ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఏఎస్‌బీఎల్ కొత్త ప్రాజెక్టు 

ASBL has launched ASBL Legacy, a new gated-community residential project at RTC Cross Roads in central Hyderabad.

Aug 30, 2026 - 04:45
 0  5
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఏఎస్‌బీఎల్ కొత్త ప్రాజెక్టు 
asbl-legacy-new-residential-project-rtc-cross-roads-hyderabad

 రూ.1.99 కోట్ల నుంచి 3, 4 బీహెచ్‌కే ఇళ్లు!

హైదరాబాద్‌ సెంట్రల్‌ ఏరియాలోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఏఎస్‌బీఎల్‌ కొత్త రెసిడెన్షియల్‌ ప్రాజెక్టును ప్రారంభించింది. ఏఎస్‌బీఎల్ లెగ‌సీ  పేరుతో వస్తున్న ఈ ప్రాజెక్టు సెంట్రల్‌ హైదరాబాద్‌లో గేటెడ్‌ కమ్యూనిటీ కాన్సెప్ట్‌ను ప్ర‌వేశ‌పెడుతోంది. సుమారు  7.97 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో మూడు ట‌వ‌ర్లను జి+50 అంత‌స్త‌లు ఎత్తులో నిర్మిస్తున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఇదే అత్యంత ఎత్తైన ప్రాజెక్టుగా నిలవనుంది. ఇక్కడ 3, 4 బీహెచ్‌కే ఫ్లాట్ల‌ను రూ.1.99 కోట్ల నుంచి విక్ర‌యిస్తున్నారు. 

ఈ మొత్తం ప్రాజెక్ట్‌లో  73.25 శాతం ఓపెన్‌ స్పేస్ గా వ‌దిలి పెడుతున్నామ‌ని సంస్థ చెబుతోంది. సుమారు 74,000 చదరపు అడుగుల క్లబ్‌హౌస్, 1.70 లక్షల చదరపు అడుగుల్లో యాభైకి పైగా సౌక‌ర్యాల్ని ఏర్పాటు చేస్తారు. స్కైలైన్‌ వ్యూస్‌తో టెర్రస్‌ స్విమ్మింగ్‌ పూల్‌, బ్యాడ్మింటన్‌, ఫుట్‌సాల్‌, పికిల్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌ కోర్టులు, క్రికెట్‌ నెట్స్‌, స్కేటింగ్‌ రింక్‌, జాగింగ్‌, సైక్లింగ్‌ ట్రాక్స్‌, పిల్లల ప్లే ఏరియా, పెట్‌ పార్క్‌, ఫెస్టివల్‌ లాన్‌ వంటి సౌకర్యాల్ని ఇందులో పొందుప‌రుస్తారు. 

ప్రాజెక్టు ప్రారంభించిన సంద‌ర్భంగా ఏఎస్‌బీఎల్ వ్య‌వ‌స్థాప‌కుడు, సీఈవో అజితేష్‌ కొరుపోలు మాట్లాడుతూ.. సెంట్రల్‌ హైదరాబాద్‌లో డిమాండ్‌ ఎప్పుడూ ఉన్నప్పటికీ, పెద్ద గేటెడ్‌ కమ్యూనిటీలకు సరిపడే పెద్ద భూములు అందుబాటులో లేకపోవడం వల్ల ఇలాంటి ప్రాజెక్టులు తక్కువగా ఉన్నాయని తెలిపారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0