చీటింగ్ కేసులో ఒరిస్‌ ఇన్‌ఫ్రా ఎండీ అమిత్‌ గుప్తా అరెస్ట్‌

Mumbai Police have arrested Amit Gupta, Managing Director of Oris Infrastructure Pvt. Ltd., in a case involving allegations of forgery, cheating, criminal breach of trust and criminal conspiracy.

Aug 31, 2026 - 05:17
 0  10
చీటింగ్ కేసులో ఒరిస్‌ ఇన్‌ఫ్రా ఎండీ అమిత్‌ గుప్తా అరెస్ట్‌
oris-infra-md-amit-gupta-arrested-cheating-case

రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఓరిస్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అమిత్‌ గుప్తాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన ఫోర్జరీ, మోసం, నమ్మకద్రోహం, క్రిమినల్‌ కుట్ర ఆరోపణల కేసులో ఈ అరెస్టు జరిగింది. గురుగ్రామ్‌లోని సెక్టార్‌ 85లో ఉన్న ‘గోద్రెజ్‌ ఎయిర్‌’ ప్రాజెక్టును గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, ఒరిస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కలిసి చేపట్టాయి. భాగస్వామ్య సంస్థకు సంబంధించిన రికార్డుల్లో అక్రమంగా మార్పులు చేశారన్న ఆరోపణలతో గోద్రెజ్‌ ఫిర్యాదు చేసింది. కంపెనీల రిజిస్ట్రార్‌ వద్ద దాఖలు చేసిన ఎల్ఎల్ పీ చట్టబద్ధ రికార్డుల్లో అనుమతి లేకుండా మార్పులు చేశారని, ఇందుకోసం తప్పుడు పత్రాలను ఉపయోగించినట్లు ఫిర్యాదులో తెలిపింది. ఈ వ్యవహారంలో అమిత్‌ గుప్తా పాత్రపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అమృత్‌సర్‌లో ముంబై పోలీసులు ఆయనను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా, ఆగస్టు 27 వరకు పోలీస్‌ కస్టడీకి రిమాండ్‌ చేసినట్లు సమాచారం.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0