్‌ వంటి విభాగాలను భారత్‌లోని జీసీసీల ద్వారా నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న నైపుణ్యమున్న మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, ఐటీ ఎకోసిస్టమ్‌ కారణంగా ఇలాంటి సంస్థలకు నగరం ఆకర్షణీయంగా మారుతోంది. కోకాపేట్‌ ప్రాంతం కూడా గత కొంతకాలంగా హైదరాబాద్‌ కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌లో కీలక మైక్రో మార్కెట్‌గా ఎదుగుతోంది. ఔటర్‌ రింగ్‌ రోడ్‌కు అనుసంధానం, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌కు సమీపం, కొత్త గ్రేడ్‌-ఏ ఆఫీస్‌ ప్రాజెక్టులు అందుబాటులో ఉండటం వంటి అంశాలు పెద్ద కంపెనీలను ఆకర్షిస్తున్నాయి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0