హోమ్ లోన్ వడ్డీ రేటు 7 శాతమే!
Bank of Maharashtra has announced a limited-period monsoon home loan offer, reducing its starting home loan interest rate by 10 basis points from 7.10% to 7%.
* ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ ఫీజులకు గుడ్‌బై
సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునే వారికి ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శుభవార్త చెప్పింది. మాన్‌సూన్ సీజన్‌ను పురస్కరించుకుని ప్రత్యేక రుణ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా గృహ రుణాలపై వడ్డీ రేటును మరో 10 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ 7 శాతానికి తీసుకొచ్చింది. అదే సమయంలో ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ చార్జీలను పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు బ్యాంకు వెల్లడించింది.
ప్రస్తుతం వడ్డీ రేట్లు రుణం తీసుకునే వారి క్రెడిట్ ప్రొఫైల్, అర్హత ఆధారంగా నిర్ణయించబడుతున్నప్పటికీ, ఈ ప్రత్యేక ఆఫర్ కింద ప్రారంభ వడ్డీ రేటును 7.10 శాతం నుంచి 7 శాతానికి తగ్గించింది. దీని వల్ల దీర్ఘకాలిక గృహ రుణం తీసుకునే వారికి ఈఎంఐ భారం కొంత మేర తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్త ఇల్లు కొనుగోలు చేసే వారు, నిర్మాణం చేపట్టే వారు, అలాగే హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేయాలనుకునే వారికి ఈ ఆఫర్ ప్రయోజనకరంగా ఉండనుంది.
ప్రాసెసింగ్ ఫీజు కూడా లేదు
సాధారణంగా గృహ రుణాలపై బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ చార్జీలు వసూలు చేస్తుంటాయి. అయితే ఈ మాన్‌సూన్ ధమాకా ఆఫర్‌లో ఆ రెండు చార్జీలను పూర్తిగా ఎత్తివేయడం విశేషం. దీంతో రుణం తీసుకునే సమయంలో కస్టమర్లపై పడే ప్రారంభ వ్యయం తగ్గనుంది.
రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం
ఇటీవలి కాలంలో రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో గృహాల కొనుగోళ్లపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకుల మధ్య పోటీ కూడా పెరిగింది. తక్కువ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపులు వంటి ఆఫర్లు గృహ కొనుగోలుదారులను ఆకర్షించే అవకాశముందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. పండుగల సీజన్‌కు ముందు ఇలాంటి ఆఫర్లు హోమ్ లోన్ డిమాండ్‌ను మరింత పెంచే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.
పరిమిత కాలం మాత్రమే
బ్యాంక్ ప్రకటించిన ఈ మాన్‌సూన్ ధమాకా ఆఫర్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొంది. గృహ రుణం లేదా వాహన రుణం తీసుకోవాలనుకునే వారు బ్యాంకు శాఖలను లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించి నిబంధనలు, అర్హత ప్రమాణాలు తెలుసుకోవాలని సూచించింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0