ఏ.ఓ. స్మిత్ నుంచి Z3 వాటర్ ప్యూరిఫైయర్ విడుదల

A. O. Smith has launched the Z3 Onyx Black, an under-sink antioxidant water purifier, in India. The purifier features eight-stage RO+UV purification, copper mineralisation and alkaline technology.

Oct 24, 2026 - 01:07
Oct 24, 2026 - 01:07
 0  1
ఏ.ఓ. స్మిత్ నుంచి Z3 వాటర్ ప్యూరిఫైయర్ విడుదల
ao-smith-z3-onyx-black-water-purifier-launch

సింక్ కింద అమర్చే యాంటీఆక్సిడెంట్ వాటర్ ప్యూరిఫైయర్‌ను తొలిసారిగా భారత్‌లో పరిచయం చేసినట్లు కంపెనీ వెల్లడి వాటర్ హీటింగ్, ట్రీట్‌మెంట్ ఉత్పత్తుల సంస్థ ఏ.ఓ. స్మిత్ (A. O. Smith) భారతదేశంలో తొలిసారిగా సింక్ కింద అమర్చే యాంటీఆక్సిడెంట్ వాటర్ ప్యూరిఫైయర్‌ Z3 Onyx Blackను విడుదల చేసింది. ఇందులో నీటి రికవరీ రేటు 55 శాతం వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ప్యూరిఫైయర్‌లో కాపర్ మినరలైజర్, ఆల్కలైన్ టెక్నాలజీ ఉన్నాయి. ఇవి నీటిలో అవసరమైన ఖనిజాలను తిరిగి అందించడంతోపాటు హైడ్రేషన్‌కు తోడ్పడతాయని కంపెనీ పేర్కొంది.

ఆధునిక వంట గదులకు అనువుగా సింక్ కింద అమర్చుకునేలా దీన్ని రూపొందించారు. ఎనిమిది దశల RO+UV శుద్ధి వ్యవస్థతోపాటు, విద్యుత్ సరఫరా లేనప్పుడు కూడా నిల్వ చేసిన శుద్ధి నీటిని అందించే సాంకేతికత ఇందులో ఉంది. ఆరు లీటర్ల నిల్వ సామర్థ్యం కలిగిన ట్యాంక్‌తో పాటు, సులభంగా తరలించేందుకు, నిర్వహించేందుకు వీలుగా ప్రత్యేక చక్రాలు, హ్యాండిల్‌ను అందించారు. ఈ ప్యూరిఫైయర్ BPA రహితమైనదని కంపెనీ తెలిపింది.

ఏ.ఓ. స్మిత్ ఇండియా ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పరాగ్ కులకర్ణి మాట్లాడుతూ, ఆరోగ్యం, సౌలభ్యం, నీటి పొదుపునకు ప్రాధాన్యమిస్తూ ఈ ఉత్పత్తిని రూపొందించినట్లు తెలిపారు. ఈ ప్యూరిఫైయర్ ప్రారంభ ధర రూ.29,990. అధీకృత రిటైలర్ల వద్ద అందుబాటులో ఉంటుంది. ఆర్‌వో మెంబ్రేన్, ఫిల్టర్లు, విద్యుత్ భాగాలపై ఏడాది సమగ్ర వారంటీ కల్పిస్తున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0