ఒక శాతం వడ్డీకే బ్యాంక్ లోన్.. ఎలా అంటే?

A loan against a fixed deposit can potentially reduce the effective cost of borrowing. For example, an SBI fixed deposit of ₹1 lakh for two years is stated to earn 6.4% annual interest, while an overdraft against the deposit can be available up to 90% of the FD value at an interest rate of around 7.4%.

Sep 18, 2026 - 07:38
 0  9
ఒక శాతం వడ్డీకే బ్యాంక్ లోన్.. ఎలా అంటే?
loan-against-fd-1-percent-interest

ఏడాదికి ఒక శాతం వడ్డీకే బ్యాంకు లోన్ ఎలా తీసుకోవాలో తెలుసా? ప్రస్తుతం పర్సనల్ లోన్ తీసుకుంటే 12 శాతం నుంచి 18 శాతం వడ్డీ పడుతుంది. అదే క్రెడిట్ కార్డు మీద లోన్ తీసుకుంటే 36 శాతం నుంచి 48 శాతం వడ్డీ కట్టాల్సిందే. అలా కాకుండా కేవలం ఒక శాతం వార్షిక వడ్డీకే బ్యాంకు నుంచి రుణం వస్తుందంటే సూపరే కదా? అది ఎలాగో చూద్దాం. ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రెండేళ్ల కాలపరిమితికి రూ.లక్ష ఫిక్స్ డ్ డిపాజిట్ చేయండి. దానిపై బ్యాంకు 6.4 శాతం వడ్డీ ఇస్తుంది.

వెంటనే మనం ఆ డిపాజిట్ పై ఓవర్ డ్రాప్ట్ తీసుకోవచ్చు. 90 శాతం మొత్తం వరకు ఓడీ వస్తుంది. అంటే, మీరు డిపాజిట్ చేసిన రూ.లక్షలో రూ.90వేల వరకు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆ మొత్తాన్నిమనం ఎన్ని రోజుల వినియోగిస్తే, అన్ని రోజులకే వడ్డీ లెక్కిస్తారు. అది ఏడాదికి 7.4 శాతం చొప్పున ఉంటుంది. ఫిక్స్ డ్ డిపాజిట్ పై వస్తున్న 6.4 శాతం వడ్డీ తీసేస్తే.. మీకు నికరంగా పడే వడ్డీ కేవలం ఒక శాతం మాత్రమే.

అసలు మీ దగ్గర డబ్బులే ఉంటే ఫిక్స్ డ్ డిపాజిట్ ఎందుకు చేస్తాం? మళ్లీ ఓడీ ఎందుకు తీసుకుంటా అనే సందేహం రావొచ్చు. అయితే, ఇప్పటికే ఓడీ ఉండి డబ్బు అవసరమై దానిని బ్రేక్ చేయడం కంటే ఇలా ఓడీని వినియోగించుకోవడం తెలివైన పద్దతి. దీనివల్ల అటు ఫిక్స్ డ్ డిపాజిట్ బ్రేక్ కాదు. దానిపై రావల్సిన ప్రయోజనాలు కూడా వస్తాయి. అదే సమయంలో కేవలం ఒక శాతం వడ్డీకే రుణం వస్తుంది. ఫిక్స్ డ్ డిపాజిట్ ఉన్నవాళ్ల సంగతి సరే.. మరి అది లేనివాళ్ల పరిస్థితి ఏమిటి అంటే.. దానికి కూడా ఓ మార్గం ఉంది.

నెలకు రూ.10వేలతో రికరింగ్ డిపాజిట్ ఓపెన్ చేయాలి. ఏడాది తర్వాత అది రూ.1.20 లక్షలు అవుతుంది. దానిని ఎఫ్ డీ చేస్తే సరిపోతుంది. అప్పుడు మీ సొమ్ము అలాగే భద్రంగా ఉండటంతోపాటు అవసరమైన మేర మొత్తాన్ని ఒక శాతం వడ్డీకే వినియోగించుకునే వెసులుబాలు దక్కుతుంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0