రెండు వారాల్లో కార్యాచరణ ప్రణాళిక ఇవ్వండి

The Supreme Court has directed NBCC, the Enforcement Directorate, Delhi Police, Noida Authority and the court receiver to submit an action plan within two weeks for completing pending Amrapali projects and handing over flats to homebuyers.

Nov 19, 2026 - 02:22
Nov 19, 2026 - 05:41
 0  33
రెండు వారాల్లో కార్యాచరణ ప్రణాళిక ఇవ్వండి
రెండు వారాల్లో కార్యాచరణ ప్రణాళిక ఇవ్వండి: అమ్రపాలి ఫ్లాట్ల అప్పగింతపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.
  • అమ్రపాలి ఫ్లాట్ల అప్పగింతపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న అమ్రపాలి ప్రాజెక్టుల గృహ కొనుగోలుదారులకు ఫ్లాట్లు వీలైనంత త్వరగా అప్పగించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఎన్‌బీసీసీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), ఢిల్లీ పోలీసులు, నోయిడా అథారిటీ, కోర్టు రిసీవర్‌ తదితర సంబంధిత వర్గాలు రెండు వారాల్లో తమ ప్రతిపాదనలు సమర్పించాలని సూచించింది.

జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ కె. వినోద్‌ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం అమ్రపాలి ప్రాజెక్టుల కొనుగోలుదారులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టింది.

గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేసి, నిజమైన కొనుగోలుదారులకు ఇళ్లు అప్పగించేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, ఇంకా చేపట్టాల్సిన పనులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్‌ 7కు వాయిదా వేసింది.

అమ్రపాలి గ్రూప్‌ నోయిడా, గ్రేటర్‌ నోయిడా ప్రాంతాల్లో చేపట్టిన 28 ప్రాజెక్టులు, ఉప ప్రాజెక్టుల్లో మొత్తం 46,575 ఫ్లాట్లను కొనుగోలుదారులు బుక్‌ చేసుకున్నారు. అయితే బిల్డర్‌ ప్రమోటర్లు, డైరెక్టర్లు కొనుగోలుదారులు చెల్లించిన సొమ్మును దారి మళ్లించారనే ఆరోపణలతో నిర్మాణాలు నిలిచిపోయాయి.

దీంతో బాధితులు 2017లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2019 జులైలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరిస్తూ అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌బీసీసీకి అప్పగించింది. అలాగే కంపెనీ రేరా రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది.

ఇదీ చదవండి: కోర్టు ధిక్కరణ.. రంగారెడ్డి కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష

7 వేల మంది ఇళ్ల స్వాధీనం కోసం ఎదురుచూపులు

గృహ కొనుగోలుదారుల తరఫు న్యాయవాది సమర్పించిన వివరాల ప్రకారం.. 2019 నాటికే 8,538 ఫ్లాట్లను కొనుగోలుదారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఎన్‌బీసీసీ మరో 33,250 ఫ్లాట్ల నిర్మాణాన్ని పూర్తి చేసింది.

అయితే ఇప్పటివరకు సుమారు 22,350 మందికే ఇళ్లను అప్పగించింది. ఇంకా దాదాపు 10,900 మంది ఫ్లాట్ల స్వాధీనం కోసం ఎదురుచూస్తున్నారని కొనుగోలుదారుల తరఫు న్యాయవాది తెలిపారు. అయితే కోర్టు రిసీవర్‌ ఆర్‌.వెంకటరమణి ఈ లెక్కలతో విభేదించారు.

సుమారు 7 వేల మంది ఇంకా స్వాధీనం కోసం ఎదురుచూస్తున్నారని కోర్టుకు వివరించారు. కొందరు కొనుగోలుదారులు అవసరమైన పత్రాలు సమర్పించకపోవడం, బకాయిలు చెల్లించకపోవడం వల్ల కూడా జాప్యం జరుగుతోందని తెలిపారు. 

కొన్ని సందర్భాల్లో నకిలీ పత్రాలు బయటపడ్డాయని పేర్కొన్నారు. మరోవైపు అమ్రపాలి గ్రూప్‌ మాజీ ప్రమోటర్లు, డైరెక్టర్లు కొనుగోలుదారులు చెల్లించిన రూ.5,619.47 కోట్లను దారి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ఇప్పటివరకు కేవలం రూ.744.81 కోట్లే రికవరీ అయినట్లు కొనుగోలుదారుల తరఫు న్యాయవాది సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ప్రమోటర్లు, సంబంధిత వ్యక్తుల ఆస్తులను గుర్తించి జప్తు చేయడం, వేలం వేయడం ద్వారా మరిన్ని నిధులు రాబట్టే అంశాన్ని కూడా సుప్రీంకోర్టు పరిశీలించనుంది. ఈడీ దర్యాప్తు పురోగతి, నిధుల రికవరీకి తీసుకున్న చర్యలపై కూడా వివరాలు కోరింది.

ఇదీ చదవండి: పార్కింగ్‌ వివాదంలో కొనుగోలుదారుడికి మహారెరా షాక్‌

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0