ఎన్నారై నుంచి ఆస్తి కొంటున్నారా.. కొత్త నిబంధనలు తెలుసుకోండి

From October 1, 2026, eligible resident individuals and Hindu Undivided Families (HUFs) purchasing property from an NRI will no longer need to obtain a separate TAN to deduct and deposit TDS.

Sep 2, 2026 - 08:19
Sep 4, 2026 - 06:35
 0  300
ఎన్నారై నుంచి ఆస్తి కొంటున్నారా.. కొత్త నిబంధనలు తెలుసుకోండి
nri-property-purchase-tds-tan-pan-rules-2026

విదేశాల్లో నివసిస్తున్న ఎన్నారై నుంచి ఇల్లు, ఫ్లాట్‌ లేదా ఇతర స్థిరాస్తిని కొనుగోలు చేసే వారికి కేంద్ర ప్రభుత్వం కీలక ఊరట కల్పించింది. ఇప్పటివరకు ఇలాంటి ఆస్తి కొనుగోలు సమయంలో టీడీఎస్ మినహాయించి ప్రభుత్వానికి జమ చేసేందుకు కొనుగోలుదారు ప్రత్యేకంగా ట్యాన్ నెంబర్ తీసుకోవాల్సి వచ్చేది. అయితే 2026 అక్టోబర్‌ 1 నుంచి ఈ నిబంధన మారనుంది. అర్హత కలిగిన రెసిడెంట్‌ వ్యక్తులు, అవిభాజ్య హిందూ కుటుంబాలు ఇక ప్రత్యేకంగా ట్యాన్ తీసుకోకుండానే తమ పాన్ ఆధారంగా టీడీఎస్ చెల్లించే అవకాశం పొందనున్నారు.

ఇప్పటివరకు ఎలా ఉండేది?

భారత్‌లో నివసిస్తున్న వ్యక్తి లేదా అవిభాజ్య హిందూ కుటుంబాలు.. విదేశాల్లో నివసిస్తున్న ఎన్నారై నుంచి స్థిరాస్తిని కొనుగోలు చేసినప్పుడు, విక్రేతకు చెల్లించే మొత్తంపై వర్తించే టీడీఎస్ ను మినహాయించాలి. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి కొనుగోలుదారు ట్యాన్ పొందాల్సి ఉంటుంది. అనంతరం దాని ఆధారంగా టీడీఎస్ ను ప్రభుత్వానికి జమ చేయడం, సంబంధిత టీడీఎస్ స్టేట్‌మెంట్‌ దాఖలు చేయడం వంటి ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఒక ఆస్తి కొనుగోలు కోసం మాత్రమే ట్యాన్ అవసరమైన వారికి ఈ అదనపు ప్రక్రియ కొంత ఇబ్బందికరంగా మారేది.

అక్టోబర్‌ 1 నుంచి ఏం మారుతుంది?

2026 అక్టోబర్‌ 1 నుంచి అర్హత కలిగిన రెసిడెంట్‌ వ్యక్తి లేదా అవిభాజ్య హిందూ కుటుంబాలు ట్యాన్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉండదు. బదులుగా కొనుగోలుదారు తన పాన్ ఆధారంగా టీడీఎస్ ను చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఎన్నారై నుంచి ఆస్తి కొనుగోలు చేసే సమయంలో టీడీఎస్ బాధ్యత మాత్రం కొనసాగుతుంది. అమితే, ట్యాన్ మాత్రం అవసరంలేదు. ఎన్నారై ఆస్తి విక్రయంపై టీడీఎస్ రేటు ఒకే విధంగా ఉండదు. విక్రేతకు ఏర్పడే మూలధన లాభాల స్వభావం, ఆస్తి ఎంతకాలం విక్రేత వద్ద ఉంది, వర్తించే పన్ను నిబంధనలు వంటి అంశాల ఆధారంగా రేటు ఉంటుంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0