20 ఏళ్ల నాటి ప్రాజెక్ట్.. మలుపు తిరుగుతూ మళ్లీ మొదటికి
Mumbai’s Orchid Turf View residential project, first proposed in 2007, has returned to its original residential status after a long legal dispute.
- ముంబైలో 2007లో మొదలైన రెసిడెన్షియల్ ప్రాజెక్ట్
- సగానికి పైగా డబ్బు చెల్లించి ప్లాట్లు బుక్ చేసుకున్న కొనుగోలుదారులు
- మధ్యలో కమర్షియల్ గా మార్చడానికి డెవలపర్ల ప్రయత్నాలు
- రెసిడెన్షియల్ ప్రాజెక్టుగానే నిర్మించాలని తాజాగా మహా రీట్ ఆదేశాలు
దాదాపు రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఓ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టు ఎన్నో మలుపులు తిరిగి మళ్లీ మొదటికి వచ్చింది. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన మహాలక్ష్మిలోని ఆర్కిడ్ టర్ఫ్ వ్యూ ప్రాజెక్టుకు సంబంధించి మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (మహారీట్) కీలక తీర్పు ఇచ్చింది. ప్రాజెక్టును రెసిడెన్షియల్ రెసిడెన్షియల్-కమ్-కమర్షియల్‌గా మార్చేందుకు ఇచ్చిన అనుమతిని పక్కనపెట్టి.. మళ్లీ రెసిడెన్షియల్ ప్రాజెక్టు హోదాను పునరుద్ధరించాలని ఆదేశించింది. ఈ తీర్పుతో దాదాపు 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కొనుగోలుదారుల వ్యవహారానికి కొత్త మలుపు తిరిగింది. ప్రాజెక్టు డెవలపర్ మార్పు, ప్రాజెక్టు స్వరూపం మార్పు, పాత అలాటీలను తొలగించడం వంటి నిర్ణయాలపై కూడా ట్రైబ్యునల్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
2007లో మొదలైన కథ..
ఈ ప్రాజెక్టు 2007లో ఆర్కిడ్ టర్ఫ్ వ్యూ పేరుతో ప్రతిపాదితమైంది. మహాలక్ష్మిలోని డాక్టర్ ఈ. మోసెస్ రోడ్డులో ఉన్న ఈ ప్రాజెక్టులో లగ్జరీ అపార్ట్‌మెంట్లను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. అప్పట్లో ఇది అత్యంత ప్రీమియం నివాస ప్రాజెక్టుల్లో ఒకటిగా ప్రచారం పొందింది. పాత ప్రాజెక్టు వివరాల ప్రకారం ఇందులో హైఎండ్ అపార్ట్‌మెంట్లతో పాటు డ్యూప్లెక్స్ విల్లాలు, ప్రైవేట్ పూల్స్, వ్యక్తిగత హైడ్రాలిక్ లిఫ్టులు వంటి సౌకర్యాలను ప్రతిపాదించారు.
దీంతో కొంతమంది కొనుగోలుదారులు ఈ ప్రాజెక్టులో ఫ్లాట్లను బుక్ చేసుకున్నారు. దాదాపు 50 శాతం వరకు మొత్తాన్ని చెల్లించినప్పటికీ.. సేల్ అగ్రిమెంట్లు అమలు కాలేదని, నిర్మాణం పూర్తికాలేదని, చివరకు తమకు ఇళ్లు కూడా దక్కలేదని వారు ఆరోపించారు. అంతేకాకుండా ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చి రెసిడెన్షియల్-కమ్-కమర్షియల్ ప్రాజెక్టుగా మార్చేందుకు ప్రయత్నాలు జరిగాయని.. పాత కొనుగోలుదారుల అలాట్‌మెంట్లను రద్దు చేసే ప్రయత్నం కూడా జరిగిందని పిటిషనర్లు ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు.
అయితే, ప్రాజెక్టులో మార్పులకు అవసరమైన కొనుగోలుదారుల సమ్మతిని పొందామని ప్రమోటర్లు వాదించారు. సంబంధిత నిబంధనల ప్రకారం రెండు మూడొంతుల అలాటీల సమ్మతి ఉందని వారు పేర్కొన్నారు. చివరకు ఈ వ్యవహారం మహా రీట్ ముందుకు వెళ్లింది. అన్నీ పరిశీలించిన బెంచ్.. ప్రాజెక్టు ప్రమోటర్ మార్పు, ప్రాజెక్టు స్వరూపంలో మార్పులకు మహారెరా ఇచ్చిన అనుమతి “చట్టపరంగా సరైనది కాదు” అని పేర్కొంది.
అందువల్ల ప్రాజెక్టును మళ్లీ నివాస ప్రాజెక్టుగానే కొనసాగించాలని ఆదేశించింది. పిటిషనర్లను అలాటీలుగా గుర్తించి, వారికి సేల్ అగ్రిమెంట్లు అమలు చేయాలని కూడా ఆదేశించింది. ఈ వ్యవహారంలో ప్రమోటర్లపై ట్రైబ్యునల్ ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 2 శాతానికి సమానమైన జరిమానా విధించింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0