టీజీ రెరా తుది గడువు.. నవంబరు 30 దాకా పొడిగింపు
The Centre has advised State RERA authorities to grant a four-month extension to eligible real estate projects affected by the West Asia crisis and construction material supply disruptions.
వెల్ కం టు ఆర్ఈజీ టీవీ. నేను మీ లహరికా. కేంద్ర ప్రభుత్వం రెరాకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా సంక్షోభం ప్రభావంతో నిర్మాణ సామగ్రి సరఫరా అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో.. అర్హత ఉన్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్, పూర్తి గడువులను నాలుగు నెలలు పొడిగించాలని కేంద్ర గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల రెరా అధికారులను కోరింది. పశ్చిమాసియా పరిస్థితిని యుద్ధంగా కేంద్ర ఆర్థిక శాఖ అధికారికంగా గుర్తించిందని తెలిపింది.
రెరా చట్టం-2016లోని సెక్షన్ 6, 7(3) ప్రకారం గడువు పొడిగించే అధికారం రెరాలకు ఉందని పేర్కొంది. 2026 ఫిబ్రవరి 28 లేదా ఆ తర్వాత పూర్తి గడువు ఉన్న ప్రాజెక్టులకు ఈ సడలింపు వర్తిస్తుంది. ప్రతి డెవలపర్ నుంచి విడివిడిగా దరఖాస్తులు తీసుకోకుండా, ఒకే సాధారణ ఉత్తర్వు జారీ చేయాలని కూడా కేంద్రం సూచించింది. ఈ క్రమంలో 2026 ఫిబ్రవరి 28 నుంచి 2026 జూలై 31 మధ్యలో పూర్తి గడువు తేదీ, సవరించిన గడువు తేదీ లేదా పొడిగించిన తేదీ ఉన్న ప్రాజెక్టుల పూర్తి గడువును 2026 నవంబర్ 30 వరకు పొడిగించినట్లు టీజీ రెరా ఒక ప్రకటనలో తెలియజేసింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0