రియల్ సంస్థలకు టీజీ రెరా షాక్
The Telangana Real Estate Regulatory Authority (TG-RERA) has imposed a ₹25 lakh penalty on Sanali IT Parks for promoting and attempting to sell units in its Sanali The Edge project at Manchirevula without RERA registration.
- సనాలి ఐటీ పార్క్స్‌కు
- టీజీ రెరా రూ.25 లక్షల జరిమానా
రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని టీజీ రెరా మరోసారి స్పష్టం చేసింది. రెరా రిజిస్ట్రేషన్ లేకుండానే ప్రాజెక్టును ప్రచారం చేయడం, యూనిట్ల విక్రయాలకు ప్రయత్నించడంపై శానాలి ఐటీ పార్క్స్ సంస్థకు రూ.25 లక్షల జరిమానా విధించింది.
మంచిరేవులలోని సనాలి ద ఎడ్జ్ ప్రాజెక్టుకు సంబంధించి టీజీ రెరా ఈ ఆదేశాలు జారీ చేసింది. రెరా చట్టంలోని సెక్షన్లు 3, 4లను ఉల్లంఘించినందుకు సనాలి ఐటీ పార్క్స్‌కు రూ.25 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని 30 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది.
అంతేకాకుండా, ప్రాజెక్టుకు రేరా రిజిస్ట్రేషన్ పొందే వరకు ప్రకటనలు ఇవ్వడం, మార్కెటింగ్ చేయడం, బుకింగ్స్ తీసుకోవడం, యూనిట్లను విక్రయించడం తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేసింది.
టీజీ రెరా జారీ చేసిన ఈ ఆదేశాలను పాటించకపోతే రెరా చట్టంలోని సెక్షన్ 63 ప్రకారం జరిమానాలు విధిస్తామని సంస్థలను హెచ్చరించింది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో కొనుగోలుదారుల హక్కులను కాపాడేందుకు నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేసింది.
- సనాలి ఐటీ పార్క్స్‌కు రూ.25 లక్షల జరిమానా
- సనాలి ద ఎడ్జ్ ప్రాజెక్టుపై టీజీ రెరా చర్యలు
- రిజిస్ట్రేషన్ వచ్చే వరకు అమ్మకాలు నిలిపివేత
ఇదీ చదవండి: తెలంగాణలో కొత్త బిల్డింగ్ రూల్స్?
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0