గోపన్‌పల్లిలో రూ.5.52 కోట్ల విలువైన 'బినామీ' భూముల జప్తు!

The Income Tax Department’s Benami Prohibition Unit (BPU) has provisionally seized three plots in Gopanpally, Hyderabad, valued at approximately ₹5.52 crore, over alleged benami ownership.

Aug 25, 2026 - 13:43
 0  3
గోపన్‌పల్లిలో రూ.5.52 కోట్ల విలువైన 'బినామీ' భూముల జప్తు!
gopanpally-benami-land-seizure-rs-5-52-crore
హైదరాబాద్ ఐటీ గ్యాంగ్‌లతో పాటు రియల్ ఎస్టేట్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తూ ఆదాయపన్ను శాఖ కీలక చర్యలు చేపట్టింది. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి గ్రామంలోని అత్యంత ఖరీదైన రూ. 5.52 కోట్ల విలువైన భూములను ఐటీ శాఖకు చెందిన 'బినామీ ప్రొహిబిషన్ యూనిట్’ (బీపీయూ)' తాత్కాలికంగా జప్తు చేసింది. రూపాయి కూడా చెల్లించకుండా యజమానుల హక్కులు పొందినట్లు గుర్తించడంతో ఈ చర్యలు తీసుకున్నారు.
గోపన్‌పల్లి పరిధిలో పక్కపక్కనే ఉన్న ఒక్కొక్కటి 1,210 చదరపు గజాల చొప్పున మొత్తం 3,630 చదరపు గజాల (3 ప్లాట్లు) భూములను ఐటీ శాఖ జప్తు చేసింది. రిజిస్ట్రేషన్, ఐటీ ఆధారాల ప్రకారం ఒక్కో ప్లాట్ విలువ సుమారు రూ. 1.80 కోట్లకు పైమాటే. ఈ భూములను మే 11, 2022న తిరుపతి రావు సత్తు, చింతలపల్లి అమరావతి, స్ఫూర్తి గోనా అనే ముగ్గురి పేర్లతో జీపీఏ ద్వారా పొందినట్లు చూపించారు. నిజానికి ఇది ఏజెన్సీ ఒప్పందంగా కనిపించినప్పటికీ.. భూమిపై పూర్తి యాజమాన్య హక్కులు, అమ్మకపు హక్కులు పొందేలా డ్యాక్యుమెంట్లు సృష్టించారు.
అయితే, ఈ హక్కులు పొందిన ముగ్గురు వ్యక్తులు భూమి కొనుగోలుకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఐటీ విచారణలో తేలింది. అసలు సొమ్ము చెల్లించిన మరియు ప్రయోజనం పొందే అసలు యజమానులు ఎవరో తేలకపోవడంతో వారిని 'అజ్ఞాత వ్యక్తులు'గా నమోదు చేసి, సదరు ముగ్గురిని బెనామీదారులుగా నిర్ణయించారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ భూములను ఇతరులకు బదిలీ చేయడం, విక్రయించడం లేదా ఇతర అవసరాలకు ఉపయోగించడంపై తీవ్ర నిషేధం విధించారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0