సూపర్‌టెక్‌ ప్రాజెక్టుల్లో మళ్లీ కదలిక

Construction work is set to resume on 16 stalled Supertech projects from January 16, 2027, according to a latest report submitted by the Supreme Court-appointed committee to the NCLAT. Tenders for the projects will be issued in phases between October 1 and 15, 2026.

Oct 3, 2026 - 05:43
 0  19
సూపర్‌టెక్‌ ప్రాజెక్టుల్లో మళ్లీ కదలిక
supertech-projects-construction-resume-january-2027

-      నిలిచిపోయిన 16 ప్రాజెక్టుల్లో జనవరి నుంచి నిర్మాణం

ఏళ్లుగా నిలిచిపోయిన సూపర్‌టెక్‌ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుల్లో నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమయ్యే దిశగా కీలక అడుగు పడింది. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్ సీఎల్ ఏటీ)కు సమర్పించిన తాజా నివేదిక ప్రకారం.. నిలిచిపోయిన 16 ప్రాజెక్టుల్లో 2027 జనవరి 16 నుంచి నిర్మాణ పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఈ ఏడాది అక్టోబర్‌ 1 నుంచి 15 మధ్య దశలవారీగా టెండర్లు జారీ చేయనున్నారు. ఈ 16 ప్రాజెక్టులకు నేషనల్‌ బిల్డింగ్స్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ (ఎన్ బీసీసీ) ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తోంది.

నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు కనీసం 27 వేర్వేరు సబ్‌-టెండర్‌ ప్యాకేజీలుగా పనులను విభజించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఉత్తరాఖండ్‌లోని రుద్రపుర్‌లో ఉన్న సూపర్‌టెక్‌ రివర్‌ క్రెస్ట్‌ ప్రాజెక్టుకు సెప్టెంబరు 16న టెండర్‌ జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిర్మాణం ప్రారంభించేందుకు అవసరమైన నిధుల సమీకరణ మాత్రం కీలక సవాలుగా ఉందని సుప్రీంకోర్టు కమిటీ పేర్కొంది. ప్రాజెక్టుల పునరుద్ధరణకు మధ్యంతర నిధులతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి సంస్థాగత రుణాలు పొందే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

రెండు పెట్టుబడి, మూలధన సంస్థల నుంచి వచ్చిన ఆర్థిక ప్రతిపాదనలను పరిశీలించినప్పటికీ.. అవి అధిక వడ్డీ రేట్ల కారణంగా ఆచరణీయంగా లేవని కమిటీ తెలిపింది. దీంతో తక్కువ అనుకూలమైన నిబంధనలపై ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి నిధులు సమీకరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అలాగే నిర్మాణానికి నిధులు సమకూర్చుకునే మరో మార్గంగా అమ్ముడుకాని ఇళ్లను విక్రయించాలని కమిటీ భావిస్తోంది. ఈ 16 ప్రాజెక్టుల్లో మొత్తం 50,356 యూనిట్లు ఉన్నాయి. వాటిలో 40,316 యూనిట్లు ఇప్పటికే విక్రయించగా.. 10,040 యూనిట్లు అమ్ముడుకాకుండా ఉన్నాయి. వీటిని విక్రయించడం ద్వారా నిధులు పొందాలని యోచిస్తున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0