హైకోర్టు అంటే హైడ్రాకు లెక్క లేదా?
The dispute over Sunnam Cheruvu in Madhapur has intensified, with local residents protesting against HYDRA’s actions around the lake.
సున్నం చెరువుకు సంబంధించి స్టే ఉన్నా..
హైడ్రా చర్యలేమిటని స్థానికుల ప్రశ్న..
సున్నం చెరువు వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారింది. చెరువు పరిరక్షణ పేరుతో హైడ్రా చేపడుతున్న చర్యలతో తమ భూములు, ప్లాట్లు నష్టపోతున్నాయని ఆరోపిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. తమకు సంబంధించిన భూముల విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించామని, హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ చర్యలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సున్నం చెరువు పరిధిలోని భూములు, ప్లాట్లపై కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. చెరువు పరిధి, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ అంశాల నేపథ్యంలో హైడ్రా చర్యలు చేపడుతుండగా.. తమ భూములను కూడా చెరువు పరిధిలోకి తీసుకొస్తున్నారని స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల తమ ఆస్తుల విలువ దెబ్బతినడంతో పాటు, భవిష్యత్‌లో తమకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. తమ భూములకు సంబంధించి హైకోర్టులో కేసు కొనసాగుతోందని, కోర్టు నుంచి స్టే ఉత్తర్వులు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. కోర్టు పరిధిలో ఉన్న భూముల విషయంలో తుది నిర్ణయం వెలువడే వరకు ఎలాంటి చర్యలు చేపట్టకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు. కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ అధికారులు వ్యవహరించాలని కోరుతున్నారు.
సున్నం చెరువు పరిధిలోని ఆంజనేయ స్వామి ఆలయం అంశం కూడా వివాదంలో మరో కీలకంగా మారింది. ఈ ఆలయానికి స్థానికులు నిత్యం వెళ్తుంటారని, ఆలయానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా ఉందని స్థానికులు చెబుతున్నారు. కోర్టు వ్యవహారం తేలే వరకు ఆలయం పరిసరాల్లో ఎలాంటి చర్యలు చేపట్టకూడదని వారు కోరుతున్నారు. సున్నం చెరువు పరిధిలో 80కి పైగా ప్లాట్లను చెరువులో కలిపే ప్రయత్నం జరుగుతోందని స్థానికులు ఆరోపించారు. తమ జీవితకాల సంపాదనతో కొనుగోలు చేసిన భూములు, ప్లాట్లపై చర్యలు తీసుకుంటే తాము తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. భూముల హద్దులు, సర్వే వివరాలు, కోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే అధికారులు ముందుకు వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై చాలా కాలంగా పోరాటం చేస్తున్న మాదాపూర్-శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కార్తీక్ రాయల తీవ్రంగా స్పందించారు. సున్నం చెరువు వద్ద జరుగుతున్న పరిణామాలను ప్రభుత్వం, ప్రజల దృష్టికి తీసుకురావడానికే స్థానికులతో కలిసి సమావేశమైనట్లు తెలిపారు. “మాదాపూర్ సున్నం చెరువు వద్ద అరాచకం జరుగుతోంది. సున్నం చెరువులోపల ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. చుట్టుపక్కల ప్రజలు నిత్యం ఈ గుడికి వస్తుంటారు. గుడికి రిజిస్ట్రేషన్ కూడా ఉంది. హైడ్రాకు కోర్టు అంటే భయం లేదు. కోర్టు ఆర్డర్స్ వచ్చే వరకు మేము టెంపుల్ వద్దకు వెళ్లనివ్వం. 80కి పైగా ప్లాట్లను సున్నం చెరువులో కలిపారు. సున్నం చెరువు ప్రారంభోత్సవానికి వస్తే మేము అడ్డుకుంటాం. హైడ్రాకు, ప్రభుత్వానికి ఇదే మా హెచ్చరిక అని కార్తిక్ రాయల అన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0