నిర్మాణ రంగానికి నీళ్ల స‌మ‌స్య‌?

Hyderabad’s real estate sector is facing potential water supply challenges amid declining groundwater availability and increasing dependence on water tankers.

Oct 25, 2026 - 02:41
 0  2
నిర్మాణ రంగానికి నీళ్ల స‌మ‌స్య‌?
hyderabad-construction-sector-water-shortage-real-estate-delays

హైద‌రాబాద్ రియ‌ల్ రంగానికి రోజుకో క‌ష్టం వ‌చ్చి ప‌డుతోంది. ఇప్ప‌టికే అమ్మ‌కాల్లేక నానా ఇబ్బందులు ప‌డుతున్న‌ న‌గ‌ర నిర్మాణ రంగానికి ఇప్పుడు మంచినీటి స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. ఈ ఇబ్బంది అధిక‌మైతే.. నిర్మాణ ప‌నుల్లో వేగం త‌గ్గి.. ఫ్లాట్ల హ్యాండోవ‌ర్‌లో జాప్యం ఏర్ప‌డుతుంది. న‌గ‌రంలో భూగ‌ర్భ‌జ‌లాల ల‌భ్య‌త‌లో త‌గ్గుద‌ల‌, ట్యాంకుల‌పై ఎక్కువ‌గా అధార‌ప‌డ‌టం వంటివి ఎక్క‌డ్లేని స‌మ‌స్య‌ల్ని తెచ్చి పెడుతోంది.

మ‌రి, ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డానికి పుర‌పాల‌క శాఖ ప్ర‌త్యేక చ‌ర్య‌ల్ని తీసుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంది. ఎందుకంటే, సకాలంలో నీరు అందితేనే నిర్మాణ పనులు వేగంగా జ‌రుగుతాయి. అదనపు ఖర్చులు, ఆలస్యాలు త‌గ్గుతాయి. హైదరాబాద్ అభివృద్ధికి, ఇళ్ల కొనుగోలుదారుల‌ ప్రయోజనాల‌కు ఎలాంటి ఇబ్బంది రాకూడ‌దంటే.. నీటి స‌ర‌ఫ‌రాలో ఎలాంటి ఇబ్బంది రాకుండా తీసుకోవాలి. బిల్డ‌ర్లు కూడా ప్రాజెక్టు సైట్ల వ‌ద్ద నీటి దుబారాను త‌గ్గించాలి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0