ఎంఎస్ఎన్ రియాల్టీ.. ఏమిటీ దందా?

The article questions the legality of MSN Realty selling flats at its Rayadurg auction-acquired property without obtaining approval from the Telangana Real Estate Regulatory Authority (TG RERA).

Sep 12, 2026 - 01:20
 0  5
ఎంఎస్ఎన్ రియాల్టీ.. ఏమిటీ దందా?
MSN Realty… What’s This Deal About?
  • హెచ్ఎండీఏకు 25 శాతం సొమ్ము క‌డితే..
  • భూయాజ‌మాన్య హ‌క్కులు రాక‌పోయినా..
  • వ‌న్ టైమ్ పేమెంట్‌లో ఫ్లాట్ల‌ను అమ్మ‌వ‌చ్చా? 
  • ఇదెక్క‌డి నిబంధ‌న‌? ఇలాగైతే రెరా ఎందుకు?

కాయ్ రాజా కాయ్‌.. మా వేలంలో పాల్గొనండి.. అధిక ధ‌ర‌కు స్థ‌లం కొనుక్కుని.. హెచ్ఎండీఏకే కేవ‌లం ఇర‌వై ఐదు శాతం క‌డితే చాలు.. మిగ‌తా సొమ్ము కోసం మార్కెట్లో ప్ర‌జ‌ల నుంచి సొమ్ము వ‌సూలు చేసి క‌ట్టినా.. హెచ్ఎండీఏకు స‌మ‌స్య లేదు.. మీకు టీజీ రెరా నుంచి ప‌ర్మిష‌న్ రాక‌పోయినా ఫ‌ర్వాలేదు.. మా సొమ్ము మాకు క‌డితే చాలు.. అన్న‌ట్లుగా ఉంది రాష్ట్ర ప్ర‌భుత్వ వ్య‌వ‌హారం. ఇటీవ‌ల రాయ‌దుర్గంలో వేలం పాట‌లో అధిక ధ‌ర‌కు స్థ‌లాన్ని సొంతం చేసుకున్న ఎంఎస్ఎన్ రియాల్టీ.. టీజీ రెరా నుంచి ఎలాంటి అనుమ‌తి తీసుకోకుండానే.. ఎంచ‌క్కా అందులో ఫ్లాట్లను వ‌న్ టైమ్ పేమెంట్ కింద అమ్మేస్తోంది. ఆయా సేల్స్ నుంచి వ‌చ్చిన సొమ్మును తీసుకెళ్లి హెచ్ఎండీఏకు క‌ట్టేయాల‌న్న‌ది ఈ సంస్థ ప్లాన్ అని అనిపిస్తోంది. 

హెచ్ఎండీఏ నుంచి పూర్తి స్థాయిలో స్థ‌లం చేతికి రాక ముందే.. ల్యాండ్ ఓన‌ర్‌షిప్ రైట్స్ పూర్తిగా రాక ముందే.. ఆయా భూమిలో ఫ్లాట్ల‌ను క‌డుతున్నామంటూ.. రెరా అనుమ‌తి లేకుండా బ‌య్య‌ర్ల నుంచి సొమ్ము వ‌సూలు చేయ‌డం ఎంత వ‌ర‌కూ క‌రెక్టు? ఇది ఏ చ‌ట్టం ప‌రిధిలోకి వ‌స్తుందో మున్సిప‌ల్ శాఖ‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికే తెలియాల‌ని రియ‌ల్ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఒక‌వేళ ఇదే విధానంలో రియ‌ల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలంటే.. అదే ప‌ద్ధ‌తిలో బిల్డ‌ర్లంద‌రూ చేప‌డ‌తారు క‌దా! అలాంట‌ప్పుడు, టీజీ రెరా అనుమ‌తులు ఎందుకు తీసుకోవ‌డం? నిర్మాణ రంగంలోకి కొత్త‌గా అడుగు పెట్టిన ఈ సంస్థ‌కు గ‌తంలో అపార్టుమెంట్ల‌ను క‌ట్టిన ప్ర‌త్య‌క్ష అనుభ‌వం లేదు. కేవ‌లం ఉద్యోగుల‌ను న‌మ్మి, కాంట్రాక్ట‌ర్ల‌కు ప‌నుల్ని అప్ప‌గించి చేయాలి. నిర్మాణాలు చేప‌ట్టేట్పుడు ఎక్క‌డైనా త‌ప్పులు జ‌రిగినా తెలిసే అవ‌కాశం లేదు. ఒక‌వేళ తెలిసినా, వాటిని ఎలా ప‌రిష్క‌రించాలో తెలియ‌దు. కాబ‌ట్టి, ఈ సంస్థ నిర్మాణ ప‌నుల‌న్నీ స‌జావుగా జ‌రిపించాల‌ని.. ఎంఎస్ఎన్ రియాల్టీ వ‌ద్ద ఫ్లాట్లు కొనేవారు.. ఎలాంటి ఇబ్బందులు ప‌డ‌వ‌ద్ద‌ని కోరుకుందాం. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0