ఫ్యూచర్ సిటీకి.. ఫ్యూచరిస్టిక్ కనెక్టివిటీ
The government is giving high priority to high-speed connectivity as part of the development of Future City in south Hyderabad.
ఫ్యూచర్ సిటీకి హైస్పీడ్ కనెక్టివిటీపై ప్రభుత్వం ఫోకస్
లింక్ రోడ్లు, కల్వర్టులకు రూ.140 కోట్లు
బెంగళూరు, శ్రీశైలం, నాగార్జునసాగర్ రహదారులకు అనుసంధానం
మీర్‌ఖాన్‌పేట్, యాచారం, రాచలూరు, తిమ్మాపూర్ జంక్షన్లపై ఫోకస్
ప్రధాన గ్రామాలకు అనుసంధాన రోడ్ల నిర్మాణం
ఏడాదిన్నరలో లింక్ రోడ్ల పనులు పూర్తి చేయాలని లక్ష్యం
ఓఆర్ఆర్ ఎగ్జిట్-13 నుంచి అమన్‌గల్ వరకు 41.5 కి.మీ గ్రీన్‌ఫీల్డ్ రోడ్
100 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్ల రహదారి నిర్మాణం
ఫ్యూచర్ సిటీలో సిగ్నల్ ఫ్రీ జంక్షన్లకు ప్రాధాన్యం
దక్షిణ హైదరాబాద్ ట్రాఫిక్ మ్యాప్ మార్చేలా రోడ్ల నెట్‌వర్క్
ఐటీ, పారిశ్రామిక, నివాస ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ
రోడ్లు.. కనెక్టివిటీ.. మౌలిక వసతులతో ఫ్యూచర్ సిటీకి కొత్త రూపు
హైదరాబాద్ దక్షిణ శివార్ల రూపురేఖలు మార్చేలా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పరుగులు పెడుతోంది.. ఐటీ, పారిశ్రామిక, నివాస ప్రాంతాలతో కొత్త సిటీ రూపుదిద్దుకుంటున్న వేళ.. కనెక్టివిటీకి ప్రభుత్వం భారీ ప్రాధాన్యం ఇస్తోంది.. లింక్ రోడ్లు.. కీలక జంక్షన్లు.. గ్రీన్‌ఫీల్డ్ రోడ్లతో దక్షిణ హైదరాబాద్‌కు హైస్పీడ్ కనెక్టివిటీ ప్లాన్ చేస్తోంది.. ఇందులో భాగంగా 140 కోట్లతో లింక్ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధుల్ని మంజూరు చేసింది.
ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో రవాణా మౌలిక వసతులే కీలకంగా మారుతున్నాయి.. అంతర్గత ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు.. ప్రధాన జాతీయ రహదారులకు వేగవంతమైన కనెక్టివిటీ కల్పించడమే లక్ష్యంగా లింక్ రోడ్లను అభివృద్ధి చేయనున్నారు.. బెంగళూరు జాతీయ రహదారి-844.. శ్రీశైలం జాతీయ రహదారి-765.. నాగార్జునసాగర్ రహదారులను అనుసంధానించేలా రోడ్ల నెట్‌వర్క్ రూపొందుతోంది. 140 కోట్ల నిధులతో పలు కీలక రోడ్లకు శ్రీకారం చుడుతున్నారు.. మీర్‌ఖాన్‌పేట్ నుంచి మేడపల్లి.. మల్కీజుగూడ.. నందివనపర్తి మీదుగా యాచారం వరకు రోడ్డు నిర్మాణానికి 18 కోట్లు.. మేడిపల్లి నుంచి తాడిపర్తి వరకు 35 కోట్లు.. కుర్మిద్ద నుంచి మీర్‌ఖాన్‌పేట్ వరకు మరో 35 కోట్లు కేటాయించారు. శ్రీశైలం హైవే నుంచి రాచలూరు–తిమ్మాపూర్ జంక్షన్ వరకు 20 కోట్లు.. రాచలూరు నుంచి కొనల్‌గూడ వరకు 22 కోట్లు.. కొనల్‌గూడ నుంచి యాచారం వరకు 30 కోట్లు.. ప్రధాన గ్రామ పంచాయతీలకు అనుసంధాన రోడ్ల కోసం మరో 7 కోట్లు కేటాయించారు..
ఈ లింక్ రోడ్లతో పాటు ఫ్యూచర్ సిటీకి మరో కీలక రహదారి రూపుదిద్దుకుంటోంది.. ఓఆర్‌ఆర్ ఎగ్జిట్-13 నుంచి అమన్‌గల్ వరకు సుమారు 41.5 కిలోమీటర్ల పొడవున 100 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో ఉంది.. రావిర్యాల.. మీర్‌ఖాన్‌పేట్.. అమన్‌గల్ ప్రాంతాలను అనుసంధానించే ఈ కారిడార్ భవిష్యత్ ట్రాఫిక్‌కు కీలక మార్గంగా మారనుంది. కేవలం రోడ్లు నిర్మించడమే కాదు.. ట్రాఫిక్ ఫ్లోను కూడా మార్చేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మీర్‌ఖాన్‌పేట్.. యాచారం.. తిమ్మాపూర్.. రాచలూరు.. కొనల్‌గూడ ప్రాంతాల్లో కీలక జంక్షన్లను అభివృద్ధి చేసి.. సిగ్నల్ రహిత రవాణాకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.. వీటిని జాతీయ, రాష్ట్ర రహదారులతో అనుసంధానం చేయనున్నారు. ఫ్యూచర్ సిటీ రోడ్ల అభివృద్ధి ప్రభావం చుట్టుపక్కల ప్రాంతాలపైనా పడే అవకాశం ఉంది.
మెరుగైన కనెక్టివిటీతో పారిశ్రామిక, ఐటీ, నివాస ప్రాజెక్టులకు రవాణా సౌకర్యం పెరగనుంది.. దక్షిణ హైదరాబాద్‌లో కొత్త అభివృద్ధి కారిడార్లు ఏర్పడే అవకాశం ఉంది.. అయితే రోడ్ల నిర్మాణంతోనే భూముల ధరలు పెరుగుతాయని చెప్పలేం.. ఉద్యోగ కేంద్రాలు.. మౌలిక వసతులు.. ప్రజా రవాణా.. ప్రాజెక్టుల అమలు వంటి అంశాలపై వాస్తవ ప్రభావం ఆధారపడి ఉంటుంది. ఫ్యూచర్ సిటీ దీర్ఘకాలిక అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ రూపకల్పన కూడా కొనసాగుతోంది.. రోడ్లు.. జంక్షన్లు.. పారిశ్రామిక ప్రాంతాలు.. ఐటీ జోన్లు.. నివాస ప్రాంతాలను సమన్వయం చేసేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.. మొత్తంగా 140 కోట్ల లింక్ రోడ్లు.. 41.5 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ రోడ్.. సిగ్నల్ ఫ్రీ జంక్షన్లు.. భవిష్యత్ మాస్టర్‌ప్లాన్.. ఇవన్నీ కలిస్తే దక్షిణ హైదరాబాద్ కనెక్టివిటీ మ్యాప్‌లో కీలక మార్పులు వచ్చే అవకాశం ఉంది..
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0