సుప్రీంకోర్టులో హైడ్రాకు బిగ్ షాక్?
A long-running dispute over 40 acres of land in Survey Nos. 1 and 2 at Lothkunta in Malkajgiri has been ongoing between the Telangana government and Shanta Sriram Constructions.
మల్కాజిగిరి పరిధిలోని లోతుకుంటలో సర్వే నంబర్లు 1, 2లో ఉన్న 40 ఎకరాల భూమిపై గత కొంతకాలం నుంచి.. ప్రభుత్వానికి, శాంత శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థకు మధ్య వివాదం కొనసాగుతోంది. కంటోన్మెంట్‌లోని 40 ఎకరాల భూమి తెలంగాణ ప్రభుత్వానికి చెందినదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. అయితే, ఆ భూమి శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్‌కు చెందినదిగా హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై హైడ్రా సుప్రీం కోర్టులో అప్పీలు చేసింది. అయితే, హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థిస్తూ హైడ్రా కేసును డిస్మిస్ చేసింది. ఇదే కేసులో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలగించాలని తెలంగాణ హై కోర్టు ఆదేశించింది. అయితే, తదుపరి విచారణలో డివిజన్ బెంచ్ ఈ ఉత్తర్వులపై తాత్కాలికంగా స్టే విధించింది. మరి, ఇందుకు సంబంధించిన కేసులో హైడ్రా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0