కోటి ఇళ్లు పూర్తి.. మరో కోటి  కుటుంబాలకు సొంతింటి లక్ష్యం

The Pradhan Mantri Awas Yojana–Urban (PMAY-U) has crossed a major milestone, with more than one crore homes completed and handed over to beneficiaries out of around 1.25 crore sanctioned houses.

Sep 26, 2026 - 02:34
 0  13
కోటి ఇళ్లు పూర్తి.. మరో కోటి   కుటుంబాలకు సొంతింటి లక్ష్యం
pmay-u-2-one-crore-homes-affordable-housing-urban-families
  • పీఎంఏవైయూ కింద పూర్తయిన కోటి ఇళ్లు

దేశంలోని పట్టణ పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరల్లో ఇళ్లను అందించే లక్ష్యంతో అమలవుతున్న ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన–అర్బన్‌ (పీఎంఏవైయూ) కీలక మైలురాయిని చేరుకుంది. 2015లో ప్రారంభమైన ఈ పథకం, 2024లో పీఎంఏవైయూ-2గా మరింత విస్తరించింది. ఇప్పటివరకు వీటి కింద 1.25 కోట్ల ఇళ్లకు అనుమతులు మంజూరు కాగా.. కోటికి పైగా ఇళ్లు పూర్తై లబ్ధిదారులకు అందాయి. మరో కోటి పట్టణ కుటుంబాలకు ప్రయోజనం కల్పించడమే పీఎంఏవైయూ-2 తదుపరి లక్ష్యంగా ఉంది.

పట్టణ ప్రాంతాల్లో ఇల్లు లేని లేదా తగిన గృహ వసతి లేని కుటుంబాలకు పక్కా ఇళ్లు, ప్రాథమిక మౌలిక సదుపాయాలు అందించేందుకు 2015 జూన్‌లో పీఎంఏవైయూని ప్రారంభించారు. తొలుత 2022 వరకు అమలు చేయాలని నిర్ణయించినప్పటికీ, ఇప్పటికే మంజూరైన ఇళ్లను పూర్తి చేయడానికి ఈ పథకాన్ని 2026 సెప్టెంబర్‌ 30 వరకు పొడిగించారు.  ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2026 ఆగస్టు 9 నాటికి 1.25 కోట్ల ఇళ్లు మంజూరు కాగా, ఒక కోటి ఇళ్లు పూర్తయ్యాయి.

దీనికి ముందు ఉన్న పట్టణ గృహ పథకాలతో పోలిస్తే ఇది గణనీయమైన విస్తరణ. 2005–2014 మధ్య గత పథకాల కింద సుమారు 8 లక్షల పట్టణ ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని కేంద్రం వెల్లడించింది. పీఎంఏవైయూ అనుభవాల ఆధారంగా కేంద్రం 2024 సెప్టెంబర్‌ నుంచి పీఎంఏవైయూ-2ను అమల్లోకి తీసుకొచ్చింది. 2024–2029 మధ్య మరో కోటి పట్టణ కుటుంబాలకు సొంత ఇల్లు నిర్మించుకోవడం, కొనుగోలు చేయడం లేదా అద్దెకు అందుబాటులో ఉండే గృహాలను పొందేందుకు సహాయం చేయడం దీని లక్ష్యం.

అర్హత ఉన్న కుటుంబాలకు ఒక్కో యూనిట్‌కు గరిష్ఠంగా రూ.2.50 లక్షల వరకు సహాయం అందించే నిబంధనలు ఉన్నాయి.  ఈ పథకం కేవలం ఇళ్లు నిర్మించడానికే పరిమితం కాకుండా.. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే కుటుంబాలు, ప్రాజెక్టుల్లో ఇళ్లు కొనుగోలు చేసేవారు, అద్దె ఇళ్ల కోసం చూస్తున్నవారు, గృహ రుణాలు తీసుకునేవారిని కూడా కవర్‌ చేస్తోంది.

నాలుగు మార్గాల్లో ప్రయోజనం

పీఎంఏవైయూ-2ని నాలుగు ప్రధాన విభాగాలుగా అమలు చేస్తున్నారు.

1. బెనిఫిషియరీ లెడ్‌ కన్‌స్ట్రక్షన్‌ (బీఎల్ సీ):

సొంత స్థలం ఉన్న ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కుటుంబాలు ఇల్లు నిర్మించుకునేందుకు గరిష్ఠంగా రూ.2.50 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది. ఇంటి గరిష్ఠ కార్పెట్‌ ఏరియా 45 చదరపు మీటర్లుగా ఉంటుంది. ఆగస్టు 9 నాటికి పీఎంఏవైయూ కింద మంజూరైన 18.38 లక్షల ఇళ్లలో 14.40 లక్షలు బీఎస్ సీ కిందివే.

2. అఫోర్డబుల్‌ హౌసింగ్‌ ఇన్‌ పార్ట్‌నర్‌షిప్‌ (ఏహెచ్ పీ):

ప్రభుత్వ సంస్థలు లేదా ప్రైవేటు డెవలపర్ల భాగస్వామ్యంతో నిర్మించే అందుబాటు గృహాలను అర్హులైన ఈడబ్ల్యూఎస్ కుటుంబాలు కొనుగోలు చేసేందుకు ఈ విభాగం ఉపయోగపడుతుంది. ఇళ్ల కార్పెట్‌ ఏరియా సాధారణంగా 30–45 చదరపు మీటర్ల మధ్య ఉంటుంది. ఆగస్టు 9 నాటికి సుమారు 2.48 లక్షల ఇళ్లు ఈ విభాగంలో మంజూరయ్యాయి.

3. అఫోర్డబుల్‌ రెంటల్‌ హౌసింగ్‌ (ఏఆర్ హెచ్):

ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు కొనుగోలు చేయడం సాధ్యం కాకపోవడంతో.. వలస కార్మికులు, నిరాశ్రయులు, పనిచేసే మహిళలు, పారిశ్రామిక–నిర్మాణ రంగ కార్మికులు, అనధికార రంగంలో పనిచేసేవారికి అందుబాటు అద్దె ఇళ్లను అందించడంపై ఈ విభాగం దృష్టి పెడుతుంది. ఆగస్టు 9 నాటికి 13,046 అద్దె గృహ యూనిట్లు మంజూరయ్యాయి.

4. ఇంట్రెస్ట్‌ సబ్సిడీ స్కీమ్‌ (ఐఎస్ఎస్):

ఈడబ్ల్యూఎస్, ఎల్ ఐజీ, ఎంఐజీ వర్గాలకు చెందిన అర్హులైన కుటుంబాలు ఇల్లు కొనుగోలు, తిరిగి కొనుగోలు లేదా నిర్మాణం కోసం తీసుకునే గృహ రుణాలపై వడ్డీ రాయితీ కల్పించే విధానం ఇది. 2024 సెప్టెంబర్‌ 1 లేదా ఆ తర్వాత మంజూరై, పంపిణీ చేసిన అర్హత కలిగిన రుణాలకు ఈ ప్రయోజనం వర్తిస్తుంది.

ఎవరికి ఎంత ఆదాయం ఉండాలి?

పీఎంఏవైయూ 2.0లో అర్హతను ఆదాయ వర్గాల ఆధారంగా నిర్ణయిస్తున్నారు. ఏడాదికి రూ.3 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు ఈడబ్ల్యూఎస్, రూ.3–6 లక్షల మధ్య ఎల్ఐజీ, రూ.6–9 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు ఎంఐజీ కేటగిరీల్లోకి వస్తారు. పథకంలోని నిర్దిష్ట నిబంధనలు, ఇతర అర్హతలను కూడా లబ్ధిదారులు పూర్తి చేయాల్సి ఉంటుంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0