కూక‌ట్‌ప‌ల్లి ప్రీలాంచ్‌ ప్రాజెక్టులు పూర్తి కావు!

Homebuyers are being advised to exercise extreme caution while considering pre-launch apartment projects in Kukatpally, particularly around the IDL lands.

Sep 25, 2026 - 06:04
 0  54
కూక‌ట్‌ప‌ల్లి ప్రీలాంచ్‌ ప్రాజెక్టులు పూర్తి కావు!
kukatpally-pre-launch-projects-warning
  • బిల్డ‌ర్ చేతికి సొమ్ము ఇచ్చేట‌ప్పుడు జాగ్ర‌త్త‌
  • ఛాన‌ల్ పార్ట్‌న‌ర్ల ద్వారా అస్స‌లు కొన‌కండి
  • రేపొద్దున స‌మ‌స్య వ‌స్తే బిల్డ‌ర్‌ను ప‌ట్టుకోలేరు

కూక‌ట్‌ప‌ల్లిలోని ఐడీఎల్ భూములు మోస‌పూరిత ప్రీలాంచ్ అమ్మ‌కాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారింది. ఇందులో కొంద‌రు బిల్డ‌ర్లు రెండేళ్ల నుంచి ప్రీలాంచ్‌లో ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తూనే ఉన్నారు. ఇంకా ఇలా ఎంత‌కాలం మార‌థాన్ ఇన్నింగ్స్ లా ప్రీలాంచ్‌లో అమ్ముతారో కూడా తెలియ‌దు. మీకో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం చెప్పాలా.. ఇలా ప్రీలాంచ్లో హైరైజ్ ప్రాజెక్టులంటూ ఫ్లాట్ల‌ను అమ్మిన ప్రాజెక్టుల్లో ఒక్క‌టి కూడా నేటివ‌ర‌కూ ఆరంభం కాలేదు. ఎందుకో తెలుసా? ప్రీలాంచ్‌లో ధ‌ర త‌క్కువ‌ని చెబుతూ.. కొనుగోలుదారుల నుంచి వ‌న్ టైమ్ పేమెంట్ కింద.. ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తున్నాయి. వారి నుంచి క‌లెక్ట్ అయ్యే సొమ్మును ల్యాండ్‌లార్డ్ కు క‌డుతున్నాయి.

మ‌రికొన్ని కంపెనీలు ప్రీలాంచ్ సొమ్మును త‌మ పాత ప్రాజెక్టుల నిర్మాణ ప‌నుల నిమిత్తం కోసం వాడుతున్నాయి. కాబ‌ట్టి, కూక‌ట్‌ప‌ల్లిలో ప్రీలాంచ్ ఫ్లాట్ల‌ను కొనే వారు త‌స్మాత్ జాగ్ర‌త్త‌. రేటు త‌క్కువ అని ఇందులో ఫ్లాట్ల‌ను కొంటే అంతే సంగ‌తులు. ఆయా ప్రాజెక్టు ఎప్పుడు ఆరంభిస్తారో తెలియ‌దు. ఒక‌వేళ ప్రారంభించినా ఎప్పుడు పూర్త‌వుతుందో తెలియ‌దు. మీ అదృష్టం బాగుంటే మీరు అందులో గృహ‌ప్ర‌వేశం చేస్తారు. లేదంటే పోలీసు స్టేష‌న్లు, కోర్టుల చుట్టూ తిరుగుతారు. కాబ‌ట్టి, కూక‌ట్‌ప‌ల్లి అయినా కొల్లూరు అయినా ప్రీలాంచ్‌లో అస్స‌లు ఫ్లాట్ల‌ను కొన‌కండి. మీ క‌ష్టార్జితాన్ని బూడిద‌పాలు చేసుకోకండి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0