మూసీ ప్రాజెక్టులో మరో కీలక అడుగు రూ.వేల కోట్ల పనులకు టెండర్లు

The Telangana Musi Riverfront Development Corporation Limited (MRDCL) has invited two major tenders for riverfront development, river training, cleaning, flood control and infrastructure works along the Musi.

Oct 25, 2026 - 02:47
 0  35
మూసీ ప్రాజెక్టులో మరో కీలక అడుగు రూ.వేల కోట్ల పనులకు టెండర్లు
musi-riverfront-project-two-major-tenders-hyderabad

మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MRDCL) రెండు కీలక టెండర్లను ఆహ్వానించింది. ఈ మేరకు 2026 అక్టోబర్ 12న టెండర్ నోటీసును విడుదల చేసింది. మూసీ నది పరివాహక ప్రాంతంలో రివర్‌ఫ్రంట్ అభివృద్ధి, రివర్ ట్రైనింగ్, రివర్ క్లీనింగ్, వరద నివారణ పనులతో పాటు రోడ్లు, బ్రిడ్జిలు, యుటిలిటీ కారిడార్లు, ఫుట్‌పాత్‌లు, ల్యాండ్‌స్కేపింగ్ వంటి పనులు చేపట్టనున్నారు. 

మొదటి టెండర్‌లో ఉప్పల్ నల్ల చెరువు నుంచి గౌరెల్లి వరకు ఉన్న ప్రాంతంలో చైన్‌జ్ 1+320 నుంచి 8+850 వరకు పనుల్ని  ప్రతిపాదించారు. రెండో టెండర్‌లో జోనల్-18 ఉప్పల్ సర్వే నగర్ నుంచి బాపూఘాట్ వరకు చైన్‌జ్ 0+690 నుంచి 12+212 వరకూ అభివృద్ధి పనులను చేప‌డ‌తార‌ని పేర్కొన్నారు. రివర్ ట్రైనింగ్, రివర్ క్లీనింగ్‌తో పాటు ఓఆర్ఆర్‌ సమీపంలో కనెక్టివిటీ, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా ఈ పనుల్లో భాగంగా ఉన్నాయి.

టెండర్ల షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న సాయంత్రం 4 గంటల నుంచి డాక్యుమెంట్లు అందుబాటులోకి వ‌చ్చాయి. అక్టోబర్ 29న మధ్యాహ్నం 3 గంటలకు ప్రీ-బిడ్ సమావేశం జరుగుతుంది. నవంబర్ 26న సాయంత్రం 5 గంటల వరకు బిడ్లు సమర్పించవచ్చు. నవంబర్ 27న ఉదయం 11 గంటలకు బిడ్లు తెరుస్తారు. ఈ పనులు పూర్తయితే మూసీ పరివాహక ప్రాంతంలో వరద నియంత్రణ, రహదారి అనుసంధానం, నది పరిసరాల అభివృద్ధికి ఊతం లభించే అవకాశం ఉంది. అయితే ప్రాజెక్టు అమలు, పనుల వ్యయం, పునరావాసం, పర్యావరణ అంశాలపై తదుపరి చర్యలు కీలకం కానున్నాయి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0