రూ.50 లక్షల్లోపు ప్లాట్లు ఇక్క‌డే..!

Buying a plot within ₹50 lakh in Hyderabad is not entirely impossible. Several peripheral areas within roughly 20–40 km of the city still offer plots at comparatively affordable prices, with rates ranging from around ₹8,000 to ₹22,000 per square yard.

Aug 23, 2026 - 03:27
 0  17
రూ.50 లక్షల్లోపు ప్లాట్లు ఇక్క‌డే..!
hyderabad-plots-under-50-lakh

హైదరాబాద్‌లో రూ.50 లక్షలతో ప్లాట్ కొనడం అసాధ్యమనే అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ నగరానికి 20 నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో ఇప్పటికీ ఈ బడ్జెట్‌లో మంచి అవకాశాలు ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. అయితే, ఎక్కడ కొనాలి? అన్నది పెట్టుబడి భవిష్యత్తును నిర్ణయించే కీలక అంశం.

ఒకప్పుడు కొల్లూరు, కోకాపేట్, నార్సింగి ప్రాంతాల్లో కూడా ఇదే బడ్జెట్‌లో ప్లాట్లు లభించేవి. కానీ ఇప్పుడు అక్కడ గజం ధరలు భారీగా పెరగడంతో రూ.50 లక్షల్లో ప్లాట్ కొనడం దాదాపు అసాధ్యంగా మారింది. దీంతో పెట్టుబడిదారుల దృష్టి నగర శివారు ప్రాంతాలపై పడుతోంది.

మహేశ్వరం, కందుకూరు, కడ్తాల్, యాచారం, శంకర్‌పల్లి, మొయినాబాద్, చౌదరిగూడ, ఇస్నాపూర్, పటాన్‌చెరు శివారు, చేవెళ్ల కారిడార్ ప్రాంతాల్లో ఇప్పటికీ రూ.12 వేల నుంచి రూ.22 వేల గజం మధ్య ప్లాట్లు లభిస్తున్నాయి. అంటే 200 గజాల ప్లాట్‌ను సుమారు రూ.25 లక్షల నుంచి రూ.45 లక్షల మధ్య కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. తక్కువ ధర కనిపించిందని వెంటనే అడ్వాన్స్ ఇవ్వడం సరైంది కాదు. హెచ్ఎండీఏ లేదా డీటీసీపీ అనుమతులు ఉన్నాయా? రోడ్డు కనెక్టివిటీ ఎలా ఉంది? భవిష్యత్తులో అభివృద్ధి అవకాశాలు ఉన్నాయా? రిజిస్ట్రేషన్‌కు ఎలాంటి ఇబ్బందులు లేవా? వంటి అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలి.

రియల్ ఎస్టేట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్, కొత్త ఇండస్ట్రియల్ కారిడార్లు, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులకు సమీపంలోని ప్రాంతాలను ఎంచుకుంటే దీర్ఘకాలంలో మెరుగైన రాబడి వచ్చే అవకాశం ఉంటుంది.

రూ.50 లక్షల బడ్జెట్‌కు అనుకూల‌మైన ప్రాంతాలివే..

ప్రాంతం                        సుమారు గజం ధర

  • మహేశ్వరం                రూ.12,000- రూ18,000
  • కందుకూరు                రూ.10,000- రూ.16,000
  • యాచారం                   రూ.8,000- రూ.15,000
  • కడ్తాల్                         రూ.8,000-రూ.14,000
  • మొయినాబాద్            రూ.15,000- రూ.22,000
  • శంకర్‌పల్లి                   రూ.15,000- రూ.22,000
  • ఇస్నాపూర్                  రూ.14,000- రూ.20,000
  • చేవెళ్ల కారిడార్            రూ.10,000-రూ.18,000

హైదరాబాద్‌లో రూ.50 లక్షలతో ప్లాట్ కొనలేమనేది పూర్తిగా నిజం కాదు. కానీ ఏ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నాం? ఎలాంటి లేఅవుట్‌ను కొనుగోలు చేస్తున్నాం? అనే రెండు నిర్ణయాలే భవిష్యత్తులో మీ పెట్టుబడి లాభాన్ని నిర్ణయిస్తాయి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0