అక్రమ నిర్మాణాలపై హైకోర్టు సీరియస్!
The Telangana High Court has directed the GHMC, Cyberabad Municipal Corporation and Malkajgiri Municipal Corporation to take strict steps to prevent illegal constructions.
గ్రేటర్ హైదరాబాద్ మున్సి పల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ల పరిధిలో అక్రమ నిర్మాణాలు అరికట్టేందుకు చర్యల్ని తీసుకోవాలని హైకోర్టు ఆయా కార్పొరేషన్ల కమిషనర్లకు ఆదేశాలు జారీచేసింది. 75 గజాల లోపు ప్లాట్లకు అనుమతి అవసరం లేదు అనే నిబంధన చట్టంలో ఉంది కాబట్టి అది దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 75 గజాల కంటే ప్లాటు సైజు ఎక్కువగా ఉన్నప్పటికీ ప్లాట్లను విభజించి అనుమతి తీసుకో కుండా నిర్మిస్తున్న ఘటనలు సైతం జరుగుతున్నాయని.. ఈ నేపథ్యంలో ప్లాటు సైజుతో నిమిత్తం లేకుండా అందరూ నిర్మాణ ప్రాంతంలోనే భవన నిర్మాణ అనుమతులు ప్రదర్శించాలని స్పష్టం చేసింది. 75 గజాల లోపు ప్లాటు అయితే రిజిస్ట్రేషన్ ప్రొవిజనల్ సర్టిఫికెట్ ప్రదర్శించాలని తెలిపింది.
జీవో నెం. 168 ప్రకారం ప్లాట్ల ఓనర్లు భవన నిర్మాణ అనుమతులను నిర్మాణ సైట్లోనే ప్రదర్శించేలా జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కమిషనర్లు క్షేత్ర స్థాయి టౌన్లోనింగ్ అధికారులు, డిప్యూటీ కమిషనర్లకు మార్గదర్శకాలు జారీ చేయాలని పేర్కొంది. నిర్మాణంలో ఉన్న సైట్లను అధికారులు తనిఖీలు చేసి వాటికి అనుమతులు ఉన్నాయా.. ఆమోదిత ప్రణాళిక ప్రకారమే నిర్మాణం జరుగుతోందా.. అని పరిశీలించాలంది. ఇందుకు విరుద్ధంగా ఉంటే తక్షణమే నిర్మాణాలు నిలిపేయాలని పేర్కొంది.
జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 455-ఏ, 455-ఏఏ ప్రకారం తన భవనానికి అనుమతి ఇవ్వాలని పేర్కొంటూ సిద్ధింబర్ బజార్కు చెందిన రాజ్కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ బి.విజయేసేన్ రెడ్డి.. పిటిషనర్ భవన నిర్మాణ దరఖాస్తును జీహెచ్ఎంసీ అధికారులు తిరస్కరించినప్పటికీ ఎలాంటి ప్రణాళిక లేకుండా నిర్మాణం చేపట్టారని.. ఎక్కువ విస్తీర్ణంలో ప్లాటు ఉన్నప్పటికీ మోసపూరితంగా తక్కువ విస్తీర్ణం అని చెప్పి దరఖాస్తు చేశారని పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలను ప్రారంభ దశలోనే నిరోధించాలని వ్యాఖ్యా నించారు. అనుమతి ఉన్న భవన యజమానులు మాత్రమే జీహెచ్ఎంసీ యాక్లోని 455 -ఏ, 455-ఏఏ కింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. ఈ మేరకు పిటిషనర్కు చెందిన భవనాన్ని సీజ్ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0