నీటి కొర‌త‌ ఏర్ప‌డే న‌గ‌రంలో పెట్టుబ‌డుల్ని పెట్టేదెవ‌రు? 

Warnings by Chief Minister A. Revanth Reddy and water board officials about a possible drinking water shortage in Hyderabad due to El Niño are creating public anxiety.

Nov 16, 2026 - 00:00
Nov 17, 2026 - 01:46
 0  29
నీటి కొర‌త‌ ఏర్ప‌డే న‌గ‌రంలో పెట్టుబ‌డుల్ని పెట్టేదెవ‌రు? 
నీటి కొర‌త‌ ఏర్ప‌డే న‌గ‌రంలో పెట్టుబ‌డుల్ని పెట్టేదెవ‌రు? 
  • శాంతిభ‌ద్ర‌త‌ల‌కు ఢోకా లేదు..
  • మ‌రి, నీటి ల‌భ్య‌త మాటేమిటి? 
  • కొద్ది రోజుల‌య్యాక మంచినీరు దొర‌క‌దంటూ
  • ప్ర‌భుత్వ అధికారులే పోటీ ప‌డి ప్ర‌చారం


రాష్ట్ర ప్ర‌భుత్వం డిసెంబ‌రులో గ్లోబ‌ల్ స‌మ్మిట్‌ను నిర్వ‌హించేందుకు భారీ ప్రణాళిక‌ల్ని ర‌చిస్తోంది. దేశ‌, విదేశీ సంస్థ‌ల్ని హైద‌రాబాద్‌కు ర‌ప్పించి.. పెట్టుబడుల్ని ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తోంది. మ‌రోవైపు ఎల్‌నినో ప్ర‌భావం వ‌ల్ల భాగ్య‌న‌గ‌రంలో తాగునీటి స‌మ‌స్య ఏర్ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని గ‌త కొంత‌కాలం నుంచి సీఎం రేవంత్ రెడ్డి నుంచి జ‌ల‌మండ‌లి ఎండీ అశోక్‌రెడ్డి వ‌ర‌కూ ప‌దేప‌దే చెబుతున్నారు.

ఇదే అద‌నుగా ఎక్క‌డ చూసినా ఎల్‌నినోకు సంబంధించిన వార్త‌లు, వీడియోలే క‌నిపిస్తున్నాయి. దీంతో, ప్ర‌జ‌లంతా తాగునీరు దొర‌క‌దేమోన‌ని భ‌యాందోళ‌న చెందుతున్నారు.

కొంద‌రైతే మాదాపూర్ వంటి ప్రాంతాల్లో హాస్ట‌ళ్ల‌ను మూసివేసే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. ఈ క్ర‌మంలో.. తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు న‌గ‌రానికి విచ్చేస్తున్న సంస్థ‌లు.. ఈ తాగునీటి కొర‌త ఉన్న హైద‌రాబాద్‌లో పెట్టుబ‌డులు ఎందుకు పెడ‌తాయి?

అస‌లు తాగునీరే దొర‌క‌ని దుస్థితి ఏర్ప‌డే భాగ్య‌న‌గ‌రంలో.. త‌మ అధ్య‌య‌నం కేంద్రాల్ని కానీ జీసీసీ  సెంట‌ర్ల‌ను కానీ ఎందుకు ప్రారంభిస్తాయి? తాగునీటికి అవ‌స్థ ప‌డే సిటీలో ఎందుకు అంత‌ర్జాతీయ సంస్థ‌లు పెట్టుబ‌డుల్ని పెడ‌తాయి? ఒక‌సారి రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ దిశ‌గా ఆలోచించాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఇళ్లను నిర్మిస్తున్నదెవరు? 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0