9 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్‌కు టెండర్లు వెస్ట్ హైదరాబాద్ ట్రాఫిక్‌కు చెక్?
The Hyderabad Metropolitan Development Authority (HMDA) has invited tenders for a proposed 9-km elevated corridor from Banjara Hills Road No. 12 to Shilpa Layout in Gachibowli, aimed at easing traffic congestion across West Hyderabad.
వెస్ట్ హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా మరో కీలక అడుగు పడింది. బంజారాహిల్స్ నుంచి గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్ వరకు ప్రతిపాదించిన భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి హెచ్‌ఎండీఏ టెండర్లు ఆహ్వానించింది. సెప్టెంబర్ 22లోపు ఆన్‌లైన్ ద్వారా బిడ్లను స్వీకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పనులు ప్రారంభించే అవకాశం ఉంది.
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 నుంచి శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ వరకు సుమారు 9 కిలోమీటర్ల మేర ఈ ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించనున్నారు. సుమారు రూ.1,656 కోట్ల అంచనా వ్యయంతో డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్-డీబీఎఫ్‌ఓటీ విధానంలో ప్రాజెక్టును చేపట్టనున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో కీలక జంక్షన్లను తప్పిస్తూ వేగంగా ప్రయాణించేలా ఎలివేటెడ్ మార్గాన్ని రూపొందిస్తున్నారు.
రెండు దశల్లో నిర్మాణం
మొత్తం 9 కిలోమీటర్ల కారిడార్‌ను రెండు భాగాలుగా నిర్మించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన డీపీఆర్‌ను అధికారులు సిద్ధం చేశారు. మొదటి దశలో ఫిలింనగర్ నుంచి గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్ వరకు సుమారు 5 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. రెండో దశలో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి హకీంపేట్ కుంట వరకు మరో 4 కిలోమీటర్ల మేర కారిడార్ నిర్మించనున్నారు.
ఆరు చోట్ల ర్యాంపులు
కారిడార్‌పైకి ఎక్కేందుకు, దిగేందుకు ఆరు కీలక ప్రాంతాల్లో ర్యాంపులను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. ఫిలింనగర్, నార్నే రోడ్, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 52, ఐటీసీ కోహినూర్ రోడ్, టీ-హబ్ జంక్షన్, మైండ్‌స్పేస్ ప్రాంతాల్లో ర్యాంపులు రానున్నాయి. దీంతో ప్రధాన రహదారులపైకి వచ్చే వాహనాల సంఖ్య తగ్గి.. రద్దీ కూడళ్లను దాటకుండా ప్రయాణించే అవకాశం లభించనుంది.
మెట్రోకు అనుగుణంగా డిజైన్
భవిష్యత్‌లో ఈ మార్గాల్లో మెట్రో రైలు నిర్మాణం చేపట్టినా ఇబ్బందులు తలెత్తకుండా ఎలివేటెడ్ కారిడార్‌ను డిజైన్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అంటే ప్రస్తుత ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు.. భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టును రూపొందిస్తున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0