హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మై హోమ్ వ్యోమా

My Home Group has launched My Home Vyoma, an ultra-luxury residential project in Hyderabad’s Financial District, targeting buyers seeking spacious homes, greenery and premium lifestyle amenities.

Oct 24, 2026 - 01:47
 0  7
హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మై హోమ్ వ్యోమా
my-home-vyoma-luxury-apartments-hyderabad

3, 4 బీహెచ్‌కే లగ్జరీ ఫ్లాట్లు
22.34 ఎకరాల్లో 12 టవర్లు.. 
83 శాతం ఓపెన్ స్పేస్.. 
లక్ష చదరపు అడుగులకు పైగా 
విస్తీర్ణంలో రెండు క్లబ్‌హౌస్‌లు

కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ‌, 9030034591: హైద‌రాబాద్ నిర్మాణ రంగంలో అగ్ర‌శ్రేణీ నిర్మాణ సంస్థ మైహోమ్ గ్రూప్.. ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్టులో మై హోమ్ వ్యోమా అనే అల్ట్రా ల‌గ్జ‌రీ ప్రాజెక్టును ఆరంభించింది. న‌గ‌ర వాసుల‌కు విశాలమైన నివాసాలు, పచ్చదనం, ఓపెన్‌ స్పేస్‌లు, సరస్సు అందాలతో ప్రశాంతమైన జీవన అనుభవాన్ని అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యంగా సంస్థ పేర్కొంది. మై హోమ్‌ భూజా, మై హోమ్ నిష‌దా, మై హోమ్‌ గ్రావా వంటి ప్రాజెక్టుల తర్వాత మై హోమ్‌ గ్రూప్‌ చేపడుతున్న మరో కీలక ప్రాజెక్టు ఇది. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో ప్రీమియం నివాసాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని దీనిని అభివృద్ధి చేస్తోంది.

మొత్తం 22.34 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఇందులో గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు 50 అంతస్తుల చొప్పున 12 టవర్లు ఉంటాయి. ఇందులో దాదాపు 2,360 ఫ్లాట్ల‌ను నిర్మిస్తారు. ప్రాజెక్టులో 83 శాతం స్థలాన్ని ఓపెన్‌ స్పేస్‌లకు కేటాయించారు. ఏడు ఎకరాల్లో విస్తృతంగా ల్యాండ్ స్కేపింగ్‌ చేయనున్నారు. దీనివల్ల నివాసితులకు పచ్చదనంతో కూడిన వాతావరణం అందుబాటులో ఉంటుంది.

లాంచ్‌కు ముందే టవర్లకు స్పందన

మై హోమ్‌ వ్యోమా – లివ్‌ ఇన్‌ ద మూమెంట్‌ అనే నినాదంతో ఈ ప్రాజెక్టును రూపొందించారు. వేగంగా మారుతున్న నగర జీవనంలో కొంత ప్రశాంతత, ప్రకృతితో అనుబంధం, కుటుంబంతో నాణ్యమైన సమయం గడిపే అవకాశాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది ఈ కాన్సెప్ట్‌ ఉద్దేశం. విశాలమైన ఓపెన్‌ స్పేస్‌లు, పచ్చదనం, సరస్సు అందాలు ఈ ప్రాజెక్టులో ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. విలాసవంతమైన జీవనంతో పాటు ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకునే నగర వాసులను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును రూపొందించారు.

రెండు భారీ క్లబ్‌హౌస్‌లు

మై హోమ్‌ వ్యోమాలో కలిపి లక్ష చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో రెండు భారీ క్లబ్‌హౌస్‌లు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి టవర్‌లో డబుల్‌ హైట్‌ ప్రవేశ లాబీ ఉంటుంది. వాహనాల పార్కింగ్‌ కోసం నాలుగు బేస్‌మెంట్‌ స్థాయిలను ఏర్పాటు చేయనున్నారు. రెండు స్విమ్మింగ్‌ పూల్స్‌ కూడా ప్రాజెక్టులో భాగంగా ఉంటాయి. వీటిలో ఒకటి పోడియం స్థాయిలో, మరొకటి క్లబ్‌హౌస్‌ టెర్రస్‌పై ఏర్పాటు చేయనున్నారు. విశాలమైన పచ్చని ప్రదేశాలతో పాటు ఈ సౌకర్యాలు నివాసితులకు విశ్రాంతి, వ్యాయామం, వినోదం, సామాజిక కార్యక్రమాలకు ఉపయోగపడనున్నాయి. కేవలం నివాస స్థలానికే పరిమితం కాకుండా, మెరుగైన జీవనశైలికి అవసరమైన సౌకర్యాలను ఒకే ప్రాంగణంలో అందించడంపై ఈ ప్రాజెక్టులో దృష్టి పెట్టారు.

9,328 చదరపు అడుగుల వరకు ఫ్లాట్లు

వివిధ కుటుంబాల అవసరాలకు అనుగుణంగా మై హోమ్‌ వ్యోమాలో 3, 4 బీహెచ్‌కే ఫ్లాట్లను అందించనున్నారు.

  • 3 బీహెచ్‌కే ఫ్లాట్లు: 2,606, 3,040, 3,195 చదరపు అడుగుల విస్తీర్ణంలో అందుబాటులో ఉంటాయి.
  • 4 బీహెచ్‌కే ఫ్లాట్లు: 3,285, 3,520, 3,616, 3,688, 3,845, 4,197 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి.
  • 4 బీహెచ్‌కే + హోమ్‌ ఆఫీస్‌: 9,328 చదరపు అడుగుల విస్తీర్ణంలో పెద్ద ఫ్లాట్‌ను కూడా అందించనున్నారు.

హైదరాబాద్‌లోని ప్రముఖ వ్యాపార, నివాస ప్రాంతాల్లో ఒకటైన ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఎత్తైన టవర్లు, విశాలమైన ఫ్లాట్లు, పచ్చదనం, పెద్ద క్లబ్‌హౌస్‌లు వంటి ప్రత్యేకతలతో లగ్జరీ గృహాల మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని మై హోమ్‌ గ్రూప్‌ లక్ష్యంగా పెట్టుకుంది. గ‌త ప్రాజెక్టుల ద్వారా సంపాదించిన గుర్తింపును కొనసాగిస్తూ, మారుతున్న గృహ కొనుగోలుదారుల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా మై హోమ్‌ వ్యోమాను అభివృద్ధి చేస్తున్నట్లు సంస్థ తెలిపింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0