ఆర్‌బీఐ రెపో రేటు పెంపు.. గృహ రుణాల ఈఎంఐలకు షాక్‌?

The RBI’s 25-basis-point repo rate hike from 5.25% to 5.50% could increase borrowing costs and put pressure on home loan EMIs.

Oct 23, 2026 - 07:05
 0  5
ఆర్‌బీఐ రెపో రేటు పెంపు.. గృహ రుణాల ఈఎంఐలకు షాక్‌?
rbi-repo-rate-hike-impact-home-loan-emis-homebuyers

-      పండగ సీజన్‌లో ఇళ్ల కొనుగోళ్లపై ప్రభావం చూపే అవకాశం..
-      అందుబాటు ధరల ఇళ్ల విభాగానికే ఎక్కువ ఒత్తిడి

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బఐ) రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్లు పెంచడంతో గృహ రుణాలపై ప్రభావం పడే అవకాశం ఉందని రియల్‌ ఎస్టేట్‌ రంగ నిపుణులు చెబుతున్నారు. పెరిగిన వడ్డీ రేట్ల కారణంగా హోమ్‌ లోన్‌ ఈఎంఐలు పెరగవచ్చని, దీంతో ముఖ్యంగా మధ్యతరగతి, అందుబాటు ధరల ఇళ్ల కొనుగోలుదారులు తమ బడ్జెట్‌ను మరోసారి పరిశీలించే పరిస్థితి ఏర్పడొచ్చని పేర్కొంటున్నారు. పండగ సీజన్‌లో సాధారణంగా ఇళ్ల విక్రయాలు ఊపందుకునే నేపథ్యంలో ఈ పరిణామం కీలకంగా మారింది.  ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక-రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ఆర్‌బీఐ రెపో రేటును 5.25 శాతం నుంచి 5.50 శాతానికి పెంచింది. 2023 ఫిబ్రవరి తర్వాత రెపో రేటులో ఇదే తొలి పెంపు. అలాగే ద్రవ్య విధాన వైఖరిని ‘క్యాలిబ్రేటెడ్‌ టైటెనింగ్‌’గా మార్చింది. ఎస్‌డీఎఫ్‌ రేటు 5.25 శాతంగా, ఎంఎస్‌ఎఫ్‌, బ్యాంక్‌ రేట్లు 5.75 శాతంగా ఉన్నాయి. Hindustan Times

గృహ కొనుగోళ్లపై ఒత్తిడి

రెపో రేటు పెంపుతో బ్యాంకులు, ఇతర రుణ సంస్థల నుంచి తీసుకునే రుణాల వ్యయం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫ్లోటింగ్‌ రేట్‌ హోమ్‌ లోన్లు తీసుకున్న వారికి భవిష్యత్తులో ఈఎంఐలు పెరగవచ్చు. దీంతో ధరల విషయంలో సున్నితంగా స్పందించే కొనుగోలుదారులు ఇల్లు కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడం లేదా తక్కువ ధరలోని ప్రాజెక్టుల వైపు మళ్లడం జరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలోని ప్రధాన ఏడు నగరాల్లో 2026 మూడో త్రైమాసికంలో సుమారు 1,00,220 ఇళ్లు అమ్ముడయ్యాయి.

గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే విక్రయాలు 3 శాతం, అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే 10 శాతం పెరిగాయి. ఇందులో అందుబాటు ధరల ఇళ్ల వాటా 16 శాతంగా ఉంది. ఇదే సమయంలో సగటు నివాస ధరలు ఏడాది ప్రాతిపదికన సుమారు 7 శాతం పెరిగాయి. ఇళ్ల ధరలు ఇప్పటికే పెరిగిన నేపథ్యంలో రుణ వడ్డీ కూడా పెరగడం కొనుగోలుదారులపై ద్వంద్వ ఒత్తిడిని కలిగించొచ్చు. ముఖ్యంగా మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసే వారు, మధ్యతరగతి వర్గాలు తమ బడ్జెట్‌ను తగ్గించుకోవడం లేదా కొనుగోలును కొంతకాలం వాయిదా వేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0