సాగుభూమి కొన్న మనోజ్ బాజ్ పేయి

Bollywood actor Manoj Bajpayee has made a significant real-estate investment by purchasing 4.45 acres of agricultural land near Lonavala in Maharashtra’s Pune district.

Sep 9, 2026 - 12:32
Sep 9, 2026 - 22:44
 0  6
సాగుభూమి కొన్న మనోజ్ బాజ్ పేయి
manoj-bajpayee-buys-4-45-acres-agricultural-land-near-lonavala-for-rs-1-37-crore
  • లోనావాలా సమీపంలో 4.45 ఎకరాల వ్యవసాయ భూమి.. రూ.1.37 కోట్లకు డీల్‌
బాలీవుడ్‌ విలక్షణ నటుడు మనోజ్‌ బాజ్‌పేయి రియల్‌ ఎస్టేట్‌లో మరో కీలక పెట్టుబడి పెట్టారు. మహారాష్ట్రలోని పుణె జిల్లాలో, ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లోనావాలా సమీపంలోని ముల్షీ తాలూకాలో 4.45 ఎకరాల వ్యవసాయ భూమిని రూ.1.37 కోట్లకు కొనుగోలు చేశారు. ఆగస్టు 25, 2026న ఈ ఆస్తి రిజిస్ట్రేషన్‌ పూర్తయింది. మనోజ్‌ బాజ్‌పేయి కొనుగోలు చేసిన భూమి పుణె జిల్లాలోని ముల్షీ తాలూకా టెయిల్‌బైల్‌ గ్రామంలో ఉంది. 
ఈ భూమిని విమల్‌చంద్‌ ఖిమ్‌రాజ్‌ జైన్‌ నుంచి కొనుగోలు చేశారు. ఈ లావాదేవీకి సంబంధించి రూ.6.86 లక్షల స్టాంప్‌ డ్యూటీ, రూ.30 వేల రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించినట్లు పత్రాల్లో పేర్కొన్నారు. అయితే ఈ భూమిని భవిష్యత్తులో ఏ అవసరానికి వినియోగించాలనుకుంటున్నారనే విషయంపై మనోజ్‌ బాజ్‌పేయి నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా, మనోజ్‌ బాజ్‌పేయి పెట్టుబడి పెట్టిన ముల్షీ ప్రాంతం పుణెకు సమీపంలో ఉండటంతో పాటు సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది.
ముల్షీ డ్యామ్‌, కొండలు, పచ్చని ప్రాంతాలు, జలాశయాల కారణంగా ఈ ప్రాంతం పర్యాటకులను ఆకర్షిస్తోంది. మరోవైపు పుణె, ముంబయి నగరాలకు సమీపంలో ఉండటం వల్ల వీకెండ్‌ హోమ్స్‌, ఫామ్‌హౌస్‌లు, వ్యవసాయ భూముల కోసం కొనుగోలుదారుల ఆసక్తి కూడా పెరుగుతోంది. తక్కువ సాంద్రత కలిగిన నివాసాలు, ప్రకృతి ఆధారిత లైఫ్‌స్టైల్‌ ప్రాపర్టీలకు డిమాండ్‌ పెరగడం ఈ ప్రాంత రియల్‌ ఎస్టేట్‌కు ఊతమిస్తోంది. లోనావాలా ముల్షీ ప్రాంతానికి సమీపంలో ఉన్న ప్రముఖ హిల్‌స్టేషన్‌. పుణె నుంచి రోడ్డు మార్గంలో సుమారు రెండు గంటల దూరంలో ఉండటంతో ఈ ప్రాంతం రెండో ఇల్లు కొనుగోలు చేయాలనుకునే సంపన్న వర్గాలకు ఆకర్షణీయంగా మారింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0