వంశీరాం బిల్డ‌ర్స్ స‌రికొత్త రికార్డు.. రాయ‌దుర్గంలో ఎక‌రా రూ.269 కోట్లు పెట్టి కొన్న సుబ్బారెడ్డి

Vamsiram Builders has reportedly set a new benchmark in Hyderabad’s Raidurg real estate market, with land value reaching ₹269 crore per acre. The latest development highlights the strong demand for strategically located commercial land in Hyderabad’s western corridor and reinforces Raidurg’s position as one of the city’s most valuable real estate destinations.

Aug 28, 2026 - 11:54
 0  16
వంశీరాం బిల్డ‌ర్స్ స‌రికొత్త రికార్డు.. రాయ‌దుర్గంలో ఎక‌రా రూ.269 కోట్లు పెట్టి కొన్న సుబ్బారెడ్డి

హైద‌రాబాద్‌కు చెందిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వంశీరాం బిల్డ‌ర్స్.. రాయ‌దుర్గం భూముల వేలంలో.. ఎక‌రాకు రూ.269 కోట్లు పెట్టి 5.38 ఎకరాల భూమిని సొంతం చేసుకుంది. ఈ ప్లాట్‌ను సుమారు రూ.1,447.22 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ స్థ‌లంలో ఐటీ స్థ‌లాల్ని అభివృద్ధి చేసేందుకు వంశీరాం బిల్డ‌ర్స్ ప్ర‌ణాళిక‌ల్ని ర‌చిస్తుంద‌ని స‌మాచారం. 

* గత వారం నిర్వహించిన మొద‌టి ప్లాట్ వేలంలో 5.25 ఎకరాలకు రూ.1,386 కోట్లు లభించాయి. అంటే ఎకరాకు రూ.264 కోట్ల ధర ప‌లికింది. మొద‌టి ప్లాటు వేలం విలువలో 25 శాతం మొత్తాన్ని తొలి దశ చెల్లింపుగా ఇప్పటికే టీజీఐఐసీ అందుకుంది. రెండు వేలం పాట‌ల్ని క‌లిపితే.. మొత్తం 10.63 ఎకరాలకు సుమారు రూ.2,833.22 కోట్లు సమకూరాయి. ఎకరాకు సగటున రూ.266.53 కోట్ల ధర లభించింది. కేవలం వారం రోజుల వ్య‌వ‌ధిలో జ‌రిగిన రెండు వేలం పాట‌ల్లో.. ఎక‌రాకు రూ.260 కోట్ల‌కు పైగా ధ‌ర ప‌ల‌క‌డం.. ఆయా ప్రాంతంపై పెట్టుబ‌డిదారులు, డెవ‌ల‌ప‌ర్ల‌కు ఉన్న న‌మ్మ‌కాన్ని సూచిస్తోంది. ఈ సందర్భంగా టీజీఐఐసీ ఛైర్మన్, ఎండీ కె. శశాంక మాట్లాడుతూ.. రాయ‌దుర్గం వేలం ఫలితం హైదరాబాద్, తెలంగాణపై పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0