ఖాజాగూడ.. ఐటీ కారిడార్‌కు చేరువలో ప్రీమియం నివాస కేంద్రం

Khajaguda, located in western Hyderabad, is emerging as a premium real estate destination due to its proximity to major employment hubs such as Gachibowli, Financial District and Nanakramguda.

Oct 26, 2026 - 08:21
Oct 28, 2026 - 07:42
 0  81
ఖాజాగూడ.. ఐటీ కారిడార్‌కు చేరువలో ప్రీమియం నివాస కేంద్రం
ఖాజాగూడ.. ఐటీ కారిడార్‌కు చేరువలో ప్రీమియం నివాస కేంద్రం

హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతంలో గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, నానక్‌రామ్‌గూడ వంటి ఉద్యోగ కేంద్రాలకు సమీపంగా ఉండటంతో ఖాజాగూడ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు పొందుతోంది.

ప్రధానంగా ఐటీ ఉద్యోగులు, కార్పొరేట్‌ రంగంలో పనిచేసేవారు, ఉన్నత ఆదాయ వర్గాల కొనుగోలుదారులకు ఈ ప్రాంతం నివాస ఎంపికగా మారుతోంది. ఎత్తైన అపార్ట్‌మెంట్లు, ప్రీమియం గేటెడ్‌ కమ్యూనిటీలు, పెద్ద విస్తీర్ణం గల ఫ్లాట్లు ఖాజాగూడ మార్కెట్‌లో కనిపిస్తున్నాయి. ఉద్యోగ కేంద్రాలకు సమీపం, రహదారి అనుసంధానం, పరిసరాల్లోని సామాజిక మౌలిక సదుపాయాలు ఈ ప్రాంతానికి ప్రాధాన్యాన్ని పెంచుతున్నాయి.

ప్రీమియం కమ్యూనిటీల హవా

ఖాజాగూడలో నివాస మార్కెట్‌ ప్రధానంగా అపార్ట్‌మెంట్‌ ప్రాజెక్టుల చుట్టూ విస్తరిస్తోంది. 2 బీహెచ్‌కే, 3బీహెచ్‌కే ఫ్లాట్లతో పాటు పెద్ద విస్తీర్ణం గల 4 బీహెచ్‌కే, లగ్జరీ గృహాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

కొన్ని ప్రాజెక్టుల్లో క్లబ్‌హౌస్‌, స్విమ్మింగ్‌ పూల్‌, జిమ్‌, పిల్లల ఆటస్థలాలు, వాకింగ్‌ ట్రాక్‌లు, భద్రతా వ్యవస్థలు వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. ఐటీ ఉద్యోగులు, కుటుంబాలతో కలిసి నివసించాలనుకునేవారు, విశాలమైన గృహాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు ఈ మార్కెట్‌లో కీలక కొనుగోలుదారులుగా ఉంటున్నారు.

ఇదీ చదవండి: వైద్య సేవల మౌలిక వసతులకు భారీ డిమాండ్

కనెక్టివిటీ.. ఐటీ ఉద్యోగ కేంద్రాలకు చేరువ

ఖాజాగూడకు గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, శేక్‌పేట్‌ వంటి ప్రాంతాలకు రహదారి మార్గాల్లో అనుసంధానం ఉంది. ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉండటం, ఇక్కడి నుంచి గచ్చిబౌలికి 5 నిమిషాల్లో, హైటెక్ సిటీకి 15 నిమిషాల్లో, జూబ్లీహిల్స్ కు ఇర‌వై నిమిషాల్లో చేరుకునేలా కనెక్టివీటీ ఉంది.

రాయదుర్గం మెట్రో స్టేషన్ కు ఖాజాగూడ నుంచి కేవలం 15 నిమిషాల్లో వెళ్లిపోవచ్చు. సమీపంలోని ఐటీ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, ఇతర సేవలు ఈ ప్రాంతంలో నివాసానికి ప్రాధాన్యాన్ని పెంచుతున్నాయి.

ఇక ఖాజాగూడ జంక్షన్‌, ఐఐఐటీ జంక్షన్‌ పరిసరాల్లో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులను 2027 నాటికి పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. పనులు పూర్తయితే రాకపోకల సౌలభ్యం మెరుగుపడే అవకాశం ఉంది.

గచ్చిబౌలి.. నాన‌క్‌రాంగూడ‌తో..

ఖాజాగూడను సపరేట్ గా కాకుండా గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, మణికొండ, నార్సింగి, షేక్‌పేట్‌ పరిసర ప్రాంతాలతో కలిపి పరిశీలించాలి. ఖాజాగూడలో ప్రీమియం అపార్ట్‌మెంట్లకు డిమాండ్‌ ఉండటంతో పాటు, ప్రాజెక్టు ఎంపికలో కొనుగోలుదారులు ధరను ఇతర సమీప ప్రాంతాలతో పోల్చి చూస్తున్నారు.

ఒకే బడ్జెట్‌లో విస్తీర్ణం, సదుపాయాలు, పార్కింగ్‌, నిర్మాణ నాణ్యతలో ఎలాంటి తేడాలున్నాయో పరిశీలిస్తున్నారు.

ఇదీ చదవండి:  రీసేల్ లగ్జరీ ఇళ్లకూ డిమాండ్

చదరపు అడుగు ధర ఎంత?

ఖాజాగూడలో అపార్ట్‌మెంట్ల సగటు ధర చదరపు అడుగుకు సుమారు రూ.10,500-11,000 పరిధిలో ఉన్నాయి. కొన్ని ప్రీమియం నివాస ప్రాజెక్టుల్లో ధరలు చదరపు అడుగుకు సుమారు రూ.8,500 నుంచి రూ.13,000కు పైగా ఉన్నాయి.

ప్రాజెక్టు స్థాయి, ఫ్లాట్‌ విస్తీర్ణం, నిర్మాణ దశ, సదుపాయాల ఆధారంగా ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. అయితే ధరలను పోల్చేటప్పుడు కార్పెట్‌ ఏరియా, సూపర్‌ బిల్ట్‌-అప్‌ ఏరియా మధ్య తేడాను గుర్తించాలి. పార్కింగ్‌, క్లబ్‌హౌస్‌, ఇతర అదనపు ఛార్జీలు, రిజిస్ట్రేషన్‌ ఖర్చులు కలిపి మొత్తం కొనుగోలు వ్యయాన్ని లెక్కించాలి.

రూ.90 లక్షల నుంచి..

ఖాజాగూడలో కొన్ని 2 BHK ఫ్లాట్లు సుమారు రూ.1.2 కోట్ల నుంచి రూ.1.5 కోట్ల పరిధిలో కనిపిస్తున్నాయి. 3 BHK గృహాల ధరలు సుమారు రూ.1.5 కోట్ల నుంచి రూ.2.2 కోట్ల వరకు ఉండగా, పెద్ద విస్తీర్ణం గల లగ్జరీ ఫ్లాట్ల ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి.

ఇక విల్లాలు ప్రాజెక్టు విస్తీర్ణాన్ని బట్టి 14 కోట్ల నుంచి 18 కోట్ల వరకు ధరలు ఉన్నాయి.

ఇదీ చదవండి: ఎల్‌నినో ఎఫెక్ట్‌.. నీటి కష్టాలను ఎలా ఎదుర్కోవాలంటే..?

అద్దె ఆదాయం.. పెట్టుబడిదారులకు ఎలాంటి అవకాశం?

ఐటీ, ఆర్థిక సేవల రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు కార్యాలయాలకు సమీపంలో నివాసం అవసరం కావడం ఖాజాగూడకు అనుకూలమైన అంశం. దీనివల్ల అద్దె గృహాల మార్కెట్‌కు ఖాజాగూడలో మంచి అవకాశాలు ఉన్నాయి.

ఇక్కడ 2 BHK ఫ్లాటు 40 వేల నుంచి 50 వేల వరకు, 3 BHK ఫ్లాటు 50 వేల నుంచి 65 వేల వరకు రెంట్స్ ఉన్నాయి.  

ప్రీమియం నివాస మార్కెట్‌లో ఖాజాగూడకు ప్రత్యేక స్థానం

ఖాజాగూడలో ఐటీ ఉద్యోగ కేంద్రాలకు సమీపం, ప్రీమియం అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీల లభ్యత ఈ ప్రాంతానికి ప్రధాన బలాలుగా నిలుస్తున్నాయి. ఖాజాగూడ పరిసరాల్లోని కొండరాళ్ల సహజ భౌగోళిక నిర్మాణాలు, చెరువులు ఈ ప్రాంత పర్యావరణ ప్రాధాన్యాన్ని పెంచుతున్నాయి.

అదే సమయంలో పట్టణ విస్తరణ, రహదారుల అభివృద్ధి, పెరుగుతున్న నివాస నిర్మాణాల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ కూడా కీలక అంశంగా మారుతోంది.

ఇదీ చదవండి: ఇంటి పత్రాలు పోయాయా?  కంగారు వద్దు

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0