1.2 కోట్ల నుంచి విల్లాలు..  ఇదిగో.. ఇక్క‌డే లభ్యం..!

Hyderabad’s rising property prices are pushing budget-conscious villa buyers towards the city’s peripheral corridors, where duplex and gated-community villas are still available from around ₹1.2 crore to ₹1.8 crore.

Sep 12, 2026 - 04:16
Sep 12, 2026 - 06:09
 0  10
1.2 కోట్ల నుంచి విల్లాలు..  ఇదిగో.. ఇక్క‌డే లభ్యం..!
hyderabad-budget-villas-from-1-2-crore

హైదరాబాద్‌లో సొంతంగా ఓ డూప్లెక్స్ విల్లా.. గేటెడ్ కమ్యూనిటీలో లగ్జరీ లైఫ్.. చాలామంది మధ్యతరగతి కుటుంబాల కల. కానీ.. ఆ కల నెరవేర్చుకోవాలంటే గచ్చిబౌలి, కొండాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు చూస్తే మాత్రం బడ్జెట్‌ చుక్కలు చూపిస్తోంది. అందుకే నగరానికి కాస్త దూరంగా వెళ్తున్నారు కొనుగోలుదారులు. హైదరాబాద్ శివార్లలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ 1.2 కోట్ల నుంచి 1.8 కోట్ల రేంజ్‌లో డూప్లెక్స్ విల్లాలు కనిపిస్తున్నాయి. మరి ఆ ప్రాంతాలేమిటి? ఎక్కడ 1.3 కోట్ల దగ్గరే విల్లా దొరుకుతోంది? ఎక్కడ 2 కోట్ల మార్క్ దాటింది? ఎయిర్‌పోర్ట్, ఫ్యూచర్ సిటీ ప్రభావంతో దక్షిణ హైదరాబాద్‌లో రేట్లు ఎంత పెరిగాయి? హైదరాబాద్‌లో బడ్జెట్ విల్లాల లెక్క ఏంటో చూద్దాం...

  • హైదరాబాద్‌లో బడ్జెట్ విల్లాలకు శివార్లే కేరాఫ్
  • రూ.1.2 కోట్ల నుంచే డూప్లెక్స్ విల్లా ఆప్షన్లు
  • అమీన్‌పూర్-బీరమ్‌గూడ-ప‌టాన్‌చెరులో రూ.1.3 కోట్లు
  • కీసరలో రూ.1.13 కోట్ల నుంచే 3BHK విల్లాలు
  • శంకర్‌పల్లి-భానూర్‌లో రూ.1.2-1.35 కోట్ల ఆప్షన్లు
  • మహేశ్వరంలో రూ.1.7 కోట్ల రేంజ్‌లో విల్లాలు
  • తుక్కుగూడ-ఆదిభట్లలో రూ.2 కోట్లకు చేరుతున్న ధరలు
  • ఒకే ఏరియాలోనూ విల్లాల ధరల్లో భారీ వ్యత్యాసం
  • రూ.1.2 కోట్ల విల్లా.. రూ.5 కోట్ల ప్రీమియం విల్లా.
  • బడ్జెట్ విల్లా కొనుగోలుదారులకు శివార్లే బెస్ట్ ఆప్షన్


హైదరాబాద్‌లో ఇళ్లకు డిమాండ్ ఉన్నా.. లేకున్నా..  ఇళ్ల ధరలు మాత్రం తగ్గడం లేదు. 2026 జనవరి నుంచి జూన్ వరకు హైదరాబాద్‌లో 19,249 ఇళ్ల అమ్మకాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే 1 శాతం వృద్ధి నమోదైంది. ఇదే సమయంలో 20,466 కొత్త యూనిట్లు మార్కెట్‌లోకి వచ్చాయి. మరోవైపు నగరంలో సగటు నివాస ధర చదరపు అడుగుకు 8,258 కు చేరింది. ఏడాదిలో దాదాపు 7 శాతం పెరుగుదల. అంటే.. మెయిన్ సిటీలో ధరలు పెరుగుతున్న వేళ.. విల్లా కావాలనుకునేవాళ్లకు శివారు ప్రాంతాలే ఇప్పుడు బడ్జెట్ హంట్‌కు గమ్యస్థానాలవుతున్నాయి. 

  •  ముందుగా పశ్చిమ శివార్లకు వెళ్దాం.. అమీన్‌పూర్.. బీరంగూడ.. పటాన్‌చెరు.. బడ్జెట్ విల్లా కోసం చూస్తున్న వారికి ఈ బెల్ట్‌లో కొన్ని ఆప్షన్లు కనిపిస్తున్నాయి. అమీన్‌పూర్‌లో 2,820 చదరపు అడుగుల 3.5 BHK గేటెడ్ కమ్యూనిటీ విల్లా 1.40 కోట్లకు లిస్టయింది. 4 BHK విల్లాలు కూడా 1.75 కోట్ల రేంజ్‌లో కనిపిస్తున్నాయి. బీరంగూడలో 1.30 కోట్ల నుంచి 1.50 కోట్ల మధ్య 3, 4 BHK విల్లాల ఆప్షన్లు ఉన్నాయి. 2,350 చదరపు అడుగుల 3 BHK విల్లా 1.30 కోట్లు.. మరికొన్ని 4 BHK విల్లాలు 1.40 నుంచి 1.48 కోట్ల వరకు ఉన్నాయి. పటాన్‌చెరులోనూ 1.35-1.50 కోట్ల రేంజ్‌లో కొన్ని విల్లాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు.. కొన్ని గేటెడ్ కమ్యూనిటీల్లో క్లబ్‌హౌస్, జిమ్, స్విమ్మింగ్‌పూల్, 24/7 సెక్యూరిటీ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. అంటే 1.2-1.8 కోట్ల బడ్జెట్‌లో విల్లా కోసం వెతికేవారికి ఈ బెల్ట్‌లో కొన్ని ఆప్షన్లు ఉన్నాయి. అయితే.. ఇవి మొత్తం మార్కెట్‌కు వర్తించే సగటు ధరలు మాత్రం కావు.
  •  ఇక ఉత్తర హైదరాబాద్ వైపు వెళ్తే.. కీసర.. గోదుమకుంట.. చేర్యాల్ వంటి ప్రాంతాల్లో విల్లా ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి. కీసరలో 3 BHK విల్లాల ధరలు 1.13 కోట్ల నుంచి 1.42 కోట్ల రేంజ్‌లో కనిపిస్తున్నాయి. అదే ప్రాంతంలో పెద్ద 4 BHK విల్లాలు 2.5 కోట్లకు పైగా ఉన్నాయి. అంటే.. విల్లా ధరను నిర్ణయించేది కేవలం ఏరియా కాదు.. సైజు, బ్రాండ్, నిర్మాణ నాణ్యత, సౌకర్యాలు, లొకేషన్.. అన్నీ కలిపిన లెక్క. కీసర చుట్టుపక్కల తక్కువ బడ్జెట్ ఆప్షన్లు కనిపిస్తున్నా.. ఇక్కడ కొనుగోలుదారులు మాత్రం టైటిల్, లేఅవుట్ అనుమతులు, రెరా విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే. 
  • పశ్చిమ హైదరాబాద్‌కు కనెక్టివిటీ.. ప్రశాంతమైన వాతావరణం.. ఓపెన్ స్పేస్ కావాలనుకునేవారి చూపు పడుతున్న మరో బెల్ట్.. శంకర్‌పల్లి.. భనూర్.. మొకిలా.  శంకర్‌పల్లిలో కొన్ని 3 BHK విల్లాలు 1.35 కోట్ల దగ్గర కనిపిస్తున్నాయి. భానూర్‌లో 2,700 చదరపు అడుగుల 3 BHK విల్లా 1.20 కోట్లకు లభిస్తున్నాయి. కానీ.. అదే మొకిలాలో 2,500 చదరపు అడుగుల 3 BHK విల్లా 3.50 కోట్లకు చేరింది. అంటే.. ఒకే బెల్ట్‌లోనే ధరల్లో ఎంత తేడా ఉందో అర్థం చేసుకోవచ్చు. శంకర్‌పల్లిలోనే 2 కోట్లకు పైగా.. కొన్ని ప్రీమియం విల్లాలు 4-5 కోట్ల రేంజ్‌లో కూడా ఉన్నాయి.
  • దక్షిణ హైదరాబాద్. తుక్కుగూడ.. ఆదిభట్ల.. మహేశ్వరం.. రావిర్యాల. ఒకప్పుడు బడ్జెట్ విల్లాలకు కేరాఫ్‌గా ఉన్న ఈ ప్రాంతాల్లో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ.. ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ.. కొత్త ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంచనాలతో ధరల లెక్కలు మారుతున్నాయి. ఆదిభట్లలో 3 BHK విల్లాల ధరలు 1.78 కోట్ల నుంచి 2.64 కోట్ల వరకు ఉన్నాయి. తుక్కుగూడలో 3 BHK విల్లా 3.38 కోట్ల వరకు వెళ్లింది. కొన్ని 4 BHK ప్రాజెక్టులు 2.11-3.17 కోట్ల రేంజ్‌లో ఉన్నాయి. మహేశ్వరంలో 1.69 కోట్లకు 3 BHK రెడీ విల్లా వంటి ఆప్షన్లు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాజెక్టులు 1.7-2 కోట్ల రేంజ్‌లో ఉన్నాయి. కొత్త ప్రీమియం ప్రాజెక్టుల్లో ధరలు 5 కోట్లకు పైగా చెబుతున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0