ఐదేళ్లకు రూ.1.39 కోట్ల ఆదాయం
Bollywood and television actor Ronit Roy has leased his 950 sq. ft. commercial office in Andheri West, Mumbai, for five years, with total rental income expected to reach approximately ₹1.39 crore.
- ముంబైలో ఆఫీస్‌ను అద్దెకిచ్చిన నటుడు రోనిత్ రాయ్
బాలీవుడ్, టెలివిజన్ నటుడు రోనిత్ రాయ్ తన రియల్ ఎస్టేట్ ఆస్తి ద్వారా భారీ అద్దె ఆదాయం పొందనున్నారు. ముంబైలోని అంధేరీ వెస్ట్‌లో ఉన్న తన వాణిజ్య కార్యాలయాన్ని ఐదేళ్ల కాలానికి అద్దెకు ఇచ్చారు. ఈ ఒప్పందం ద్వారా మొత్తం దాదాపు రూ.1.39 కోట్ల అద్దె ఆదాయం అందుకోనున్నారు. నెలకు రూ.2.10 లక్షలతో ప్రారంభమయ్యే అద్దె ప్రతి ఏడాది 5 శాతం చొప్పున పెరగనుంది. ముంబైలోని అంధేరీ వెస్ట్‌లో సిటీ మాల్ సమీపంలోని వాస్తు ప్రెస్టీజ్ భవనం నాలుగో అంతస్తులో ఈ కార్యాలయం ఉంది. మొత్తం 950 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ఆఫీస్‌ను చర్మ, కేశ సంరక్షణ ఉత్పత్తుల వ్యాపారం నిర్వహించే కేరావి కేర్ (ఓపీసీ) ప్రైవేట్ లిమిటెడ్‌కు అద్దెకు ఇచ్చారు. నెలవారీ అద్దె రూ.2.10 లక్షలుగా నిర్ణయించారు.
అద్దెదారు రూ.6.5 లక్షలను సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించారు. ఐదేళ్లలో మొత్తం అద్దె రూ.1,39,24,584కు చేరనుంది. అద్దెను ప్రతి ఏడాది 5 శాతం పెంచేలా నిబంధన పెట్టారు. దాని ప్రకారం మొదటి ఏడాది నెలకు రూ.2.1 లక్షల అద్దె ఉండగా.. రెండో సంవత్సరం రూ.2.2 లక్షలు, మూడో సంవత్సరం రూ.2.31 లక్షలు, నాలుగో ఏడాది రూ.2.43 లక్షలు, ఐదో సంవత్సరం రూ.2.55 లక్షలుగా ఖరారు చేశారు. అలాగే ప్రాపర్టీకి సంబంధించిన నిర్వహణ ఛార్జీలు, పన్నులు, ఇతర నిర్దిష్ట చార్జీలను ఆస్తి యజమాని భరించాలి. విద్యుత్ బిల్లును మాత్రం వినియోగం ఆధారంగా అద్దెదారు చెల్లించాలి. రోనిత్ రాయ్ గతంలోనూ ముంబై రియల్ ఎస్టేట్‌లో భారీ పెట్టుబడి పెట్టారు. 2024లో ఆయన తన భార్య నీలమ్ రాయ్‌తో కలిసి ముంబైలోని వెర్సోవా ప్రాంతంలో 4,258 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన అపార్ట్‌మెంట్‌ను రూ.18.94 కోట్లకు కొనుగోలు చేశారు. లోధా వెర్సోవా ప్రాజెక్టులో ఉన్న ఈ ఫ్లాట్‌కు నాలుగు కార్ల పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి. ఈ లావాదేవీకి సంబంధించి రూ.1.13 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల్లో వెల్లడైంది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0