- పీఆర్ఆర్ డెవలపర్స్ అత్యుత్తమ విల్లా ప్రాజెక్టు
- మోకిలా మెయిన్ రోడ్డు పక్కనే..
- 9.02 ఎకరాలు.. 77 విల్లాలు..
- 300-350 గజాలు.. 4,504- 5,250 చ.అ.
- 15,528 చదరపు అడుగుల క్లబ్‌హౌస్
- ఆధునిక ఆవాసానికి నయా చిరునామా
(కింగ్ జాన్సన్ కొయ్యడ, 9030034591)
కోకాపేట్‌లో నాలుగైదు కోట్లు పెట్టి లగ్జరీ ఫ్లాట్ కొనడం బదులు.. నియోపోలిస్ నుంచి కేవలం పది, పదిహేను నిమిషాల దూరంలో.. ఎంచక్కా లగ్జరీ విల్లాను సొంతం చేసుకోవచ్చనే సంగతి మీకు తెలుసా? కాకపోతే, కొత్త ప్రాజెక్టుల బదులు నిర్మాణం చివరి దశలో ఉన్న కమ్యూనిటీలను ఎంచుకుంటే.. అలా కొనగానే ఇలా ఆధునిక సదుపాయాల్ని ఎంచక్కా ఆస్వాదించొచ్చు. మరి, మీరు ఇలాంటి ప్రాజెక్టు కోసం వెతుకుతున్నట్లయితే.. మీ ముందున్న ఒక చక్కటి ఆప్షన్.. పీఆర్ఆర్ డెవలపర్స్ ఎండీ పి.రామాంజనేయ రాజు డెవలప్ చేస్తున్న అత్యాధునిక విల్లా కమ్యూనిటి అని ఘంటాపథంగా చెప్పొచ్చు. మరి, ఈ లగ్జరీ ప్రాజెక్టుపై రియల్ ఎస్టేట్ గురు అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం..
లగ్జరీ విల్లాల్లో నివసించాలని కోరుకునేవారికి.. నియోపోలిస్ తర్వాత కనిపిస్తున్న మోకిలా ప్రాంతం అత్యుత్తమ లొకేషన్ గా అవతరిస్తోంది. ఎందుకంటే, బడా లగ్జరీ గృహాలకు ఇదే ఫ్యూచరిస్టిక్ ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది. ఈ అంశానికి గల ప్రాధాన్యతను ముందే గుర్తించిన పీఆర్ఆర్ డెవలపర్స్.. మోకిలా మెయిన్ రోడ్డుకు కూతవేటు దూరంలో.. ప్రణీత్ ప్రణవ్ వెనీషియా అనే అత్యంత సుందరమైన ఫోర్ బీహెచ్‌కే ట్రిప్లెక్స్ విల్లా కమ్యూనిటీనిని ప్రారంభించింది.
సుమారు 9.02 ఎకరాల్లో.. హాయిగొలిపే డెబ్బయ్ ఏడు లగ్జరీ విల్లాలను నిర్మిస్తోంది. ఒక్కో విల్లాను 300 నుంచి 350 చదరపు గజాల్లో నిర్మిస్తున్నారు. బిల్టప్ ఏరియా విషయానికి వస్తే 4,504 నుంచి 5,250 చదరపు అడుగుల్లో కడుతున్నారు. మూడు అంతస్తుల్లో నిర్మించిన ఈ విల్లాల్లో గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లు ప్రత్యేకంగా ఉంటాయి. విశాలమైన విల్లా కమ్యూనిటీలో ప్రతిరోజు జీవనాన్ని ఆస్వాదించాలని కోరుకునేవారికి ఇది పర్‌ఫెక్టుగా నచ్చుతుంది.
స్కూళ్లు ఎంత దూరం?
పీఆర్ఆర్ డెవలపర్స్ అభివృద్ధి చేస్తున్న ప్రణీత్ ప్రణవ్ వెనీషియా ట్రిప్లెక్స్ గేటెడ్ కమ్యూనిటీ నుంచి అంతర్జాతీయ స్కూళ్లు, ఆస్పత్రులు, నియోపోలిస్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులకు సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. కిలోమీటర్ దూరంలో ఎం మార్ట్, 2 కిలోమీటర్లలో మెహా హాస్పటల్స్, ఐదు కిలోమీటర్లలో ఇండస్ ఇంటర్నేషన్ స్కూల్ వంటివి ఉన్నాయి. ప్రస్తుతమెంతో అభివృద్ధి చెందిన మియాపూర్ నుంచి స్కూళ్లు, ఆస్పత్రులు వంటివి ఇంతే దూరంలో ఉంటాయనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. కాకపోతే, మియాపూర్‌లో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటే, ఇక్కడంతా హరితమయంతో ప్రశాంతంగా నివసించొచ్చు.
* మోకిలా ప్రత్యేకత ఏమిటంటే.. ఈ ప్రాంతం నుంచి గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, నియోపొలిస్, తెల్లాపూర్‌లకు మంచి కనెక్టివిటీ ఉంది. ఇక్కడ్నుంచి విప్రో, మైక్రోసాఫ్ట్, ఐఎస్‌బీ, ఐఐఐటీ, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థలు, ఐటీ కంపెనీలకు సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. అందుకే, అధిక శాతం మంది ఐటీ ఉద్యోగులు, సంపన్న వర్గాలు, సినీ ప్రముఖులకు పీఆర్ఆర్ డెవలపర్స్ అభివృద్ధి చేస్తున్న ఈ లగ్జరీ విల్లా కమ్యూనిటీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
ఇందులోని ప్రధాన ఆకర్షణల్లో 15,528 చదరపు అడుగుల క్లబ్‌హౌస్ ఒకటి. వినోదం, ఫిట్‌నెస్, కమ్యూనిటీ కార్యక్రమాలకు అవసరమైన సదుపాయాలు ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్, ఏసీ జిమ్, పార్టీ సెంటర్, యోగా–మెడిటేషన్ హాల్, లైబ్రరీ, గెస్ట్ రూమ్స్, ఇండోర్ గేమ్స్ రూమ్, జాగింగ్ ట్రాక్, పిల్లల ఆట స్థలం, క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్ వంటివి పొందుపరిచారు.
* మూడు అంతస్తుల్లో సులభంగా రాకపోకలు సాగించేందుకు విల్లాల్లో లిఫ్ట్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టులో పవర్ బ్యాకప్, నీటి శుద్ధి ప్లాంట్, మురుగునీటి శుద్ధి ప్లాంట్, వర్షపు నీటి సంరక్షణ గుంతలు, 24 గంటల భద్రత, సీసీటీవీ నిఘా, సోలార్ ఫెన్సింగ్, ఎల్ఈడీ వీధి దీపాలు వంటివి పొందుపరిచారు.
ఎవరి కోసం?
హోమ్‌బయ్యర్ల కోణంలో చూస్తే, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, పశ్చిమ హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాల్లో పనిచేసే కుటుంబాలకు ఈ విల్లాలు ఆకర్షణీయంగా ఉండవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత విల్లాలో కాస్తంత అదనపు స్థలం, ప్రైవసీతో పాటు గేటెడ్ కమ్యూనిటీ సదుపాయాల్ని ఆస్వాదించాలని కోరుకునే కుటుంబాలు ఈ ప్రాజెక్టును ఎంచుకోవచ్చు.
నియోపోలిస్ నుంచి 10 నిమిషాల్లో..
నియోపొలిస్‌లో ఒక ఫ్లాట్ కోసం రూ.5–10 కోట్లు ఖర్చు చేయడానికి బదులుగా, అక్కడి నుంచి 10–15 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్న విలాసవంతమైన విల్లా కమ్యూనిటీని కొనుగోలుదారులు పరిశీలించవచ్చు. అంతకంటే తక్కువ ధరలోనే.. ఎక్కువ స్థలం, విల్లా ప్రైవసీని పొందే అవకాశం ఉంది. నిర్మాణ పనుల్ని వేగంగా జరిపిస్తున్నాం. పశ్చిమ హైదరాబాద్‌లోని అత్యుత్తమ ప్రీమియం లగ్జరీ విల్లా కమ్యూనిటీల్లో ఒకటిగా దీనిని అభివృద్ధి చేస్తున్నాం.- పి.రామాంజనేయన రాజు, ఎండీ, పీఆర్ఆర్ డెవలపర్స్.
సినీ ప్రముఖులు, ప్రవాసులకు
సిటీ నుంచి కొంచెం దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో నివసించాలని కోరుకునే సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ప్రవాసులకు.. పీఆర్ఆర్ డెవలపర్స్ అభివృద్ధి చేస్తున్న ప్రణీత్ ప్రణవ్ వెనీషియాను ట్రిప్లెక్స్ విల్లా చక్కటి చిరునామాగా అభివర్ణించొచ్చు. మూడు అంతస్తుల లగ్జరీ నిర్మాణం కారణంగా.. ఇందులోని నివసించేవారు.. లివింగ్, వర్క్, వ్యక్తిగత అవసరాలకు ప్రత్యేక స్పేసెస్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.