41 ఏళ్లలో రూ.13 కోట్ల నుంచి రూ.270 కోట్లకు!

Gene Simmons’ Beverly Hills home has transformed from a $1.35 million property in 1984 to a $28 million luxury estate in 2025.

Oct 2, 2026 - 04:06
 0  33
41 ఏళ్లలో రూ.13 కోట్ల నుంచి రూ.270 కోట్లకు!
gene-simmons-beverly-hills-mansion-real-estate-journey

-      రాక్‌స్టార్‌ ఇంటి రియల్‌ జర్నీ ఇది

అమెరికా రాక్‌ బ్యాండ్‌ కిస్‌ సహ వ్యవస్థాపకుడు, బాసిస్ట్‌ జీన్‌ సిమన్స్‌కు చెందిన బెవర్లీ హిల్స్‌ విలాసవంతమైన భవనం రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో భారీ ధరకు చేతులు మారింది. 1984లో సిమన్స్‌ సుమారు 13.5 లక్షల డాలర్లకు కొనుగోలు చేసిన ఈ ప్రాపర్టీ.. నాలుగు దశాబ్దాల తర్వాత 2025లో 2.8 కోట్ల డాలర్లకు విక్రయమైంది. భారత కరెన్సీలో ప్రస్తుత మారకం రేటును బట్టి ఇది సుమారు రూ.270 కోట్లు. సిమన్స్‌ 1984లో ఈ బెవర్లీ హిల్స్‌ ప్రాపర్టీని సుమారు 1.35 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. అంటే దాదాపు రూ.13 కోట్లు. అప్పట్లో అక్కడ ఉన్న సుమారు 3,500 చదరపు అడుగుల ఫామ్‌హౌస్‌ను తొలగించి, భారీ నివాస భవనాన్ని నిర్మించారు.

2021లో ఆయన ఈ ప్రాపర్టీని 16 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.153 కోట్లు) మిలియన్లకు విక్రయించారు. ఆ తర్వాత కొత్త యజమానులు ప్రాపర్టీని భారీగా పునర్నిర్మించారు. సుమారు 3,000 చదరపు అడుగుల నివాస స్థలాన్ని అదనంగా నిర్మించి, ఆధునిక లగ్జరీ హోమ్‌గా తీర్చిదిద్దారు. ఈ మార్పులతో ఇంటి మొత్తం విస్తీర్ణం సుమారు 16,390 చదరపు అడుగులకు చేరింది. పునర్నిర్మాణం తర్వాత ఈ భవనాన్ని 2023లో ఏకంగా 48 మిలియన్ డాలర్లకు మార్కెట్‌లో పెట్టారు. అయితే ఆశించిన ధరకు కొనుగోలుదారు లభించకపోవడంతో పలుమార్లు ధర తగ్గించారు. చివరకు 2025లో 28 మిలియన్ డాలర్లకు డీల్‌ పూర్తయింది.

ఇంట్లో ఏమున్నాయంటే..

ఈ విలాసవంతమైన నివాసంలో 7 బెడ్‌రూమ్‌లు, 11 బాత్‌రూమ్‌లు, విశాలమైన లివింగ్‌ ఏరియాలు, ఎత్తైన సీలింగ్‌లు, చెఫ్‌ కిచెన్‌, మీడియా రూమ్‌, గ్యాలరీ, పలు సిట్టింగ్‌ ప్రాంతాలు ఉన్నాయి. ఇటాలియన్‌ మార్బుల్‌ ఫ్లోరింగ్‌, కస్టమ్‌ ఓక్‌ ప్యానలింగ్‌, బ్రాస్‌ ఫినిషింగ్‌, భారీ కిటికీలు వంటి అంశాలు ఇంటికి ప్రత్యేకతను ఇస్తున్నాయి. బయట సుమారు 1,800 చదరపు అడుగుల ఎంటర్‌టైన్‌మెంట్‌ స్పేస్‌, స్విమ్మింగ్‌ పూల్‌, అవుట్‌డోర్‌ డైనింగ్‌ ఏరియా, ఫైర్‌పిట్‌, గ్రిల్‌ ఏరియాలు ఉన్నాయి. దాదాపు 10 కార్లు పార్క్‌ చేసుకునే గ్యారేజ్‌ కూడా ఉంది. ఈ భవనంలో లగ్జరీతో పాటు కాలిఫోర్నియా వాతావరణానికి అనుగుణంగా పలు సదుపాయాలు ఏర్పాటు చేశారు. పూల్‌కు సోలార్‌ పవర్‌, రేడియంట్‌ హీటెడ్‌ ఫ్లోరింగ్‌, ఫైర్‌-రెసిస్టెంట్‌ నిర్మాణ అంశాలు, వాటర్‌ప్రూఫ్‌ ట్రిపుల్‌-ప్యానల్‌ విండోస్‌, నీటి వినియోగాన్ని తగ్గించే డ్రాట్‌-టాలరెంట్‌ ల్యాండ్‌స్కేపింగ్‌ ఉన్నాయి.

రాక్‌స్టార్‌ ఇంటి నుంచి లగ్జరీ రియల్‌ ఎస్టేట్‌ వరకు

ఈ ప్రాపర్టీ ప్రత్యేకత కేవలం భారీ ధరలోనే లేదు. జీన్‌ సిమన్స్‌ వంటి ప్రముఖ రాక్‌స్టార్‌ నివసించిన ఇల్లు కావడం, ఆ తర్వాత దాని రూపాన్ని పూర్తిగా మార్చి ఆధునిక లగ్జరీ ఎస్టేట్‌గా అభివృద్ధి చేయడం కూడా దీనికి ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. సిమన్స్‌ 1984లో చెల్లించిన 1.35 మిలియన్ డాలర్లతో పోలిస్తే 2025లో వచ్చిన 28 మిలియన్ డాలర్ల ధర సుమారు 20.7 రెట్లు ఎక్కువ. అయితే ఈ పెరుగుదలలో కేవలం బెవర్లీ హిల్స్‌ భూమి విలువ పెరగడమే కాకుండా, మధ్యలో జరిగిన భారీ నిర్మాణం, పునర్నిర్మాణం, ఆస్తి విస్తరణ కూడా కీలక పాత్ర పోషించాయి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0