మళ్లీ 3 బీహెచ్‌కే వైపు జనం చూపు

Homebuyers are once again showing a strong preference for larger 3 BHK homes, reflecting a shift in housing priorities across major cities. According to ANAROCK’s Consumer Sentiment Survey, 48% of respondents nationwide prefer 3 BHK homes, while the share stands at 52% in Hyderabad.

Oct 1, 2026 - 07:50
Oct 2, 2026 - 03:55
 0  239
మళ్లీ 3 బీహెచ్‌కే వైపు జనం చూపు
hyderabad-3-bhk-demand-homebuyers-preferences

-      మారుతున్న కొనుగోలుదారుల అభిరుచులు

నగర రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో గృహ కొనుగోలుదారుల అభిరుచుల్లో మార్పు కనిపిస్తోంది. గతంలో అందుబాటు ధర, తక్కువ విస్తీర్ణం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చిన కొనుగోలుదారులు ఇప్పుడు మరింత విశాలమైన ఇళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా 3 బీహెచ్‌కే ఇళ్లకు డిమాండ్‌ పెరుగుతోంది. కరోనాకు ముందు అందుబాటు ధరలో ఇళ్లకే ప్రాధాన్యత ఇచ్చిన జనం.. కరోనా తర్వాత విశాలమైన ఇళ్లవైపు మొగ్గు చూపారు. అనంతరం ఆర్థిక కారణాలరీత్యా మళ్లీ అందుబాటు ధరలోని ఇళ్లకే ఓటేశారు.

తాజాగా ఇందులో మళ్లీ మార్పు వచ్చింది. అనరాక్ నిర్వహించిన కన్య్జూమర్ సెంటిమెంట్ సర్వేలో ఇది స్పష్టంగా వెల్లడైంది. 14 నగరాల్లో 8,320 మంది కొనుగోలుదారుల అభిప్రాయాలను సేకరించి ఈ సర్వే నిర్వహించారు. దేశవ్యాప్తంగా 48 శాతం మంది 3 బీహెచ్ కే ఇళ్లను కోరుకుంటున్నారు. 2 బీహెచ్ కేలకు 38 శాతం మంది ప్రాధాన్యం ఇచ్చారు. అత్యధికంగా అహ్మదాబాద్ లో 3 బీహెచ్ కేల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంది. అక్కడ 57 శాతం మంది కొనుగోలుదారులు 3 బీహెచ్ కేలను ఇష్టపడుతున్నట్లు సర్వే వెల్లడించింది.

ఢిల్లీ, చెన్నైలలో ఇది 53 శాతం కాగా, మన హైదరాబాద్ లో 52 శాతం మంది 3 బీహెచ్ కేలను కోరుకుంటున్నారు. 4 బీహెచ్ కే, అంతకంటే పెద్ద ఇళ్లకు కూడా కొంత మేర డిమాండ్‌ పెరిగింది. 2024 ప్రథమార్ధంలో దాదాపు 3 శాతంగా ఉన్న ఈ విభాగం.. 2026 మొదటి ఆరు నెలల్లో సుమారు 5 శాతానికి చేరింది. కుటుంబ పరిమాణం, ఇంటి నుంచే పని చేసే అవకాశాలు, ప్రత్యేక గది అవసరం వంటి అంశాలు పెద్ద ఇళ్లకు ఆసక్తి పెరగడానికి కారణాలుగా మార్కెట్‌ విశ్లేషణలు సూచిస్తున్నాయి.

రూ.90 లక్షలు–రూ.1.5 కోట్ల బడ్జెట్‌పై దృష్టి

పెద్ద ఇళ్లకు డిమాండ్‌ పెరగడంతోపాటు కొనుగోలుదారుల బడ్జెట్‌ కూడా కొంత మేర పెరుగుతోంది. సర్వేలో 34 శాతం మంది రూ.90 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ధర ఉన్న ఇళ్లను కోరుకుంటున్నారు. మరో 27 శాతం మంది రూ.1.5 కోట్లకు పైబడిన ఇళ్లను పరిశీలిస్తున్నారు. అంటే కొనుగోలుదారులు కేవలం తక్కువ ధరను మాత్రమే కాకుండా.. ఇంటి పరిమాణం, నాణ్యత, సౌకర్యాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నగర కేంద్ర ప్రాంతాల్లో పెరిగిన ధరల నేపథ్యంలో కొనుగోలుదారులు శివారు ప్రాంతాల వైపు కూడా దృష్టి సారిస్తున్నారు.

అదే సమయంలో వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఇల్లు నిర్మించుకునే అవకాశం ఉండటంతో ప్లాట్లపై ఆసక్తి కూడా పెరుగుతోంది. మొత్తమ్మీద కుటుంబాలకు ఎక్కువ స్థలం, వర్క్‌ఫ్రమ్‌హోమ్‌ కోసం ప్రత్యేక గది, పిల్లల కోసం అదనపు స్థలం, భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొనుగోలుదారులు పెద్ద ఇళ్లను ఎంచుకుంటున్నారు. దీంతో డెవలపర్లు కూడా మిడ్‌-సెగ్మెంట్‌ నుంచి ప్రీమియం విభాగం వరకు 3 బీహెచ్ కే ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0