రాజేంద్రనగర్‌లో తక్కువ సాంద్రతతో లగ్జరీ విల్లా కమ్యూనిటీ
Pranava Greenwich is a premium villa project being developed across 9.13 acres in Upperpally, Rajendranagar, Hyderabad.
- ప్రణవ గ్రీన్‌విచ్ ప్రత్యేకతలివే
హైదరాబాద్ నైరుతి ప్రాంతంలో విశాలమైన విల్లాలు, పచ్చదనంతో కూడిన నివాస సముదాయాలకు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్ పరిధిలోని అప్పర్‌పల్లిలో ‘ప్రణవ గ్రీన్‌విచ్’ పేరుతో ప్రీమియం విల్లా ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. తక్కువ సంఖ్యలో విల్లాలు, విశాలమైన స్థలాలు, ఆధునిక జీవనశైలి సదుపాయాలు ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలు.
సన్‌సిటీ వైపు వెళ్లే 100 అడుగుల రహదారికి ఆనుకుని 9.13 ఎకరాల్లో ఈ గేటెడ్ కమ్యూనిటీని అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో 4, 5, 6 బీహెచ్‌కే విభాగాల్లో మొత్తం 90 విల్లాలు ఉన్నాయి. ఒక్కో విల్లా 3,671 నుంచి 7,917కు పైగా చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంతో రూపొందించారు.
ప్రతి ఇంటిలో హోమ్ థియేటర్ సదుపాయం కల్పించారు. బండ్లగూడ జాగీర్, నార్సింగి, మణికొండ, కిస్మత్‌పూర్ ప్రాంతాలకు సులభంగా చేరుకునే అవకాశం ఉంది.
బంజారాహిల్స్, హైటెక్ సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా మెరుగైన కనెక్టివిటీ ఉంది. 20,000కు పైగా చదరపు అడుగుల విస్తీర్ణంలో క్లబ్‌హౌస్‌ను ఏర్పాటు చేశారు. స్విమ్మింగ్ పూల్స్, జిమ్, సైక్లింగ్ ట్రాక్, అవుట్‌డోర్ ఫిట్‌నెస్ జోన్, పిల్లల ఆట స్థలం, యాంఫీథియేటర్, క్రికెట్ ప్రాక్టీస్ పిచ్, బాస్కెట్‌బాల్ కోర్టు వంటి సదుపాయాలు ఉన్నాయి.
మెడిటేషన్ ఏరియా, స్కేటింగ్ రింక్, సీనియర్ సిటిజన్ డెక్, కూరగాయలు, ఔషధ మొక్కల తోటలు, కమ్యూనిటీ ఫార్మింగ్‌కు కూడా ప్రాధాన్యత ఇచ్చారు.
తెలంగాణ రెరాలో నమోదైన ఈ ప్రాజెక్టు నిర్మాణం తుది దశకు చేరుకుంది. విల్లాల ధరలు రూ.5 కోట్ల నుంచి ప్రారంభమవుతున్నాయి. క్రెడాయ్ జాతీయ అవార్డును కూడా అందుకుంది. విశాలమైన స్వతంత్ర నివాసాలు, గోప్యత, పచ్చదనంతో కూడిన గేటెడ్ కమ్యూనిటీ కోరుకునే కుటుంబాలకు ప్రణవ గ్రీన్‌విచ్ ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తోంది.
ఇదీ చదవండి: 20 అడుగుల రూల్.. ఇళ్ల యజమానులకు షాక్
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0