22- ఏపై ప్రభుత్వం క్లారిటీ.. భూముల విషయంలో భయమెందుకు?
The Telangana government has sought to clarify concerns surrounding Section 22A of the Registration Act and the prohibited properties list, stating that there is no truth in allegations that lakhs of acres of private land have been wrongly included.
22ఏ నిషేధిత జాబితా చుట్టూ రాష్ట్రంలో జరుగుతున్న ప్రచారానికి ప్రభుత్వం తెరదించే ప్రయత్నం చేసింది. లక్షల ఎకరాల ప్రైవేట్ భూములను 22ఏలో చేర్చారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఏ భూమి ఎందుకు నిషేధిత జాబితాలోకి వెళ్లింది.. దానికి సంబంధించిన రికార్డులన్నింటినీ ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు. ప్రత్యేకంగా హైదరాబాద్ చుట్టుపక్కల వేగంగా విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్ నేపథ్యంలో 22ఏ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. భూమి కొనుగోలు, అమ్మకాలు, వెంచర్లు, నిర్మాణాల విషయంలో క్లారిటీ లేకపోతే లావాదేవీలు ఆగిపోవడం, కొనుగోలుదారుల్లో అనుమానాలు పెరగడం సహజం. ఈ నేపథ్యంలో నిజమైన ప్రైవేట్ భూములకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూములుగా చూపించి రిజిస్ట్రేషన్లు చేయించుకునే ప్రయత్నాలను సహించబోమని మంత్రి స్పష్టం చేశారు. నకిలీ జీఓలు, బోగస్ మెమోలు, ఫేక్ సర్టిఫికెట్లతో ప్రభుత్వ భూములపై హక్కులు సృష్టించే వ్యవహారాలను గుర్తించామని, ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ తదితర ప్రాంతాల్లోని భూ వ్యవహారాలను ఉదాహరణగా చూపుతూ.. రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా ఉన్న భూమిని కాపాడటం ప్రభుత్వ బాధ్యతేనని మంత్రి పేర్కొన్నారు.
రియల్ ఎస్టేట్‌కు స్పష్టత..
మరోవైపు యూఎల్‌సీ, భూదాన్, అసైన్డ్, ప్రభుత్వ భూములకు సంబంధించిన పాత రికార్డుల కారణంగా కొన్ని భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే సరైన పత్రాలు ఉన్న ప్రైవేట్ భూములకు సమస్యలు ఉంటే వాటిని కేసుల వారీగా పరిశీలించి పరిష్కరిస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే 22ఏకు సంబంధించి వచ్చిన దరఖాస్తుల్లో 98 శాతం రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని ప్రభుత్వం తెలిపింది. నిజమైన సమస్యలను 24 గంటల్లో.. అవసరమైతే గరిష్ఠంగా 36 గంటల్లో పరిష్కరించేలా ఫాస్ట్‌ట్రాక్ విధానం అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయిన వారికి చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది.
భయానికి కాదు.. భూమి లావాదేవీలకు క్లారిటీ
మొత్తంగా 22ఏ అంశంపై జరుగుతున్న ప్రచారం వల్ల భూముల కొనుగోలు, అమ్మకాలపై అనవసర భయాందోళనలు పెంచవద్దన్నదే ప్రభుత్వ వాదన. ప్రభుత్వ భూములను రక్షించడంతో పాటు చట్టబద్ధమైన ప్రైవేట్ ఆస్తులకు రక్షణ కల్పించడమే లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో కీలకమైనది 22ఏ పేరు కాదు.. భూమికి సంబంధించిన రికార్డులు క్లియర్‌గా ఉన్నాయా లేదా అన్నదే. తప్పు జరిగితే సరిదిద్దుతామని.. అక్రమం బయటపడితే చర్యలు తప్పవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0