తెలంగాణలో కొత్త బిల్డింగ్ రూల్స్?
The Telangana government is considering major changes to building regulations to provide greater flexibility for homeowners and developers.
- సెట్‌బ్యాక్‌లు 20% తగ్గింపు
- 100 గజాలకే అనుమతి మినహాయింపు
తెలంగాణలో ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అపార్ట్‌మెంట్ నిర్మాణానికి సిద్ధమవుతున్నారా? అయితే మీకు ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పే అవకాశం ఉంది! భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
సెట్‌బ్యాక్‌ల తగ్గింపు నుంచి సెల్లార్ల నిర్మాణం వరకు పలు కీలక ప్రతిపాదనల్ని పరిశీలిస్తోంది. ఇవి అమల్లోకి వస్తే ఇళ్ల యజమానులకు, బిల్డర్లకు గణనీయమైన వెసులుబాటు కలగనుంది.
ప్రస్తుతం అమల్లో ఉన్న భవన నిర్మాణ నిబంధనలను సమీక్షించి, అన్ని మార్పులతో ఒకే సమగ్ర నియమావళిని రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా సెట్‌బ్యాక్‌లను గరిష్ఠంగా 20 శాతం వరకు తగ్గించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. దీనివల్ల భవన నిర్మాణానికి ఉపయోగించుకునే స్థలం పెరగనుంది.
మరోవైపు ప్రస్తుతం 75 గజాల వరకు ఉన్న నిర్మాణ అనుమతుల మినహాయింపు పరిమితిని 100 గజాలకు పెంచాలని ప్రణాళికల్ని రచిస్తోంది. సెల్లార్ నిర్మాణానికి ప్రస్తుతం ఉన్న 900 గజాల కనీస స్థల పరిమితిని 600 గజాలకు తగ్గించడంతో పాటు, కొన్ని కేటగిరీల భవనాలకు రెండు సెల్లార్ల నిర్మాణానికి అవకాశం కల్పించాలని ప్రతిపాదిస్తోంది.
బిల్డర్లకు ఊరటనిచ్చేలా మార్టిగేజ్ నిబంధనల్లోనూ మార్పులు పరిశీలిస్తోంది. 500 చదరపు మీటర్ల వరకు స్థలాల్లో నిర్మించే భవనాలకు మినహాయింపు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో 10 శాతంగా ఉన్న మార్టిగేజ్‌ను 5 శాతానికి తగ్గించే ప్రతిపాదన ఉంది. టీడీఆర్ లావాదేవీల కోసం ప్రత్యేక డేటా బ్యాంకు ఏర్పాటు చేయాలని కూడా భావిస్తోంది.
అయితే ఇవన్నీ ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ప్రతిపాదనలే. తుది నిబంధనలు ఎప్పుడు ఖరారవుతాయి? ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి? అన్నది వేచి చూడాలి. నిర్మాణాలకు వెసులుబాటు కల్పిస్తూనే భవన భద్రత, అగ్నిమాపక సదుపాయాలు, పార్కింగ్ విషయంలో రాజీ పడకుండా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం కీలకం.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ప్రీమియం ఇళ్ల హవా
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0