కోర్టు ధిక్కరణ.. రంగారెడ్డి కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష
The Telangana High Court sentenced Rangareddy District Collector C. Narayana Reddy to six months of simple imprisonment and imposed a fine of ₹2,000 for contempt of court over failure to implement its directions.
తెలంగాణ హైకోర్టు ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. నిషేధిత భూముల జాబితా నుంచి మూడు భూములను తొలగించే అంశాన్ని పరిశీలించాలన్న ఆదేశాలను అమలు చేయనందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డికి ఆరు నెలల సాధారణ జైలు శిక్ష, రూ.2,000 జరిమానా విధించింది.
అయితే తదుపరి న్యాయపరమైన చర్యలకు అవకాశాన్ని కల్పిస్తూ.. శిక్షను నాలుగు వారాల పాటు నిలిపివేసింది. జస్టిస్ కె. లక్ష్మణ్ ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది.
సెక్షన్ 22-A కింద నిషేధిత జాబితాలో ఉన్న మూడు భూములను తొలగించాలని యజమానులు కోరగా, 2025 ఆగస్టులో 60 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. అయినా అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది.
సమీపంలోని మరో భూమిని జాబితా నుంచి తొలగించి, వీటిని ఎందుకు కొనసాగించారని కోర్టు ప్రశ్నించింది. న్యాయస్థానం ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా పాటించలేదని పేర్కొంది. భూముల కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్‌కు ముందు 22-A జాబితాలో ఉన్నాయో లేదో తప్పనిసరిగా పరిశీలించాలి.
ఇదీ చదవండి: ఎయిర్‌పోర్ట్ కారిడార్‌లో లగ్జరీ విల్లాలు
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0