మూడు కమర్షియల్ యూనిట్లు.. రూ.17 కోట్లు

Bollywood singer Sonu Nigam has purchased three commercial units in the Aston building at Sundarvan Complex on Lokhandwala Road, Andheri West, Mumbai, for a total of ₹17 crore.

Oct 23, 2026 - 03:14
 0  35
మూడు కమర్షియల్ యూనిట్లు.. రూ.17 కోట్లు
sonu-nigam-buys-three-commercial-units-mumbai-rs-17-crore
-      ముంబైలో కొనుగోలు చేసిన సోనూ నిగమ్
 
ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్ రియల్‌ ఎస్టేట్‌లో భారీగా పెట్టుబడి పెట్టారు. ముంబైలోని అంధేరీ వెస్ట్‌లో మొత్తం రూ.17 కోట్ల విలువైన మూడు కమర్షియల్ యూనిట్లను ఆయన కొనుగోలు చేశారు. లోఖండ్‌వాలా రోడ్డులోని సుందర్‌వన్ కాంప్లెక్స్‌లో ఉన్న ‘ఆస్టన్’ భవనంలో సోనూ నిగమ్ ఈ మూడు యూనిట్లను కొనుగోలు సొంతం చేసుకున్నారు. వీటిలో రెండు యూనిట్లు భవనం మొదటి అంతస్తులో ఉండగా.. మరో చిన్న కమర్షియల్ యూనిట్ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉంది.
మొదటి అంతస్తులోని రెండు యూనిట్లను రూ.16 కోట్లకు కొనుగోలు చేశారు. వీటి మొత్తం కార్పెట్‌ ఏరియా 3,885.77 చదరపు అడుగులు. ఈ కొనుగోలుకు రూ.96 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. అంతేకాకుండా బేస్‌మెంట్‌లోని స్టాక్‌ పార్కింగ్‌ వ్యవస్థలో నాలుగు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఈ డీల్‌లో భాగంగా ఉన్నాయి. ఇదే భవనంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న మరో 258.33 చదరపు అడుగుల కమర్షియల్ యూనిట్‌ను రూ.కోటికి సోనూ నిగమ్ కొనుగోలు చేశారు.
దీనికి రూ.6 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ.30 వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినట్లు పత్రాల్లో నమోదైంది. మూడు యూనిట్లను కలిపితే మొత్తం 4,144.10 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా వస్తుంది. మొత్తం కొనుగోలు విలువ రూ.17 కోట్లు కావడంతో.. సగటున చదరపు అడుగుకు సుమారు రూ.41,021 చెల్లించినట్లవుతుంది. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. రిజిస్ట్రేషన్‌కు ముందు రూపొందించిన పత్రాల్లో ఈ ఆస్తుల రెడీ రెకనర్ విలువ సుమారు రూ.11.94 కోట్లుగా ఉంది. అయితే ఒప్పందంలో నమోదైన కొనుగోలు విలువ రూ.16 కోట్లు కావడం గమనార్హం.
 
ఒకే భవనంలో పెట్టుబడి ఎందుకు?
 
సోనూ నిగమ్ ఒకే భవనంలో వరుసగా మూడు కమర్షియల్ యూనిట్లను కొనుగోలు చేయడం ఆసక్తికరంగా మారింది. వీటిని సొంత కార్యాలయ అవసరాలకు ఉపయోగించనున్నారా? లేక భవిష్యత్తులో అద్దె ఆదాయం, ఆస్తి విలువ పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడిగా తీసుకున్నారా? అన్నది మాత్రం స్పష్టంగా తెలియలేదు. ఈ విషయంపై సోనూ నిగమ్‌ నుంచి, ఆస్తులను విక్రయించిన సింగ్యులర్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కూడా స్పందన రాలేదు. కాగా, సోనూ నిగమ్‌కు రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలు కొత్తేమీ కాదు.
2026లో మహారాష్ట్రలోని కర్జత్‌లో 1.9 హెక్టార్లకు పైగా భూమిని రూ.1.95 కోట్లకు విక్రయించారు. అనంతరం మేలో మరో 1.067 హెక్టార్ల భూమిని రూ.95 లక్షలకు విక్రయించారు. అదే సమయంలో సోనూ నిగమ్ కుటుంబానికి సంబంధించిన మరో రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీ కూడా ఈ ఏడాది వెలుగులోకి వచ్చింది. ఆయన తండ్రి అగమ్ కుమార్ నిగమ్ ముంబయిలోని మాధ్ ఐలాండ్‌లో 1,197 చదరపు మీటర్ల స్థలంతో పాటు గ్రౌండ్‌ ప్లస్‌ వన్‌ అంతస్తుల నివాస, వాణిజ్య భవనాన్ని రూ.10 కోట్లకు కొనుగోలు చేశారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0